29, అక్టోబర్ 2018, సోమవారం

Tolly wood Cine comedian and villain Surya kantham biography and interesting facts

టాలీవుడ్ హాస్య నటి విలన్ సూర్యకాంతం గారి  జీవిత చరిత్ర  ఆశక్తికర విషయాలు 

ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్తగారిని అదేనండీ  సూర్యకాంతం గారి ఆమె జయంతి సంధర్భంగా ఆమెను ఒకసారి గుర్తు చేసుకొందాము.సూర్యకాంతం, పేరు వింటేనే ఆంధ్రా కోడళ్ళకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి నాటికీ సాహసించరు. నిజ జీవితాల్లో అత్తగారైనా గయ్యాళి అయితేఅమ్మో - ఆవిడా? సూర్యకాంతమే!’ అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది సహజనట కళా శిరోమణి సూర్యకాంతం. విశేషం ఏమిటంటే, అత్తగారి పాత్రలో ఆమె కనిపించినా, అమెగయ్యాళే అని తెలిసినా - ఎన్ని సినిమాల్లో చూసినా మాత్రం విసుగు అనిపించకపోవడమే! ఒకే రకం పాత్రల్ని పోషించి - అంతకాలం పాటు, అన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణం ఆమె సహజ నటన. ఆమె తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశారు.

జీవిత విశేషాలు: 

  • సూర్యకాంతం గారు తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ దగ్గరున్న వెంకట క్రిష్ణరాయపురం లో 1924 అక్టోబర్ 28 తన తల్లిదంద్రులకు 14 సంతానంగా జన్మించింది.
  • సూర్యకాంతం గారి తండ్రి పేరు పొన్నాడ అనంతరామయ్య గారు, తల్లిపేరు వెంకట రత్నమ్మ గారు.
  • సూర్యకాంతం గారి భర్తపేరు పెద్దిబోట్ల చలపతిరావు గారు (హైకొర్టు జడ్జీ, వీరి వివాహం 1950 లో జరిగింది.)
  • చిన్నప్పటి సూర్యకాంతం చాలా చలాకీ పిల్ల. ఆఖరిపిల్ల కావటంతో ఇంట్లో గారాబం ఎక్కువట. తను అనుకున్నదే సాధించుకునేదట.
  • దీనికి తోడు హిందీ సినిమాలు ఇష్టం. హిందీ హీరోయిన్ అవుదామని సరదా. అయినా అప్పట్లో చలామణీలో ఉండే నీరసపు ఏడుపుగొట్టు హీరోయిన్‌గా ఈ అచ్చతెలుగు అత్తగారు సూర్యకాంతాన్ని అసలు ఊహించగలమా?
  • ఈ లక్షణం వల్లేనేమో బుద్ధిమంతులైన ఒద్దిక టైప్ హీరోయిన్లకు తను పూర్తిగా విరుద్ధం. డిటెక్టివ్ నవలలు చదివేదట.
  • పదిహేనేళ్ళ వయసులో అందరూ అమ్మాయిలే ఉండే నాటక సమాజంతో తిరిగి నాటకాలు వేసేదట. సతీ సక్కుబాయి, కృష్ణ తులాభారం, చింతామణి నాటకాల్లో వేషాలు ఇంట్లోవాళ్లకి ఇష్టం లేకపోయినా తానేమీ పట్టించుకునేది కాదట.
