ఈ పంచ భూతాలు సహకరించకపోతే, మీరెంత ప్రయత్నించినా ఏమీ జరగదు. వాటి సహకారంతోనే, అతి ప్రాధమిక అంశాల నుంచి, పరమోన్నత అంశం దాకా, మీ జీవితం ఒక సంభవమౌతుంది. ఈ పంచభూతాల మీద పట్టు సంపాదించడం కోసం చేసే ప్రాధమిక సాధననే యోగ లేదా భూతశుద్ధి అని అనవచ్చును
ఈ పంచభూతాల మానవ వ్యవస్థకు ఒక ద్వారం వంటివి.
ఒక ద్వారాన్ని మీరు రెండు రకాలుగా చూడవచ్చు – మీకెప్పుడూ మూసిన ద్వారమే ఎదురౌతుంటే, మీకు ద్వారమంటే మిమ్మల్ని నిలిపివేసేది అని అనిపిస్తుంది. మీకు ద్వారాలు తెరుచుకుంటుంటే, అప్పుడు మీకు ద్వారమంటే మరో దానిలోకి వెళ్ళేందుకు అవకాశం అని అనిపిస్తుంది. ఏది ఏమైనా ద్వారం అదే, కాని మీరు దానికి ఎటు వైపున ఉన్నారు అన్నదే మీ జీవితంలోని ప్రతి దానినీ నిర్ణయిస్తుంది. చివరకు దేశ కాలాలను సహితం. మీరు ఈ శరీరాన్ని ఒక అవకాశంగా అనుభూతి చెందుతున్నారా లేక ప్రతి బంధనంగానా అనేది కూడా ఈ పంచ భూతాలు ఎంత వరకు మీకు సహకరిస్తున్నాయి అన్నదాని మీదనే ఆధారపడి ఉంటుంది.
పంచభూతాల పై యోగ ద్వారా మానవుడు పట్టు సాధించవచ్చు:
యోగాలోని ప్రతి సాధన కూడా వ్యక్తిగతంగానూ, విశ్వపరంగానూ - పరమోన్నతమైన దానిని మీరు అందుకునే విధంగా, ఈ పంచభూతాలను మీరు వ్యవస్థీకరించుకునేందుకే. ఎందుకంటే ఈ రెండూ ఈ పంచభూతాల ఆట మాత్రమే కాబట్టి. మీ పరమోన్నత సంభావ్యతకు, వ్యక్తి భౌతికత అనేది మీకు ఆధారభూతమైన మెట్టా లేక అడ్డంకా అనేది, మీరు ఈ పంచభూతాలతో ఎలా వ్యవహరిస్తున్నారు అనేదాని మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మీరుగా ఉన్నది - కొంత భూమి, నీరు, గాలి ఇంకా వేడిమి. ఈ అంశాలు అన్నీ మీ తోటలో ఉన్నాయి, కాని ఈ నాలుగింటినీ ఒక మానవునిగా చేయడానికి కావలసిందల్లా కాస్తంత దైవ స్పర్శ (విశ్వ శక్తి ) మాత్రమే.
పంచభూతాలను మీరు ఉపయోగించుకోవడం నేర్చుకోగలిగితే, మానవునిగా ఉండడమే గొప్ప విషయం అని తెలుసుకుంటారు.
ఇక్కడే కూర్చుని మీ శరీరంలో ఉన్న ఈ భూమి, నీరు, గాలి, అగ్ని ఎలా పనిచేస్తున్నాయో అనే విషయం పట్ల మీరు స్పృహతో ఉంటే, మీరు మీ జీవితాన్ని ఎంతో సునాయాసంగా జీవించగలరు. ఎంతవరకు అంటే, మిగతా వారందరూ మీరేదో 'సూపర్ మాన్' అనుకునే విధంగా. ఇదేదో సూపర్ మాన్ కావడం గురించి కాదు, మానవునిగా ఉండడమే ఎంతో గొప్ప (సూపర్) అని తెలుసుకోవడం. మీ మానవతనూ, ఈ మానవ (జీవ)వ్యవస్థనూ ఒక అడ్డంకిగా కాక, ఒక అవకాశంగా మీరు ఉపయోగించుకోవడం నేర్చుకోగలిగితే, మానవునిగా ఉండడమే గొప్ప విషయం.
