21, జులై 2020, మంగళవారం

శ్రావణ మంగళగౌరీ వ్రతం వ్రత విధానం కథ తెలుగుకొని ఆచరిద్దాం రండి

wowitstelugu.blogspot.com

శ్రావణ మంగళగౌరీ వ్రతం వ్రత విధానం కథ తెలుగుకొని ఆచరిద్దాం రండి



శ్రావణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవి కి మరొక పేరు(గౌరీ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు.

వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు (4) సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.

మంగళగౌరీ వ్రత నియమాలు

  • ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు.
  • తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది.
  • తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్నిఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.
  • వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
  • వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వవచ్చును .

  • ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.
  • పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.

  • మంగళగౌరీ వ్రతానికి కావలసిన పూజ సామాగ్రి :

    • పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు.

    • ఎర్రటి రవికె గుడ్డ,

    • గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము,

    • టెంకాయ, పసుపుతాడు , దీపపు సెమ్మెలు -2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం

    • గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం , అగరవత్తులు, బియ్యము, కొబ్బరిచిప్ప ,శనగలు,

    • దీపారాధనకు నెయ్యి మొదలైనవి.

    మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధానం
    • వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నేలేచి తల స్నానం చేసి,ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

    • ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి, తమలపాకులను పెట్టి, ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి.

    • మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది.అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి, పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీని తయారు చేసుకోవాలి.

    • మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకుని, దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్నిఉంచాలి.

    • ఈ విధంగా మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి.

    • పైన చెప్పినటువంటివే ప్రస్తుతం “మంగళగౌరీ” విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు.

    • లేదా పసుపుతో చేసి ప్రతిష్టించుకోవాలి లేక గౌరీ దేవి ఫొటో ని కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించు కోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్నిచేసుకోవాలి.
    మంగళగౌరీ వ్రత విధానం :
    ఆచమనం

    ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా

    (అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

    విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః

    శ్రీధరాయ నమః ఋషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః

    ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్ధనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః

    ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)

    ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
    ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||
    (ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

    ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

    (కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

    శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
    ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
    ఓం లక్ష్మినారాయణభ్యయం నమః
    శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః
    శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః
    శ్రీ శచిపురంధరాభ్యం నమః
    శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః
    శ్రీ సీతారామాభ్యం నమః
    సర్వేభ్యో దేవేభ్యో నమః , మాతృభ్యో నమః, పితృభ్యో నమః
    ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మంగళ గౌరీ ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుక్ల పక్షే , శుభ తిథౌ, శుక్రవాసరే, శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ (పేరు) అహం మమోపాత్త దురితక్షయద్వారా యావజ్జీవ సామాంగల్య సిద్ధ్యర్థ పుత్ర, పౌత్ర సంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతరం శ్రీమంగళగౌరీ వ్రతం కరిష్యే. అద్య శ్రీ మంగళగౌరీ దేవతా ముద్దిశ్య శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం, సంభవద్భిర్త్రవై: సంభవితానియమేన ధ్యానవాహనాది షాడోశోపచార పూజాం కరిష్యే.
    (అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

    తదంగత్వేన కలశారాధనం కరిష్యే

    శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
    మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
    కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
    ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
    అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

    (కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

    శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతినర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
    ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
    కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
    (కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)

    మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
    జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
    శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .
    ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.

    ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్


    సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
    (నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమ్రుతమస్తు అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహో గూడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).

    శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.
    శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.
    అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవత: సర్వాత్మక: శ్రీ గణపతిర్దేవతా
    సుప్రీత, సుప్రసన్న వరాదభవతు ! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు !!
    వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి.

    తోర పూజ :

    తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.