పిల్లలు కలగకపోవటంతో సూర్యకాంతం తన అక్క కొడుకును పెంచుకుంది.  ఆమెకు వండటమన్నా, తినటమన్నా, అందరికీ కడుపునిండా తినిపించటమన్నా ఎంతో ఆనందం. ఇంటినుంచి ప్రారంభమై విస్తరించే ఉదారత్వం అది. అలాగే ఆమె దానధర్మాలు కూడా బాగానే చేసేదట.
  • సూర్యకాంతం గారు ఒక ప్రముఖ సినీ నటితెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందింది.
  • కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చిందిబి.నాగిరెడ్డి,   చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు.
  •  సూర్యకాంతం గారు వృత్తిలో సాధించిన విజయాలు సహజ నట శిరొమణీ, హస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణా, రంగస్తల సిరోమణి.
  •  సూర్యకంతం గారికి మహానటి సావిత్రి గారి జ్ఞాపకచిహ్నము పురస్కారం లభించింది. (2) గౌరవ డాక్టరేట్ పురస్కారాని పద్మావతి మహిళా యూన్వర్సిటీ నుండి అందుకొన్నారు.
  • సూర్యకాంతం గారు నటించిన మేటి చిత్రాలు బ్రతుకుతెరువు, దొంగరాముడు, మాయాబజార్, తోడికోడళ్ళు, అప్పుచేసి పప్పుకూడు, మాంగల్యబలంఇద్దరు మిత్రులు, వాగ్దానం, వెలుగునీడలు, మంచిమనసులు, రక్తసంబంధం, సిరిసంపదలు, గుండమ్మకథ, చదువుకున్న అమ్మాయిలు, మూగమనసులుడాక్టర్ చక్రవర్తి, ఉమ్మడికుటుంబం, ఆత్మీయులు, దసరాబుల్లోడు, అమాయకురాలు, కాలం మారింది మొదలగునవి
  • రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్యకాంతం, రమణారెడ్డిసూర్యకాంతం, ఎస్.వి.రంగారావు - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు
  • సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి
లావైపోతానన్న బాధ లేదు. అప్పటి హీరోయిన్లెవరికీ ఆ బాధ లేదనుకోండి. సుఖంగా ముద్దబంతిపువ్వుల్లా నిండుకుండల్లా బ్రతికేవారు తెరమీదా బయటా కూడా.లావుపాటి అత్తగారు అందం. ఆమె ముక్కందం. మార్కస్ బార్ట్‌లే కెమెరాలోంచి మెరిసే ఆ ముక్కుపుడక ఇంకా అందం. ముద్దుగా ఉండే పెదవులని వొంకర్లు తిప్పటం, ఎడంచెయ్యి విసురుతూ మెటికలు విరుస్తూ 'మాయదారి సంత, మాయదారి సంతాని' అంటూ మాటల్ని జోరుగా విసరటం మరీ అందం.మాటలో నెమ్మది లేనేలేదు. చిన్నతనంలో ఉండే జోష్ ఆమెను చివరిదాకా వదిలినట్టే కనబడదు. వ్యంగ్యపు మాటలని విరిచి మీద విసరటం, అంతలోనే ముక్కు ఎగబీల్చి, కళ్ళనీళ్ళు పెట్టుకోవటం, అంతా జోరుగానే సాగుతాయ్.
  • గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.
  • సూర్యకాంతం గారి ఆఖరి చిత్రం ఎస్ పి పరశురాం (1994).
  •  సూర్యకాంతం గారు డిసంబర్ 18, 1994 హైదరాబాదులో తన 70 ఏట మరణించారు.



