4, ఏప్రిల్ 2021, ఆదివారం

మానవుడు తన జీవితాన్ని సుఖవంతంగా గడపడానికి సైకాలజిస్ట్ లు చెప్పిన 10 సూత్రాలు

wowitstelugu.blogspot.com

మానవుడు తన జీవితాన్ని సుఖవంతంగా గడపడానికి సైకాలజిస్ట్ లు చెప్పిన 10 సూత్రాలు 

మానవుడు తన జీవితాన్ని సుఖవంతం గా గడపడానికి సైకాలజిస్ట్ లు చెప్పిన 10 సూత్రాలు ఇప్పుడు  మనము తెలుసుకుందాం

01.
ఎప్పుడూ అనకూడని ఒకే  1 (ఒక) అక్షరం ( I )ఐ  (నేను)

ఎప్పుడు కూడా ఇది నాది... నేను... నావాళ్లు అని అనకూడదు. ఈ విధంగా అనడం వల్ల సంఘ జీవితం లో మిగతా వ్యక్తులకు దూరం అవుతాం అని అంటున్నారు, మానసిక శాస్త్రజ్ఞులు.

02.

ఎప్పుడూ  అనవలసిన 2 (రెండు) అక్షరాలు  WE ( మనం, లేదా మేము)

నేను అని ఎప్పుడూ అనకూడదు అనగానే దాని అర్ధం ఎప్పుడూ  మనం అని అనాలనే కదా అర్ధం.  అదే చెబుతున్నారు మానసిక శాస్త్రజ్ఞులు. నేను అనే పదం వాడడం మాని  మనం మనమందరం అని అనాలంటున్నారు మానసిక శాస్త్రజ్ఞులు . సంఘ జీవితం ఒకరి అవసరం ఒకరికి ఎదో ఒక సందర్భం లో అవసరం అయ్యే తీరుతుంది. 

03. 

ఎప్పుడూ  దగ్గరకు రానివ్వ కూడని  3 (మూడు)  అక్షరాలు  EGO (అహంకారం )

నేనే గొప్పవాణ్ణి నా అంతటి వారు ఎవ్వరూ లేరు అనుకోవడం చాలా తప్పు సమాజం ఒకరికి మించిన వారు వేరొకరు ఉంటూనే ఉంటారు. ప్రతి వ్యక్తి లోను ఎదో ఒక ప్రతిభ తప్పకుండ ఉండే ఉండి తీరుతుంది. అది ఏదో ఒక సమయం లో వేరొకరి ఉపయోగ పడే  తీరుతుంది. ధనం ప్రతిభకు కొలమానం కాదు. ప్రకృతి లో ఉచితంగా  దొరికేవే చాలా విలువ గలిగి ఉంటాయి . ఉదాహరణకు  గాలి, నీరు, ఎండ, నీడ.  ఇంకొకరికి దొరికేది  అదే మనకి కావలసింది కూడా అదే అనుకోవడం... ఇంకొకరు చేయగలిగేది మనం కూడా చేయ గలం... అని అను కోవడమే  అహంకారం.

04.

ఎప్పుడూ  మనసావాచా మనలో ఉండాల్సిన 4  (నాలుగు)  అక్షరాలు LOVE  (ప్రేమ  )

ప్రేమ ప్రేమాభిమానాలు మనుషులను దక్కరకు చేరుస్తాయి. తల్లికి తన పిల్లపై సహజమైన ప్రేమ ఎలా ఉంటుందో అలాగే మానవసంబంధాలు ధృడంగా  ఉండాలంటే ఎలాటి వారినైనా అర్ధం చేసుకోవడం ప్రేమించడం అలవాటుగా మార్చుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎప్పటికీ ఎవ్వరూ  శత్రువులుగా ఉండరు సరికదా ఎంతో సంతృప్తి ఆనందం మనకి  దొరుకుతుంది.

05.

ఎప్పుడూ మనలో ఉండాల్సిన 5  (ఐదు)  అక్షరాలు SMILE  ( చిరునవ్వు )

ఎప్పుడు నవ్వుతూ ఇతరులను నవిస్తూ ఉండేవాడు ఏ పనిలోనైనా విజయం సాధించడం తథ్యం. ఆనందంగా ఉండేవారి మెదడు ఎప్పుడు చురుకుగా పని చేస్తుంది. మొహం మోట మోట లాడిస్తూ ఉండేవారిపై ఎవ్వరికీ సదభిప్రాయం ఉండదు, పైగా వారికి స్నేహితులు లభించడం కూడా కష్టమే. ఈ చిరునవ్వు లక్షణాలు ఉన్న వారికీ మగ, అడా ఎవరైనా ఫిదా కావాల్సిందే.

