1, జులై 2020, బుధవారం

శ్రీ విష్ణు షట్పది, శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం పఠించండి

wowitstelugu.blogspot.com


శ్రీ విష్ణు షట్పది, శ్రీ విష్ణు అష్టోత్తర 

శతనామ   స్తోత్రమ్,  శ్రీ లక్ష్మీనృసింహ 

కరావలంబ స్తోత్రం పఠించండి  


విష్ణు షట్పది

అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః || 1 ||
దివ్యధునీమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే |
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే || 2 ||
సత్యపి భేదాపగమే నాథ తవా‌உహం న మామకీనస్త్వమ్ |
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః || 3 ||
ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః || 4 ||
మత్స్యాదిభిరవతారైరవతారవతా‌உవతా సదా వసుధామ్ |
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతో‌உహమ్ || 5 ||
దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద |
భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే || 6 ||
నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ |
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు ||7||

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామస్తోత్రమ్

వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ |
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ || 1 ||
వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్ |
అవ్యక్తం శాశ్వతం విష్ణుమనంతమజమవ్యయమ్ || 2 ||
నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనమ్ |
గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరమ్ || 3 ||
వేత్తారం యఙ్ఞపురుషం యఙ్ఞేశం యఙ్ఞవాహనమ్ |
చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమమ్ || 4 ||
వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాససమ్ |
త్రివిక్రమం త్రికాలఙ్ఞం త్రిమూర్తిం నందకేశ్వరమ్ || 5 ||
రామం రామం హయగ్రీవం భీమం రౌద్రం భవోద్భవమ్ |
శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగలం మంగలాయుధమ్ || 6 ||
దామోదరం దమోపేతం కేశవం కేశిసూదనమ్ |
వరేణ్యం వరదం విష్ణుమానందం వాసుదేవజమ్ || 7 ||
హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమమ్ |
సకలం నిష్కలం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతమ్ || 8 ||
హిరణ్యతనుసంకాశం సూర్యాయుతసమప్రభమ్ |
మేఘశ్యామం చతుర్బాహుం కుశలం కమలేక్షణమ్ || 9 ||
జ్యోతీరూపమరూపం చ స్వరూపం రూపసంస్థితమ్ |
సర్వఙ్ఞం సర్వరూపస్థం సర్వేశం సర్వతోముఖమ్ || 10 ||
ఙ్ఞానం కూటస్థమచలం జ్ఞ్హానదం పరమం ప్రభుమ్ |
యోగీశం యోగనిష్ణాతం యోగిసంయోగరూపిణమ్ || 11 ||
ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుమ్ |
ఇతి నామశతం దివ్యం వైష్ణవం ఖలు పాపహమ్ || 12 ||
వ్యాసేన కథితం పూర్వం సర్వపాపప్రణాశనమ్ |
యః పఠేత్ ప్రాతరుత్థాయ స భవేద్ వైష్ణవో నరః || 13 ||
సర్వపాపవిశుద్ధాత్మా విష్ణుసాయుజ్యమాప్నుయాత్ |
చాంద్రాయణసహస్రాణి కన్యాదానశతాని చ || 14 ||
గవాం లక్షసహస్రాణి ముక్తిభాగీ భవేన్నరః |
అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః || 15 ||
|| ఇతి శ్రీవిష్ణుపురాణే శ్రీ విష్ణు అష్టోత్తర శతనాస్తోత్రమ్ ||

లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 1 ||
బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 2 ||
సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 3 ||
సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 4 ||
సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 5 ||
సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 6 ||
సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 7 ||
సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 8 ||
సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 9 ||
సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 10 ||
సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 11 ||
బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 12 ||
లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 13 ||
ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 14 ||
అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 15 ||
ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 16 ||
లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ || 17 
||