మీ మానవ శరీరంలో ఈ పంచభూతాలు ఎంతెంత స్ధాయిలో ఉన్నాయి
ఈ పంచభూతాలలో మీరు 'ఆకాశం' గురించి పట్టించుకోవలసిన పనిలేదు. మిగతా నాలుగింటిలో, నీరు మీ శరీరంలో 72 శాతం నీరే. మరో 12 శాతం భూమి, మరో 6 శాతం గాలి, అది చాలా సులువుగా స్వాధీనంలోకి తెచ్చుకోగలిగేది, ఎందుకంటే శ్వాస ఉంది కాబట్టి, దానిని ఒక నిర్ణీత పద్ధతిలో మీరు మీ స్వాధీనంలోకి తెచ్చుకునే వీలుంది. మరో 4 శాతం అగ్ని. ఈ అగ్నిని స్వాధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా కూడా మీరు ఎన్నో చేయవచ్చు. మిగిలినది ఆకాశం. హాయిగా బతకడానికి ఈ మిగిలిన నాలుగు చాలు. ఆకాశం లో ఉండేది సూర్యుడు సూర్య కాంతి సూర్యకాంతి వల్ల జీవులు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు.
పంచభూత దేవాలయాలు
ఈ పంచభూతాలకు, ఐదు దేవాలయాలు ఉన్న దేశం మన భారత దేశం. ఇవి భౌగోళికంగా డక్కన్ పీఠభూమిలో ఉన్నాయి. నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్ర ప్రదేశ్ లో. ఈ దేవాలయాలు అర్చనకు కాకుండా, సాధన కోసం నిర్దేశింపబడ్డాయి. ఈ పంచభూతాల మీదా సాధన చేయడానికి ప్రజలు ఒక దేవాలయం నుంచి మరో దేవాయానికి ఒకప్పుడు వెళ్ళేవారు.
ఒక దేవాలయంలో భూమి మూలకం పై సాధన చేసేవారు. నీటి మూలకం పై సాధన చేయడానికి తరువాతి దేవాలయానికి అలా ఒకదాని తర్వాత ఒకటిగా వెళ్ళేవారు. దురదృష్టవశాత్తూ, సాధన చేసే వాతావరణం కరువై పోవడం వల్ల ఈ దేవాలయాల మధ్య సమన్వయం లోపించింది. ఇప్పుడు ఇంకా ఆ దేవాలయాలు ఉన్నాయి కానీ వాటిలోని పరమార్ధం, సాధన కనుమరుగైపోయాయి. కొన్ని దేవాలయాలలో ఇంకా ఆ స్పందన, మూల భూత లక్షణం మిగిలి ఉన్నది, మరికొన్నింటిలో అది బలహీనమై పోయింది.
పంచ భూతములే హిందువులకి దేవతలు
- ఈ పంచభూతాలను మనం ప్రతిష్టీకరణ చేయవచ్చు. ఉదాహరణకు మనం గాలి దేవుణ్ణి ప్రతిష్ఠ చేద్దామనుకుంటే, దానికి మనం ఒక శక్తి రూపాన్ని సృష్టించవచ్చు. యోగా సంప్రదాయంలో ఉన్నాం కాబట్టి, మనం సామాన్యంగా మానవ ఆకృతిని తయారు చేసుకోము. మనం ఒక దీర్ఘ వృత్తాభాస (ellipsoid) లింగ ఆకారం ఎంచుకుంటాము. ఎందుకంటే అతి తక్కువ సంరక్షణ ద్వారా కూడా అది ఎంతో కాలం నిలిచి పోతుంది.
- మీకు సృష్టి మీద కొంత నియంత్రణ వచ్చినా, మీకు - సృష్టికర్తతో ( భగవంతుడు / విశ్వశక్తి / లేదా ఈ పంచభూతాలు ఏదనుకున్న సరే ) సరాసరి సంబంధం ఏర్సడుతుంది. ఈ శాస్త్రాన్ని, దాని వివిధ వ్యక్తీకరణలనూ శివుడు విపులంగా బోధించినప్పుడు, అక్కడ శిష్యులుగా కూర్చుని ఉన్న సప్తర్షులు, అదంతా చూస్తున్న ఆయన భార్య పార్వతి, ఆశ్చర్యపోయారు. వారికి నమ్మశక్యం కాలేదు. మొత్తం విశ్వం అంతా కేవలం పంచ భూతాలు అని – అందులో ఒకటి ఏమీ లేనిది (ఆకాశం), అంటే కేవలం నాలుగే నాలుగు వస్తువులు ఈ ఈ చరాచర సృష్టికి మూలకారణం. స్త్రీ అయిన పార్వతి, దానికి లొంగిపోయి దానిని తనలో భాగం చేసుకునేందుకు నిశ్చయించుకుంది.