06.

ఎప్పుడూ  మనం నేర్చుకోవాల్సిన  6 (ఆరు )  అక్షరాలు THANKS   (కృతజ్ఞతలు  )

ఎప్పుడైనా ఎవరివల్లనైన ఏ మాత్రం సహాయాన్ని పొందినా  వారికి  మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి.  తల్లితండ్రులకు జీవితాంతం ఋణపడి ఉండాలి.  తోటి వ్యక్తుల వల్ల మనం ఎంత చిన్న సాయం పొందినా వారికి  రెండింతలు సాయం చేయాలి . ఎప్పుడు వారిని మనం మరువ కూడదు.

07.

ఎప్పుడూ  మనం  అలవర్చుకోవాలిన  7 (ఏడు  )  అక్షరాలు FORGIVE ( క్షమించడం )

ఎలాంటి శత్రువునైనా క్షమించడం వల్ల విరోధం నించి ఊరట చెందుతాం. ఎలాంటి సమస్య అయినా చర్చించు కోవడం వల్ల పరిష్కారం అవుతుంది.  పొరపాట్లు మానవ సహజం ఆ సందర్భంలో అతనలా ప్రవర్తిన్చ రావలిసి ఉండవచ్చు. ఇతరులను అర్ధం చేసుకొని క్షమించడం అసలైన మానవ  లక్షణం. 

08.

ఎప్పుడూ  మనలో ఉండకూడని 8 (ఎనిమిది )  అక్షరాలు JEALOUSY  (అసూయ )

అసూయ చాల ప్రమాదమైనది. ప్రకృతి కొన్ని కొన్ని వస్తువులు కొందరికి మాత్రమే దొరుకుతాయి. అలాంటివే మనకి కావాలి అని కోరుకోవడం తప్పు. సాధ్యమైతే నీ పరిమితి లో నీవు వాటిని సమకూర్చు కోవచ్చు.  ప్రకృతి (దేవుడు) కొన్నిటిని కొంత మందికే పరిమితం చేసింది ఉదాహరణకి మంచి శరీర ఆకృతి, రంగు, ముఖ వర్చస్సు, వాక్సుద్ధి,  మొదలైనవి కలిగి ఉండడం. 

09.

ఎప్పుడూ  మనలో ఉండవలసిన 9 (తొమ్మిది )  అక్షరాలు ADOPTABLE (రాజీ పడడం)

సమస్య వచ్చినప్పుడు సర్డుకోవడం నేర్చుకోవాలి. కష్ట సుఖాలు, ఎండా-వానలు లాంటివి వచ్చి వెంట వెంటనే పోతుంటాయి కష్టాలు వచ్చినప్పుడు అనుకోనివి సాధించ లేన్నపుడు సర్దుకొనే  లక్షణం ఉండాలి అన్ని సందర్భాలూ అన్ని కాలాలు అందరికి ఒకేలా ఉండవు. చాల సందర్భాల్లో చాల సమయాల్లో చాలా మంది రాజీ పడడం సహజం గానే నేర్చుకోవాలి.

10.

ఎప్పుడూ  మనలో ఉండవలసిన 10 (పది ) అక్షరాలు UNDERSTAND (అర్ధం చేసుకోవడం)

అర్ధం చేసుకోవడం అనే లక్షణం లేకపోతె వాళ్ళు మానవులే కారు అనుకోవాలి. ఇతరుల సమస్యలు అర్ధం చేసుకోవడం. మన సమస్య వాళ్ళ సమస్య ఒకలాంటివే అనుకోవడమే మంచి మానవ లక్షణం అని తెలుసుకోవాలి. 

పైన చెప్పిన పది సూత్రాలు ఎవరైతే కచ్చితంగా పాటిస్తారో వాళ్ళ  జీవితమంతా ఎటువంటి శారీరక , మానసిక, ఆర్థిక సామజిక, సమస్యలు లేదా కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారని  కచ్చితంగా చెప్పవచ్చు అంటున్నారు మానసిక శాస్త్రజ్ఞులు.

ఈ క్రింది  వీడియో.యు.ఆర్.యల్. లు చూడండి 


Today's Quote

"Experience is the teacher of all things."