    అనంతరం మంగళ గౌరీ పూజ ప్రారంభం – శ్రీ మంగళ గౌరీ ధ్యానమ్ :

    ఓం శ్రీ మంగళ గౌరీ ఆవాహయామి
    ఓం శ్రీ గౌరీ రత్నసింహాసనం సమర్పయామి
    ఓం శ్రీ మంగళ గౌరీ అర్జ్యం సమర్పయామి
    ఓం శ్రీ మంగళ గౌరీ పాద
    ్యం సమర్పయామి
    ఓం శ్రీ మంగళ గౌరీ ఆచమనీయం సమర్పయామి
    ఓం శ్రీ మంగళ గౌరీ పంచామృతస్నానం సమర్పయామి
    ఓం శ్రీ మంగళ గౌరీ శుద్ధోదకస్నానం సమర్పయామి
    ఓం శ్రీ మంగళ గౌరీ వస్త్రయుగ్నం సమర్పయామి
    ఓం శ్రీ మంగళ గౌరీ ఆభరణానే సమర్పయామి
    ఓం శ్రీ మంగళ గౌరీ మాంగల్యం సమర్పయామి
    ఓం శ్రీ మంగళ గౌరీ గంధం సమర్పయామి
    ఓం శ్రీ మంగళ గౌరీ అక్షాతన్ సమర్పయామి
    ఓం శ్రీ మంగళ గౌరీ పుష్పాణి సమర్పయామి
    అంటూ వరుసగా చదువుకోవాలి. ఆయా ద్రవ్యాల పేరులు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి.
    రత్నసింహాసనాలు, బంగారు మాంగల్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు.
    తరువాత శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర నామములు ( శ్రీ గౌరీ అస్తోతరములు) చదవండి ..
    ఆ తరువాత ఈ విధంగా చేయాలి.
    ఓం శ్రీ మంగళ గౌరీ ధూపం ఆఘ్రాపయామి – అగరువత్తులు వెలిగించి చూపించాలి.
    ఓం శ్రీ మంగళ గౌరీ దీపం దర్శయామి. కుందులలో నూనెపోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి.
    ఓం శ్రీ మంగళ గౌరీ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి.
    ఓం శ్రీ మంగళ గౌరీ తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్కలతో తాంబూలం సమర్పించాలి.
    ఓం శ్రీ మంగళ గౌరీ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.
    ఓం శ్రీ మంగళ గౌరీ మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి.
    ఓం శ్రీ మంగళ గౌరీమీ ప్రదక్షిణ నమస్కాన్ సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి.
    ఓం శ్రీ మంగళ గౌరీ నమస్కారన్ సమర్పయామి. నమస్కరించాలి.

    శ్రీ మంగళ గౌరీ వ్రతకథ :

    • పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు. ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.

    • అనంతరం వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు. ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. కాబట్టిన శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.

    • మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది.

    • ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యడు. ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.

    మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొన సాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.

    ఈ క్రింది వీడియో యు.ఆర్. యల్ . లు చూడండి ...

    శ్రావణ మంగళ గౌరీ వ్రత విధానం | sravana mangala ...




    గమనిక :

    నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

    నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

    అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
    నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

    నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

    కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ












    20, జులై 2020, సోమవారం

    సోమావతి అమావాస్య కథ దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోండి

    wowitstelugu.blogspot.com

    సోమావతి అమావాస్య కథ దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోండి 

    సోమావతి అమావాస్య

    సోమవారం, అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమావతీ అమావాస్య అంటారు. అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన తిథి. సోమావతీ అమావాస్య శివారాధనకు, పితృదేవతల ఆరాధనకు ఎంతో విశిష్టవంతమైనది. ఈ రోజు విధిగా శివుడిని, పితృదేవతలను స్మరించాలి. దీని గురించి మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు.

    సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని  ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి అని ప్రతీతి.

    సోమావతి కథ

    ఒకానొక ఊరిలో ఓ సాధువు ఓ వ్యాపారి ఇంటికి వస్తూ వుండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంట్లోని పెళ్లికాని ఓ కన్యను ముఖం చూసి దీవించకుండానె వెళ్లిపోయాడు. సాధువు దీవించకుండా వెళ్లడానికి కారణం తెలియక ఆ కుటుంబం జ్యోతిష్యుడిని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో ఆ కన్య జాతకం చూసిన జ్యోతిష్యుడు.. ఈమెకు వివాహం జరిగితే భర్త అనతి కాలంలోనే మరణిస్తాడు. ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందని చెప్పాడు. అది విని దిగ్భ్రాంతి చెందిన కుటుంబీకులకు ఆ జ్యోతిష్యుడు పరిష్కారం కూడా చెప్తాడు.

