17, సెప్టెంబర్ 2020, గురువారం

మహాలయ అమావాస్య అంటే ఏమిటి ? ఏఏ రోజుల్లో ఈ అమావాస్య చేయాలి ? ఎటువంటి ఫలితం ఉంటుంది ?

wowitstelugu.blogspot.com

మహాలయ అమావాస్య అంటే ఏమిటి ?


ఏఏ  రోజుల్లో  ఈ అమావాస్య చేయాలి ? 


ఎటువంటి ఫలితం ఉంటుంది ?




భీష్ముడు అంపశయ్యపై ఉన్న సమయంలో ధర్మరాజుకు ఎన్నో హితబోధలు చేశాడు. వాటిలో పితరుల ఆరాధన ద్వారానే దేవతలు కూడా సంతృప్తి చెందుతారన్నాడు. దేవతలు కూడా పితృదేవతలనే ఎంతో భక్తితో పూజిస్తారని చెప్పి పితృ ఆరాధన ప్రాముఖ్యాన్ని తెలిపాడు. పితృదేవతారాధన తప్పనిసరిగా చేయవలసిన సందర్భాల్లో భాద్రపదంలో వచ్చే మహాలయ పక్షాలు కూడా ఒకటి. పితృదేవతల పూజకు ఉద్దిష్టమైనది. సాధారణ శ్రాద్ధదినము వ్యక్తులకు సంబంధించింది. మహాలయ పక్షము సాముదాయకంగా పితుళ్ళను పూజించడానికి ఏర్పడింది. 

మహాలయంలో చేసే శ్రాద్ధకర్మలకు మరీ ముఖ్యమైనవని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మహాలయం (కృష్ణపక్షంలోని పాడ్యమి నుంచి అమావాస్య వరకూ ఉన్న పదిహేను రోజులు) కాలంలో పితరులంతా వారి వారి వారసుల ఇళ్ల పరిసరాల చుట్టూ తిరుగు తుంటారని  పురాణాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే ఈ కాలం వారికి చాలా గడ్డు కాలం. విపరీతమైన ఆకలి, దాహంతో అలమటిస్తూ వారసులు అందించే పిండోదకాల కోసం వారివారి ఇళ్ల చుట్టూ సూక్ష్మరూపులై తిరుగుతుంటారు.

ఈ అమావాస్య పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము.ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని,ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండమున ఉంది.

గత జన్మలో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి.

👉 ఈ అమావాస్య చేయక పొతే వచ్చే దోషాలు 

ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు,వైఫల్యాలు ఎదురుకోవడం,

గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం.

కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం.

కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం,

ముఖ్యంగా సంతానా భాగ్యం లేక పోవడం.

పుట్టిన సంతానం జీవించకపోవడం.

సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి.

👉ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుస్తుంది.

పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది. 

ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది. 

తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు. 

చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం,ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది.

పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది.

షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు,ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది. 

సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది. అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి. 

నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. దశమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది. 

ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ది చెందుతుంది. 

ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది. 

త్రయోదశి నాడు శ్రద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి.

చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది. 

అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి.

ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి.ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే,పితృ పక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు.అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు,అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు,పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

ఈ  క్రింది  వీడియో యు. ఆర్. యల్.ల లో  దీని  గురించి తెలుసుకోండి 


Note: 
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.


14, సెప్టెంబర్ 2020, సోమవారం

30రకాల శివ లింగాలు ఆయా లింగాలు వాటి నిర్మాణం అవి ఇచ్చే ఫలితాలు గురించి పరిశీలిద్దామా

wowitstelugu.blogspot.com

30రకాల శివ లింగాలు ఆయా లింగాలు  వాటి నిర్మాణం అవి ఇచ్చే ఫలితాలు గురించి  పరిశీలిద్దామా 



30రకాల శివలింగాలు ఆయా లింగాలు  అవి ఇచ్చే ఫలితా  లు  గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో  వివిధ రకాలు గా వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితా లు   కలుగుతాయో క్రింద  పరిశీలిద్దాము 

శివం.. అంటే మంగళం. శుభకరం. సర్వకాల సర్వావస్థల్లో శివాన్ని అంటే శుభాన్ని ప్రసాదించే వాడే మహాదేవుడు శివుడు. ఆయన రూపాలు అనంతం. బ్రహ్మాండానికి ప్రతిరూపంగా భాసించే ఆయన్ను అనంతంగా చూడలేం కాబట్టి ఆయన్ను లింగరూపంలో అర్చిస్తాం.