- Julius Caesar


Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి.

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


28, మార్చి 2021, ఆదివారం

తిథి అంటే ఏమిటి? ఏ తిథి కి ఏ దేవత అధినేతో తెలుసు కుందామా

wowitstelugu.blogspot.com

తిథి అంటే ఏమిటి? ఏ తిథి కి  ఏ దేవత  అధినేతో   తెలుసు కుందామా

తిథి అంటే  వేద సమయ గణితము ప్రకారము చంద్రమాసము లో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య, అదే సూర్యచంద్రులు ఒకరి కి ఒకరు సమాన దూరములో వుంటే పౌర్ణమి అవుతుంది, శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న అక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు..  తిధులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉండవచ్చును. 

  • తిథి అనగా తేది, దినము, రోజు అని అర్థం. ప్రస్తుత కాలంలో ఈరోజు తేది ఎంత? అని అడిగితే క్యాలెండరు చూసో, వాచి చూసే, గుర్తుంటె ఆ తేది చెప్తారు. ఇవి నెలకు 30,  31 వుంటాయి. ఇది ఇంగ్లీషు పద్ధతి. సర్వత్రా ఇదే పద్ధతి వ్యవహారంలో ఉంది. 

  • గత కాలంలో తిథి అంటె తేది అనే సమానార్థంలోనే, చాంద్ర మాస దినాలలో విదియ, తదియ, ద్వాదశి, త్రయోదశి అని చెప్పేవారు. ఆకాశంలో చంద్రుడు అమావాస్య రోజున పూర్తిగా కనిపించడు. ఆ మరుదినము సన్నని రేఖలా కనుపించిన చంద్రుడు దిన దినాభివృద్ధి చెందుతూ పదునైదవ రోజున పూర్ణ చంద్రుడుగా అగుపిస్తాడు. ఆనాడు పౌర్ణము. 

  • ఆ మరు దినము చందమామ దినదినానికి క్షీణించి పదునైదవ రోజున పూర్తిగా కను మరుగౌతాడు. ఆ రోజు అమావాస్య. ఈ తతంగ మంతా సూర్య చంద్రుల గమనం వల సంభవిస్తుంది. (నిజానికి భూబ్రమణం వల్ల) ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతున్న ఈ తిథిని అది ఏ తిదో చందమామను చూచి చెప్పేవారు. 

  • శాస్త్రీయంగా చెప్పాలంటే చాంద్ర మాసానికి 29-1/2 రోజులు. సూర్యును నుండి 12 డిగ్రీలకు ఒక తిథి ఏర్పడుతుంది.  పూర్తి వృత్తానికి 360 డిగ్రీలు. ఆ విధంగా 180 డిగ్రీలు సూర్య చంద్రుల మధ్య వున్నప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. 

  • అదే విదంగా ఒకే డిగ్రీలో సూర్య చంద్రులున్నప్పుడు ఏర్పడేదె అమావాస్య. ఇప్పటిలాగా క్యాలెందరో, వాచీనో చూసి చెప్ప నవసరంలేదు. నిరక్షరాస్యులు సైతం చందమామ వైపు చూసి అది ఏ తిదో చెప్పగలిగేవారన్న మాట. ఇది ఒకప్పటి భారతీయ పద్ధతి.

ఏ తిథి కి  ఏ దేవత  అధినేత 

01 పాడ్యమి కి అధిదేవత  - అగ్ని 

02 విదియ కి అధిదేవత  - బ్రహ్మ 

03 తదియ కి అధిదేవత  - గౌరీ 

04 చవితి కి అధిదేవత - వినాయకుడు 

05 పంచమి కి అధిదేవత - సర్పము 

06 షష్ఠి  కి అధిదేవత - కుమారస్వామి 

07 సప్తమి  కి అధిదేవత -  సూర్యుడు 

08 అష్టమి  కి అధిదేవత -  శివుడు 

09 నవమి  కి అధిదేవత - దుర్గా దేవి 

10 దశమి  కి అధిదేవత -  యముడు 

11. ఏకాదశి  కి అధిదేవత - శివుడు 

12.  ద్వాదశి  కి అధిదేవత -  విష్ణువు 

13. త్రయోదశి  కి అధిదేవత -  మన్మధుడు 

14. చతుర్దశి  కి అధిదేవత -  శివుడు 

15. పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి  అధి దేవత - చంద్రుడు

16. అమావాస్య  అధి దేవత - పితృదేవతలు

ఏ తిథి లో ఏ దేవత పండుగ వస్తుంది 


1. పాడ్యమి      -        గౌరీ దేవత (గౌరీ వ్రతం)