    సింఘాల్ ప్రాంతంలోని ఓ చాకలి స్త్రీ వద్ద కుంకుమ అడిగి నుదుటన ధరిస్తే కన్యకు దోషం పోతుందంటాడు. ఇదే తరహాలో చాకలి స్త్రీ వద్దకు చేరుకున్న ఆ కన్య సోమావతి అమావాస్య రోజున ఆమె వద్ద కుంకుమ పొందుతుంది. ఆపై రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేసింది. ఆమె జాతక దోషం కూడా అంతటితో తొలగిపోయింది. అందుకే సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవు.

    దక్షయజ్ఞం కథ 
    అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.
    సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు.
    నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ, ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు.
    శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి... తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.
    • సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు.  
    • తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. 
    • పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. 
    • ఇవి ఏవీ  కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు. 
    • ఈ రోజు  పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. 
    • ఈ రోజు సోమావతి అమావాస్య నాడు, వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి.
    • ఈ సంవత్సరం (20వ తేదీ జులై  సోమవారం 2020) *అమావాస్య సోమవారం తో కలసి వచ్చినది కావున బహుపుణ్యకాలంగా మనం ఈ రోజుని  చెప్పుకోవచ్చు.
    • వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం - సోమావతీ అమావాస్య నాడుపేద పిల్లలకు అన్నదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించినవారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది
    •  ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. 

    • గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది.
    • రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది


    ఈ క్రింది వీడియో లింక్ ల లో వీడియో లు చూడండి...

    శోథన ఫలితాలు


    Note:

    నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

    నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

    అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
    నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

    నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

    కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ











    18, జులై 2020, శనివారం

    శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం తెలుగు, ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో అర్ధం తెలుసుకోండి

    wowitstelugu.blogspot.com


    శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం తెలుగు, ఇంగ్లీష్  ఇంగ్లీష్ లో అర్ధం తెలుసుకోండి




    శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం



    నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం 
    పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |
    నగేన్ద్రకన్యావృషకేతనాభ్యాం 
    నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ || ౧ ||
    నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం 
    నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |
    నారాయణేనార్చితపాదుకాభ్యాం 
    నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ || ౨ ||
    నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం 
    విరిఞ్చివిష్ణ్విన్ద్రసుపూజితాభ్యామ్ |
    విభూతిపాటీరవిలేపనాభ్యాం 
    నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ || ౩ ||
    నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం 
    జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |
    జమ్భారిముఖ్యైరభివన్దితాభ్యాం 
    నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ || ౪ ||
    నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం 
    పఞ్చాక్షరీపఞ్జరరఞ్జితాభ్యామ్ |
    ప్రపఞ్చసృష్టిస్థితిసంహృతాభ్యాం 
    నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ || ౫ ||
    నమః శివాభ్యామతిసున్దరాభ్యాం 
    అత్యన్తమాసక్తహృదమ్బుజాభ్యామ్ |
    అశేషలోకైకహితఙ్కరాభ్యాం 
    నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ || ౬ ||
    నమః శివాభ్యాం కలినాశనాభ్యాం 
    కఙ్కాళకల్యాణవపుర్ధరాభ్యామ్ |
    కైలాసశైలస్థితదేవతాభ్యాం 
    నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ || ౭ ||
    నమః శివాభ్యామశుభాపహాభ్యాం 
    అశేషలోకైకవిశేషితాభ్యామ్ |
    అకుణ్ఠితాభ్యాం స్మృతిసమ్భృతాభ్యాం 
    నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ || ౮ ||
    నమః శివాభ్యాం రథవాహనాభ్యాం 
    రవీన్దువైశ్వానరలోచనాభ్యామ్ |
    రాకాశశాఙ్కాభముఖామ్బుజాభ్యాం 
    నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ || ౯ ||
    నమః శివాభ్యాం జటిలన్ధరాభ్యాం 
    జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |
    జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం 
    నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ || ౧౦ ||
    నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం 
    బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |
    శోభావతీశాన్తవతీశ్వరాభ్యాం 
    నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ || ౧౧ ||
    నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం 
    జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |
    సమస్తదేవాసురపూజితాభ్యాం 
    నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ || ౧౨ ||
    స్తోత్రం త్రిసన్ధ్యం శివపార్వతీభ్యాం 
    భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |
    స సర్వసౌభాగ్యఫలాని 
    భుఙ్క్తే శతాయురాన్తే శివలోకమేతి || ౧౩ ||
    Lord Shiva Stotram Uma Maheswara Stotram Meaning:
    Salutations to Lord Shiva and Goddess Shivaa,
    Who are always in fresh stage of youth,
    Who cling to each other in tight embrace,
    Of whom one is the daughter of the mountain,
    And the other is one whose symbol is a bull,
    Salutations and salutations to Lord Sankara
    And to that Goddess Parvathy. || 1 ||
    Salutations to Lord Shiva and Goddess Shivaa,
    Whose playful love is a festival,
    Who grant boons to those who salute them,
    And whose feet is worshipped by Lord Narayana,
    Salutations and salutations to Lord Sankara
    And to that Goddess Parvathy. || 2 ||
    Salutations to Lord Shiva and Goddess Shivaa,
    Who rides on the divine bull,
    Who is worshipped by Vishnu, Brahma and Indra,
    And whose bodies are anointed with Sandal and holy ash,
    Salutations and salutations to Lord Sankara
    And to that Goddess Parvathy. || 3 ||
    Salutations to Lord Shiva and Goddess Shivaa,
    Who are the lord and lady of the universe,
    Who are always victorious,
    And who is worshipped by Indra and his chiefs,
    Salutations and salutations to Lord Sankara
    And to that Goddess Parvathy || 4 ||
    Salutations to Lord Shiva and Goddess Shivaa,
    Who are themselves the greatest medicine
    Who are happy to hear panchakshari repeated,
    And who creates, rule and destroy the universe,
    Salutations and salutations to Lord Sankara
    And to that Goddess Parvathy || 5 ||
    Salutations to Lord Shiva and Goddess Shivaa,
    Who are very pretty,
    Who are ever interested
    In the lotus-like the heart of devotees,
    And who do not have any other wish,
    Except for the good of the world,
    Salutations and salutations to Lord Sankara
    And to that Goddess Parvathy || 6 ||
    Salutations to Lord Shiva and Goddess Shivaa
    Who destroy the effects of the kali age,
    Who has a body with famished one on one side,
    And a pretty one on the other side,