వాస్తు శాస్త్ర ప్రకారం గృహ నిర్మాణంలో అష్ట దిక్కులను పంచ భూతాలతో అన్వయించు కోవడం
- భూమి, నీరు, ఆకాశం, అగ్ని, గాలి. ఇవి మనిషి జీవనాన్ని శాసిస్తాయి. సృష్టికి మూలం ఈ పంచ భూతాలు. వీటిని సక్రమంగా ఉపయోగించడం ద్వారా మనిషి ఆరోగ్యకరమైన జీవితానికి బంగారు బాటలు వేసుకుంటాడు.
- మనం ఒక స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నా లేదా.. ఒక ఇల్లు కొనుగోలు చేసి అందులో సుఖమైన జీవితాన్ని సాగించాలన్నా ఆ ప్రదేశంలో పంచభూతాలు వాస్తు పరంగా ఉండాలి. అలా ఉంటేనే ఆ ప్రదేశాన్ని కచ్చితమైన వాస్తుతో ఉన్న స్థలం లేదా ఇల్లు అంటాం. అలాంటి చోట శుభకరమైన ఫలితాలు ఉంటాయి.
- నిజానికి వాస్తుశాస్త్రం పంచభూతాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. వాస్తు ప్రకారం గృహ నిర్మాణాన్ని చేపట్టేవారు ప్రకృతికి సంబంధించిన పంచభూతాలకు కూడా తప్పక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. పంచ భూతాలకు హిందూ శాస్త్రంలో సముచిత ప్రాధాన్యం ఉండటం అందరికీ తెలిసిన విషయమే.
- ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ ఇల్లు నిర్మించడం వల్ల ఆ గృహస్థులు ఎప్పుడూ సుఖమైన జీవితాన్ని అనుభవిస్తారని వాస్తుశాస్త్రం చెబుతోంది.
- అన్ని ప్రదేశాల్లోనూ పంచభూతాలన్నీ సరిగా లేకపోవచ్చు. దీంతో ఆ ఇంట్లో నివసించే వారికి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలాంటప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించి. శాస్త్ర ప్రకారం సమతుల్యంగా చేసుకుంటే. సుఖమైన జీవితాన్ని గడపవచ్చు.
- ఉదాహరణకి కొన్న స్థలంలోగాని, ఇంట్లోగాని ఏదైనా భాగం కోత ఏర్పడితే ఒక విధంగా నీటి సమస్య అయితే మరో విధంగా ఇంటి కప్పు దోషం అయితే ఇంకో విధంగావంటగదుల్లో ఫ్లాట్ ఫాంల అమరికలో దోషాలుంటే వేరే విధంగా సరి చేసుకోవాలి.
- స్థలంలో గాలి, వెలుతురు సరిగా లేకుంటే ప్రమాద ఘంటికలు మోగుతుంటాయి. ఏవైనా దోషాలుంటే వాటిని వాస్తు ప్రకారం సరిచేయవచ్చు.
మన చేతి వేళ్ళల్లోనే పంచభూతాలు నిక్షిప్తమై ఉన్నాయి అని మీకు తెలుసా ?
మీరు ఎప్పుడైనా పురోహితులు దేవతారాధన చేస్తుండగా చూసే ఉంటారు వివిధ ఆలయాల్లో అర్చకులు దేముడికి హారతి ఇచ్చేటప్పుడు, నైవేధ్యం పెట్టేటప్పుడు వాళ్ళు అరచేతిని తిప్పుతూ వేళ్ళతో కొన్ని ముద్రలు వేస్తుంటారు. అలాగే భరతనాట్యం, కూచిపూడి మొదలైన నాట్యాలలో కూడా చేతి ముద్రలకి ఎంతో విశిష్ఠ స్థానం ఉంది. యోగా చేసేటప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వెయ్యటం మనకి తెలుసు.
మనకి తెలియని శక్తి మన చేతి వేళ్ళలో దాగి ఉంది.