2. విదియ  -              అశ్వని దేవతలు

3. తదియ     -           పరశురాముడు (అట్లతద్ది)

4. చవితి        -         వినాయకుడు (వినాయక చవితి)

5. పంచమి     -         సర్పదేవతలు (నాగ పంచమి)

6. షష్ఠి           -          సుబ్రమణ్యస్వామి (సుబ్రమణ్యషష్ఠి)

7. సప్తమి        -          సూర్యుడు (రధ సప్తమి)

8. అష్టమి - శ్రీ కృష్ణుడు (కృష్ణాష్టమి)

9. నవమి - శ్రీ రాముడు (శ్రీ రామనవమి

10. దశమి - దుర్గాదేవి (విజయదశమి)

11. ఏకాదశి - విష్ణవు, సాయిబాబా (తొలిఏకాదశి)

12. ద్వాదశి - కూర్మావతారం (క్షేరాబ్ధి ద్వాదశి)

13. త్రయోదశి - శివుడు, శనీశ్వరుడు (శని త్రయోదశి )

14. చతుర్థి          -      నృసింహస్వామి (నరక చతుర్థి)

15. పూర్ణిమ        -         సద్గురువులు, గురువులు (గురు పూర్ణిమ)

15. అమావాస్య    -      లక్ష్మీదేవి (దీపావళి అమావాస్య)

ఏ తిథి కి  ఏ శూల మంచిది

  • తూర్పు :- పాడ్యమి నవమి.

  • ఆగ్నేయము :- తదియ, ఏకాదశి.

  • దక్షిణము :- పంచమి, త్రయోదశి.

  • నైరుతి :- చవితి, ద్వాదశి.

  • పడమర :- షష్ఠి, చతుర్ధశి.

  • వాయవ్యము :- సప్తమి, పూర్ణిమ.

  • ఉత్తరము :- విదియ, దశమి.

  • ఈశాన్యము :- అష్టమి, అమావాశ్య

తిథులు ఆయా తిథుల్లో ఆదిదేవతల వల్ల 

వచ్చే ఫలితాలేమిటి

1. పాడ్యమి అంటే శ్రద్ధ: శ్రద్ధతో పనిచేయుట, పనులయందు జాగరూకతశ్రుతము, శాస్త్రముల ఆచరించుట

2. విదియ అంటే మైత్రి : కొత్త పరిచయాలు, మంచి మిత్రులు, చికిత్సారంభం ప్రసాదము, మనోవికాసం పొందడం జరుగుతుంది.

3. తదియ అంటే దయ : దయతో ఆర్తులకు సేవచేయుట అభయం- నిర్భయము, అభయ మిచ్చుట

4. చవితి అంటే శాంతి: శాంతి ధ్యానము, సత్సంగముసుఖము-కార్యసిద్ధి

5. పంచమి అంటే తుష్టి: తృప్తి పడుట, అసంతృప్తిని విడచుట, ప్రజాహిత కార్యములుముదము-ఆనందము

6. షష్ఠి అంటే పుష్టి : ఆతిథ్యము, మంచి భోజనము, కలహములు రాకుండా జాకరూకత స్మయము- గర్వము కలుగుట

7. సప్తమి అంటే క్రియ: ప్రియము నిష్టతో కార్యాచరణ, తపసు, వేద్యయనం, శరణాగతియోగము-దైవముతో యోగము, విగ్నములు తొలగుట, ప్రయోజనము

8. అష్టమి అంటే స్వాహాదేవి: వ్యాయాయము, అగ్నికార్య్సములు, పోటీలో నిలుచుట, సిద్ధిని పొందుటకు చేయవలసిన కార్యములు, ఆరోగ్యకరమైన ఆహారంశ్రమతో విజయమును సాధించుట

9. నవమి అంటే ఉన్నతి: నవమి నాడు ఉన్నతి కల్గును సత్పురుషుల సన్నిధిలో వినయముతో మెలగుట దర్పం, అపురూపమైన విద్య, అధికారం, శక్తి, తెలివి వలన కలుగు దర్పం. గుర్తింపు కొరకు గొప్ప కొరకు పాటుపడుట నివారించని ఎడల పేదరికం సంభవించును