    And who are the Gods living on mount Kailasa,
    Salutations and salutations to Lord Sankara
    And to that Goddess Parvathy || 7 ||
    Salutations to Lord Shiva and Goddess Shivaa,
    Who destroy all that leads to bad effects,
    Who are one and only one in this entire world,
    Who have a sharp intelligence,
    And who has a very deep memory of what they hear,
    Salutations and salutations to Lord Sankara
    And to that Goddess Parvathy || 8 ||
    Salutations to Lord Shiva and Goddess Shivaa,
    Who are the solace for all who surrender,
    Who have sun, moon and fire as eyes,
    And whose lotus face resembles the full moon in the sky,
    Salutations and salutations to Lord Sankara
    And to that Goddess Parvathy || 9 ||
    Salutations to Lord Shiva and Goddess Shivaa,
    Who attract all the people of the world,
    Who do not have old age death and other imperfections,
    And who are worshipped by Lord Vishnu and Lord Brahma,
    Salutations and salutations to Lord Sankara
    And to that Goddess Parvathy || 10 ||
    Salutations to Lord Shiva and Goddess Shivaa,
    Who are our immediate solace in difficult times,
    Who both wear the garland made of Vilwa leaves
    And Jasmine flowers,
    Who are resplendent with abounding peace,
    Salutations and salutations to Lord Sankara
    And to that Goddess Parvathy || 10 ||
    Salutations to Lord Shiva and Goddess Shivaa,
    Who protect all beings of this earth,
    Whose great intent is to protect the three worlds,
    And who are worshipped by all asuras and devas,
    Salutations and salutations to Lord Sankara
    And to that Goddess Parvathy || 12 ||
    Devotee who recites this prayer at dawn, noon and dusk,
    Which sings the praise of Lord Shiva and Goddess Parvathy,
    In its twelve holy stanzas,
    Would live a life with all luck for a hundred years,
    And then attain the world of Lord Shiva. || 13 ||
    Lord Shiva Stotram Sri Uma Maheswara Stotram Lyrics in English:
    Nama Sivabhyam, Nava Youvanabhyam,
    Paraspara slishta Vapurtharabhyam,
    Nagendra Kanya vrusha Kethabhyam,
    Namo Nama Sankara Parvatheebhyam || 1 ||
    Nama Shivaabhyam sarasothsavabhyam,
    Namaskruthabheeshta vara prathabhyam,
    Narayanenarchitha padukabhyam,
    Namo Nama Sankara Parvatheebhyam || 2 ||
    Nama Shivaabhyam vrusha vahanabhyam,
    Virinchi vishnveendra su poojithaabhyam,
    Vibhoothi pattera vilepanaabhyam,
    Namo Nama Sankara Parvatheebhyam. || 3 ||
    Nama Shivaabhyam Jagadeeswarabhyam,
    Jagat pathibhyabhyam, Jaya vigrahabhyam,
    Jambhari mukhyair abhi vandidabhyam,
    Namo Nama Sankara Parvatheebhyam. || 4 ||
    Namashivaabhyam paramoushadabhyam,
    Panchakshari panjara ranjithabhyam,
    Prapancha srushti sthithi samhruthibhyam,
    Namo Nama Sankara Parvatheebhyam. || 5 ||
    Namashivaabhyam Athi sundarabhyam,
    Athyanthamasaktha hrudambujabhyam,
    Asesha lokaika hithamkarabhyam,
    Namo Nama Sankara Parvatheebhyam. || 6 ||
    Namashivaabhyam kalinasanaabhyam,
    Kankaala kalyana vapurdharaabhyam,
    Kailasa saila sthitha devathabhyam,
    Namo Nama Sankara Parvatheebhyam. || 7 ||
    Namashivaabhyam asubapahaabhyam,
    Asesha lokaika viseshithaabhyam,
    Akuntithabhyam, sruthi samsthuthabhyam,
    Namo Nama Sankara Parvatheebhyam. || 8 ||
    Namashivaabhyam rachithabhayabhyam,
    Ravindu vaiswanara lochanabhyam,
    Rakasangabha mukhambujabhyam,
    Namo Nama Sankara Parvatheebhyam. || 9 ||
    Namashivaabhyam jana mohanabhyam,
    Jara mruthi thrasa vivarjithabhyam,
    Janardhanabjod bhava poojithabhyam,
    Namo Nama Sankara Parvatheebhyam. || 10 ||
    Namashivaabhyam Vishamekshanabhyam,
    Bilwachhadhamallikadhama brudbhyam,
    Shobhavathi santhavatheeswarabhyam,
    Namo Nama Sankara Parvatheebhyam. || 11 ||
    Namashivaabhyam pasupalakabhyam,
    Jagathrayee rakshana badha hrudhbhyam,
    Samastha devasura poojithabhyam,
    Namo Nama Sankara Parvatheebhyam. || 12 ||
    Sthothram trisandhyam Shiva Paravatheebhyam,
    Bakthya patethdwadasaka naro ya,
    Sa sarva sowbhagya phalani bunkthe,
    Sathayuranthe Shivalokamethi. || 13 ||
    శ్రీ ఉమా మహేశ్వర స్తోత్రం వీడియో యు. ఆర్. యల్ లు చూడండి 

    శోథన ఫలితాలు


    Note:

    నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

    నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

    అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
    నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

    నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

    కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