    ఇతర ఆశక్తికర విషయాలు ... 
    1. కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు అక్టోబర్ 28, 1924 న పుట్టిన ఆఖరి ఆడపిల్ల సూర్యకాంతం. ఈ రోజు (అక్టోబర్ 28) ఆమె 93వ జయంతి.విశాలమైన పసుప్పచ్చటి ఆ పువ్వులాగానే నిండుగానూ తెరనిండుగానూ కళకళలాడుతూ బ్రతికింది మన తెలుగు నటి, నిన్నమొన్నటి తరాలవరకూ పరిచయం అక్కర్లేని మన సూర్యకాంతం.
    2. నశించిన ఒక తెలుగు గయ్యాళి భాషాసంస్కృతులకు ప్రతీక ఆమె. ఓ ఇరవై ఏళ్ళ క్రితం కూడా ఎవరినైనా ఉద్దేశిస్తూ "అమ్మో ఆవిడా? గయ్యాళి బాబోయ్!" అనటానికి బదులు, "అమ్మో ఆవిడా? సూర్యకాంతం!" అనేవారు జనం.అంతలాగా గయ్యాళితనాన్ని ఆవాహన చేసుకుంది సూర్యకాంతం.
    3. వాడుక తెలుగుభాష ఎంతగానో మారిపోయిన ఈ రోజుల్లో గయ్యాళితనం ఉన్నాకూడా దానికి చక్కటి భాషనిచ్చి నిలబెట్టే తెలుగుతెర వీరనారులు ఇంకెవరూ లేరు.ఆ సరదా సరదా తిట్లూ, ముక్కూ మూతీ విరవటాలూ, చేతులు విసరటాలూ, సర్వాంగాలతోనూ హాస్యాన్ని ముద్దుగా అభినయించటాలూ లేనేలేవు.
    4. 'గుండమ్మ కథ' లో సూర్యకాంతం పాత్రను సినిమాలో పరిచయంచేసే సీను ఎలా ఉండాలా అని స్క్రీన్‌ప్లే చర్చల్లో అందరూ ఆలోచిస్తుంటే నిర్మాత చక్రపాణి "సూర్యకాంతం ఉంటే చాలు. ఆమె పాత్ర ఎలాంటిదో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఆవిడ పాత్ర ఇలా ఉంటుందని వేరే సీన్లతో నిరూపించే అవసరం లేదు'' అన్నార్ట.అంటే అంతలాగా ఆమెను తెలుగుతెర గయ్యాళిగా చేసేయటం, చూసేయటం జరిగిపోయేదన్నమాట.
    5. సినీ  ప్రపంచం ఇరుకులోంచే విశ్వరూపం ఎత్తి, ఓ ముప్పై సంవత్సరాలపాటు ఆ టైప్‌కే వన్నెలు దిద్దగలిగిన సామర్ధ్యం సూర్యకాంతానిది. ఆమె విషయంలో ఆ తరువాత ఆమెకు వారసుడు బ్రహ్మానందమే. ఈయన తన మూసలోనే ఇంకొన్ని పిల్ల మూసల్ని సృష్టించే ప్రయత్నాలు కూడా చేశారు.
    6. జెమినీ వాళ్ళు 'చంద్రలేఖ' అనే సినిమాను భారీయెత్తున తీస్తున్నారని తెలుసుకుని ఇంకో ఇద్దరు స్నేహితురాళ్ళతో కలిసి మద్రాసుకు ప్రయాణం కట్టింది.
    7. చంద్రలేఖ సినిమాలో వేస్తే అక్కడినుంచి హిందీ సినిమాలోకి ప్రవేశం దొరుకుతుందని ఆమె ఉద్దేశ్యం.
    8. జెమినీలో చిన్నవేషం దొరికింది కూడా. ఇంతలోనే దర్శకుడు సి. పుల్లయ్య ఆమెను తన 'నారద నారది' సినిమాలో మరో చిన్నవేషమిచ్చి 1946లో తెలుగు సినిమాలోకి లాక్కొచ్చేశారు. తరువాత 'ధర్మాంగద'లో వేసింది.
    9. సంసారం (1950) సినిమా ద్వారా బాగా గుర్తింపు వచ్చింది. 'సంసారం'లో తన ఇరవై ఆరో ఏట, రేలంగికి తల్లిగా అరవయ్యేళ్ళ వృద్ధపాత్ర వేసింది. అప్పుడే గుంటూరుకు చెందిన న్యాయమూర్తి పెద్దిభొట్ల చలపతిరావు ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు.