10. దశమి అంటే బుద్ధి: బుద్ధి వివేకముతో కార్యాచరణ చేయుట అర్ధము-ప్రయోజనము, పరిస్థితులను సద్వినియోగ పరచుట

11.ఏకాదశి మేధస్సు: మేధ కార్యములందు శుభం, విద్యలను సద్వినియోగపరచుకొనుట స్మృతి-కావలసిన సమయంలో విద్యలు స్పురించి ప్రయోజనం సమకూరుట

12. ద్వాదశి అంటే తితిక్ష: పరిస్థితులను, ఇతరుల ప్రవర్తనను ఓర్చుకొనుటక్షేమం- ఓర్పువహించిన వారికి ఆపదలు రావు

13. త్రయోదశి అంటే హ్రీ : కార్యములందు శుభం, నైతికంగా దిగజారకుండా జాగరూయకత వహించుటప్రశ్రయం- చెడుపనులను చేయకుండుట, ఇతరుల విశ్వాసం చూరగొనుట

14. చతుర్ధశి అంటే మూర్తి: ఏ పని చేయక ఆత్మధ్యానం, పరమాత్మ ధ్యానం చేయుట సకల సద్గుణములు కలుగును

15. పూర్ణిమ అంటే సతీదేవి: (శక్తి, షోడశి మాంగల్యాది దేవతలు)దౌవధ్యానం, దేవీ ఉపాసనప్రజ్ఞ - జగన్మాత అనుగ్రహము, ఉన్నత లక్ష్యసిద్ధి

15. అమావాస్య అంటే పితృలోకము: బ్రహ్మచర్య సాధన, పరబ్రహ్మ ధ్యానంతేజస్సు, ధారణ శక్తి, జ్ఞానం, విజ్ఞానం, బ్రహ్మనిష్ట


ఈ క్రింది వీడియో యు. ఆర్ య. ల లో తిథి గురించి తెలుసుకోండి


తిథి అంటే ఏమిటి..? | Brahmasri Dr ... - YouTube



Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


Quote of the day:
"Whatever you are, be a good one."
- Abraham Lincoln


27, మార్చి 2021, శనివారం

కోటీశ్వరులు పఠించిన అత్యంత శక్తి వంతమైన శ్రీ వెంకటేశ్వర మహా మంత్రం

wowitstelugu.blogspot.com

కోటీశ్వరులు పఠించిన అత్యంత శక్తి వంతమైన శ్రీ వెంకటేశ్వర మహామంత్రం 

Powerful Sri Venkateswara Maha Mantra recited by billionairs
 01

“Om Namo Venkatesaaya Kaamitaartha Pradhaayine Pranatah Klesa Naasaaya Govindaaya Namo Namaha.. “..

“.. ఒమ్ నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే.. ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః..” …  (Telugu)

“..ऊँ नमो वेङ्कटेशाय कामितार्थ प्रदायिने…प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः ..” (Hindi)

ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಕಾಮಿತಾರ್ಥ ಪ್ರಧಾಯಿನೆ ಪ್ರಣತಃ ಕ್ಲೇಶ ನಾಶಾಯ ಗೋವಿಂದಾಯ ನಮೋ ನಮಃ. (Kannada)

Meaning Of The Mantra : “I pay my obeisance to You, O’ Lord Venkateswara – the Bestower of all success and prosperity; and offer my salutations to You, O’ Govinda – the Destroyer of all evils and sufferings”

 02

“Yathaa deve tathaa mantre.. Yathaa mantre tathaa gurau.. Yathaa gurau tathaa svaatmanyevam.. Bhakthi kramaa priye” – Lord Siva to Goddess Parvati in Tantraraj Tantra, 1.30

Meaning in English:

“O’ Devi, there’s no difference between mantra and deities.. Mantra is God.. Similarly, there’s no difference between mantra and Guru .. Guru is mantra. And that Guru is me. A true disciple knows this”.

తెలుగు లో అర్ధం :

“ఓ’ దేవీ, మంత్రానికి, దేవతలకు తేడా లేదు .. మంత్రమే దేవుడు .. అదేవిధంగా, మంత్రానికీ, గురువుకు మధ్య తేడా లేదు .. గురువే మంత్రం. మరియు ఆ గురువును నేనే. నిజమైన శిష్యుడికి ఇది తెలుసు ”.

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. లు చూడండి.



today's Quote:

"Believe in yourself! Have faith in your abilities! Without a humble but reasonable confidence in your own powers, you cannot be successful or happy."

-Norman Vincent Peale


Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com