జ్యోతిర్లింగాలకు పూజ చేస్తే విశేష ఫలితం వుంటుంది.  అలాగే సిధ్ధులు, పురాణ పురుషులు, మహిమాన్వితులు ప్రతిష్టచేసిన లింగాలను పూజించినా, స్వయంభూ లింగార్చన కూడా మంచి ఫలితం వుంటుంది. లింగాలలో అనేక రకాలు వున్నాయి.  వాటిని పూజిస్తే వివిధ రకాల కామ్యాలు సిధ్ధిస్తాయంటారు.  అవేమిటో తెలుసుకుందాం.
శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచండమైన ఊర్థస్సు ఉద్భవిస్తుంది. దాని ప్రతికూల ఫలితాలు మనపై పడకుండా ఉండేందుకు శివలింగంపై జలధారను పోస్తుండాలి. ఆ దారనుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది.
సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం. రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి.

01. #గంధలింగం:
రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.
02. #పుష్పలింగం:
నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.
03. #నవనీతలింగం:
వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.
04. #రజోమయలింగం:
పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.
05. #ధాన్యలింగం:
యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.
06. #తిలిపిస్టోత్థలింగం:
నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.
07. #లవణలింగం:
హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.
08. #కర్పూరాజ లింగం:
ముక్తిప్రదమైనది.
09. #భస్మమయలింగం:
భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.
10. #శర్కరామయలింగం:
సుఖప్రదం.
11. #సద్భోత్థలింగం:
ప్రీతిని కలిగిస్తుంది.
12. #పాలరాతి లింగం:
ఆరోగ్యదాయకం
13. #వంశాకురమయ లింగం:
వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.
14. #కేశాస్థిలింగం:
వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.
15. #పిష్టమయలింగం:
ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.
16. #దధిదుగ్థలింగం:
కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.
17. #ఫలోత్థలింగం:
ఫలప్రదమైనది.
18. #ధాత్రిఫలజాతలింగం:
ముక్తిప్రదం.
19. #గోమయలింగం:
కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.
20. #దూర్వాకాండజలింగం:
గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.
21. #వైడూర్యలింగం:
శత్రునాశనం, దృష్టిదోషహరం
22. #ముక్తాలింగం:
ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.
23. #సువర్ణనిర్మితలింగం:
బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.
24. #రజతలింగం:
సంపదలను కలిగిస్తుంది.
25. #ఇత్తడిలింగం
కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.
26. #ఇనుములింగం
శత్రునాశనం చేస్తుంది.
27. #అష్టథాతులింగం:
చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.
28. #తుసషోత్థలింగం:
మారణక్రియకు పూజిస్తారు.
29. #స్పటికలింగం:
సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.
30. #సీతాఖండలింగం:
పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.
ఇవి కాకుండా మరికొన్ని శివలింగాలున్నాయి. మన పురాణాల్లో వర్ణ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చారు. దాని ప్రకారం ఏయే వర్ణాలవారు ఏ రకమైన లింగాలను అర్చించాలి అంటూ వివరాలు అందించారు. పురాణాలలో విశదీకరించిన  సమాచారాన్ని అనుసరించి బ్రాహ్మణులు రస లింగాన్ని, క్షత్రియులు బాణ లింగాన్ని, వైశ్యులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలాలింగాన్ని పూజించాలని పురాణాలు సూచిస్తున్నాయి. వితంతువులు స్ఫటిక లింగాన్ని పూజించవచ్చని చెబుతున్నాయి. భక్తుల పూజలందుకుంటున్నాడు పరమేశ్వరుడు.

ఈ క్రింది వీడియో యు. ఆర్ . యల్ లు చూడండి 


Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,  నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.