    సూర్యకాంతం నటించిన సినిమాలు...

    ధర్మాంగద (1949), సంసారం (1950), పెళ్ళిచేసి చూడు (1952), బ్రతుకుతెరువు (1953), కన్యాశుల్కం (1955) (మీనాక్షి), దొంగరాముడు (1955), చరణదాసి (1956), శ్రీ గౌరీ మహత్యం (1956), భాగ్యరేఖ (1957), మాయాబజార్ (1957), తోడికోడళ్ళు (1957), దొంగల్లో దొర (1957), అప్పుచేసి పప్పుకూడు (1959), మాంగల్యబలం (1959), కృష్ణలీలలు (1959), భాగ్యదేవత (1959), జయభేరి (1959), శాంతినివాసం (1960), ఇద్దరు మిత్రులు (1961), పెళ్లికాని పిల్లలు (1961), భార్యా భర్తలు (1961), వాగ్దానం (1961), వెలుగునీడలు (1961), శభాష్ రాజా (1961 కలసి ఉంటే కలదు సుఖం (1961), మంచిమనసులు (1962), రక్తసంబంధం (1962), సిరిసంపదలు (1962), గుండమ్మకథ (1962), తిరుపతమ్మకథ (1963), నర్తనశాల (1963) (అథిది పాత్ర), పరువు ప్రతిష్ఠ (1963), చదువుకున్న అమ్మాయిలు (1963), మురళీకృష్ణ (1964), మూగమనసులు (1964), డాక్టర్ చక్రవర్తి (1964), ఉయ్యాల జంపాల (1965), నవరాత్రి (1966), సంగీతలక్ష్మి (1966), ఆస్తిపరులు (1966), కన్నెమనసులు (1966), బ్రహ్మచారి (1967), సుఖ దు:ఖాలు (1967), ఉమ్మడికుటుంబం (1967), అత్తగారు-కొత్తకోడలు (1968), బుద్ధిమంతుడు (1969), ఆత్మీయులు (1969), బాలరాజు కథ (1970), దసరాబుల్లోడు (1971), అమాయకురాలు (1971), కాలం మారింది (1972), కొడుకు కోడలు (1972), అందాల రాముడు (1973), ముత్యాల ముగ్గు (1975), సెక్రటరి (1976), గోరంతదీపం (1978), రాధాకృష్ణ (1978), కార్తీక దీపం (1979) (శారదా తల్లి), వియ్యాలవారి కయ్యాలు (1979), చుట్టాలున్నారు జాగ్రత్త (1980), పెళ్ళిచూపులు (1983 బంధువులు వస్తున్నారు జాగ్రత్త (1989), వన్ బయ్ టూ (1993)

    అత్తగారికి ఒక్కప్పటి ఐకాన్ సూర్యకాంతం. ఆమె  ఉన్న సీన్ లో మొత్తం, ఇంకెవరు ఇంకెన్ని నటనలు ప్రదర్శిస్తున్నా పట్టదు. అలా సూర్యకాంతాన్ని చూస్తూనే ఉంటే, ఈమె ఎప్పుడూ పాసిటివ్‌ గా అసలుండ లేదా అనిపించేలా నటిస్తూనే ఉంటుంది.మిగతా నటుల మాటలకు ఈమె ముఖంలో ఏదో ఒక రియాక్షన్ కనిపిస్తూనే ఉంటుంది. కెమెరా ఆమె మీదకు ఫోకస్ అయి ఉండాలనేం లేదు. అలా ముఖంలో హావభావాలు ప్రదర్శిస్తూనే ఉంటుంది. అంతటి చలాకీతనాన్ని నింపుకుని పుట్టింది సూర్యకాంతం, తెలుగు ప్రేక్షకులు ఆమెని ఎన్నటికీ మరిచి పోలేరు. మర్చి పోరు...
    ఈ వ్యాసం తెలుగు చలనచిత్ర నటీమణి సూర్యకాంతం గురించి. ... తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ...

    Note:  
    అలాగే నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి . నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి.  మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి. కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ 

    ఇంకా పూర్తి వివరాల కోసం ఈ క్రింది యూ.ఆర్.యల్. వీడియోలు చూడండి.

    Dec 18, 2014 - Uploaded by NBN TELUGU
    SURYAKANTHAM BIOGRAPHY - NBN. NBN TELUGU. Loading ... సూక్ష్మంలో మోక్షం – వెరసి పెద్దిభొట్ల సూర్యకాంతం.

    Mar 26, 2017 - Uploaded by C D
    Real life and history of actress Suryakantham Telugu Gayali atta. C D. Loading... Unsubscribe from C D ...
    Jan 14, 2014 - Uploaded by iDream Telugu Movies
    Aathmeeyulu Movie - Suryakantham, Vijaya Nirmala Comedy Scene. iDreamTelugu Movies. Loading ...
    Oct 29, 2017 - Uploaded by News Mantra
    Unknown Facts About Suryakantham | Suryakantam Full Life Details | Celebrities Updates | News Mantra ...
    Apr 18, 2017 - Uploaded by telugu world
    actress suryakantham rare photos || suryakantham family photos ... photos || suryakantham comedy scences ...