01.బొటను వేలిలో అగ్ని,
02 చూపుడు వేలిలో గాలి,
03. మధ్య వేలిలో ఆకాశం,
04. ఉంగరం వేలిలో భూమి,
05.చిటికిన వేలిలో నీరు ఉంటాయని. ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉంది.
👉మన చేతిలో ఉన్న శక్తి మనకి తెలియట్లేదు. చేతి వేళ్ళలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది. అలాగే మేడ నుంచి నరాల ద్వారా వేళ్ళల్లోకి ప్రసరిస్తుంది. అందుకే ఆశీర్వచనానికి కూడా మనం పెద్ద పీట వేశాం. పెద్దవాళ్ళు పిల్లల్ని ఆశీర్వదించటం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి కలిపిన అక్షింతలకు అంటి మన తల మీద పడేసరికి మనకి ఏదో తెలియని బలం వచ్చినట్టు అనిపిస్తుంది.
👉అలా పంచభూతాలు మన అరచేతిలోనే ఉండటం వల్ల మనం వేసే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క శక్తి ఆవహించి ఉండి దాని పని అది చేసుకుని పోతుంది. చేతితో అన్నం తినటం కూడా మన పెద్దవాళ్ళు మంచిదని ఊరికే చెప్పలేదు. అన్నాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసుకుని చేత్తో తినటం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణం అయ్యేలా చేస్తాయి. మనం తినే అన్నంలో ఏవైనా దోషాలు ఉన్నా అవి తగ్గుతాయి కూడా. మన శక్తి మనకి తెలియక పాశ్చాత్య ధోరణులకి ఆకర్షించబడి మనం స్పూన్స్ తో తినటం అలవాటు చేసుకుంటున్నాం. అందుకే తినే పదార్థాలు శుద్ధి కాక మనకి ఇన్ని అనారోగ్యాలు.
👉 మన చేతి వేళ్ళల్లో ఇలా శక్తి తరంగాలు, పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వల్ల మనం చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుంది. జపం చేసేవాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేత్తో తిప్పుతూ జపం చేస్తారు. అలాగే మనం నిశితంగా పరిశీలిస్తే చేత్తో ఎక్కువసేపు పెన్ను పట్టుకుంటే కాసేపయ్యేసరికి పేపర్ కనిపిస్తే ఏదో ఒకటి రాయాలని లేదా ముగ్గులు వెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. 👉 అలాగే కర్ర కాసేపు పట్టుకుని ఉంటే దానితో దేనినైనా కొట్టాలని అనిపిస్తుంది. అలాగే కత్తి చేత్తో పుచ్చుకుంటే కాసేపయ్యేసరికి దేని మీదైనా విసిరి అది విరిగేలా చెయ్యాలనిపిస్తుంది లేదా దేనినైనా పొడవాలనిపించి ఆఖరికి కూరగాయలని అటు ఇటు గాట్లు పెడతాం. ఇలా మనం చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని మన చేతులు గ్రహించి వాటితో చేసే పనులు మనం స్వయంగా చేసేలా చేస్తాయి. అందుకే పెద్దలు కత్తులు కత్తెరలు ఇంట్లో అవసరానికి మించి ఉండకూడదంటారు
👉 ఆఖరికి మన జీవితం ఎలా ఉంటుందో కూడా మన అరచేతిలోనే ఉంటుంది. అందుకే హస్తసాముద్రికంలో మన చేతిలోని రేఖలని చూసి మన జాతకం చెపుతారు. ఇంకా మనకి తెలియని ఎన్నో విద్యలలో కూడా చేతి వేళ్ళను ఉపయోగించి చికిత్స చేసే విధానం కూడా ఉంది. అంత శక్తి ఉన్న చేతులు మనకి ఉన్నాయని గుర్తించకపోవటం మన తప్పే. ఇలా పంచాభూతలనే మన చేతిలో పెట్టిన దేముడికి ఎన్నిసార్లయినా చేతులెత్తిమనం మొక్కవచ్చు .
పంచభూతాల్లో పరమేశ్వరుడు :
ఈ క్రింది వీడియో యు. ఆర్.యల్. ల లో పంచభూతాల గురించి తెలుసుకోండి :
Nagaraju Suddapalli - పంచభూతాల గురించి సైన్స్ ఏం చెబుతోంది..