ఈ క్రింది వీడియో లింక్లు చూడండి 






శోథన ఫలితాలు

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ












29, జూన్ 2020, సోమవారం

స్కాంద పురాణం గౌరీ ఖండం లో ఆదిత్య కవచం

wowitstelugu.blogspot.com
స్కాంద పురాణం గౌరీ ఖండం లో ఆదిత్య కవచం



ధ్యానం

ఉదయాచల మాగత్య వేదరూప మనామయంతుష్టావ పరయా భక్త వాలఖిల్యాదిభిర్వృతమ్ |దేవాసురైః సదావంద్యం గ్రహైశ్చపరివేష్టితం
ధ్యాయన్ స్తవన్ పఠన్ నామ యః సూర్య కవచం సదా ||

కవచం

ఘృణిః పాతు శిరోదేశం, సూర్యః ఫాలం చ పాతు మే

ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతః ప్రభాకరః


ఘ్రూణం పాతు సదా భానుః అర్క పాతు తథా

జిహ్వం పాతు జగన్నాధః కంఠం పాతు విభావసు

స్కంధౌ గ్రహపతిః పాతు, భుజౌ పాతు ప్రభాకరః

అహస్కరః పాతు హస్తౌ హృదయం పాతు భానుమాన్

మధ్యం చ పాతు సప్తాశ్వో, నాభిం పాతు నభోమణిః

ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ

ఊరూ పాతు సురశ్రేష్టో, జానునీ పాతు భాస్కరః

జంఘే పాతు చ మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః

పాదౌ బ్రద్నః సదా పాతు, మిత్రో పి సకలం వపుః

వేదత్రయాత్మక స్వామిన్ నారాయణ జగత్పతే

ఆయతయామం తం కంచి ద్వేద రూపః ప్రభాకరః

స్తోత్రేణానేన సంతుష్టో వాలఖిల్యాదిభి ర్వృతః

సాక్షాత్ వేదమయో దేవో రధారూఢః సమాగతః

తం దృష్ట్యా సహసొత్థాయ దండవత్ప్రణమన్ భువి

కృతాంజలి పుటో భూత్వా సూర్యా స్యాగ్రే స్తువత్తదా

వేదమూర్తిః మహాభాగో ఙ్ఞానదృష్టి ర్విచార్య చ

బ్రహ్మణా స్థాపితం పూర్వం యాతాయామ వివర్జితం

సత్త్వ ప్రధానం శుక్లాఖ్యం వేదరూప మనామయం

శబ్దబ్రహ్మమయం వేదం సత్కర్మ బ్రహ్మవాచకం

ముని మధ్యాపయామాసప్రధమం సవితా స్వయం

తేన ప్రథమ దత్తేన వేదేన పరమేశ్వరః

యాఙ్ఞవల్క్యో మునిశ్రేష్టః కృతకృత్యో భవత్తదా

ఋగాది సకలాన్ వేదాన్ ఙ్ఞాతవాన్ సూర్య సన్నిధౌ

ఇదం స్తోత్రం మహాపుణ్యం పవిత్రం పాపనాశనం

యఃపఠేచ్చ్రుణుయా ద్వాపి సర్వపాఫైఃప్రముచ్యతే

వేదార్ధఙ్ఞాన సంపన్నః సూర్యలోక మవాప్నయాత్


ఇతి స్కాంద పురాణే గౌరీ ఖండే ఆదిత్య కవచం సంపూర్ణమ్ |

ఈ క్రింద యూట్యూబ్ వీడియో లింక్ చూడండి 

Surya Kavacham In Telugu - Lord Surya Bhagavan ... - YouTube





ఆదిత్య కవచం ఆదివారం రోజు వింటే మీ ... - YouTube



Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ














27, జూన్ 2020, శనివారం

తిరుమల లో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పూజావిశేషాలు తెలుసుకుందాం





wowitstelugu.blogspot.com
తిరుమల లో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి  పూజావిశేషాలు తెలుసుకుందాం 



వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు 6 (ఆరు)సార్లు పూజలు జరుగుతాయి. అవి ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు, తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.
సుప్రభాతసేవ : 
  • నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది.

  • ముందుగానే ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల) దేవాలయం వద్దకు వస్తారు.

  • నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు.

  • సుప్రభాతం చదివే అధ్యాపకులు,తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు.

  • బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు.

  • తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ, గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతుంటాడు.

  • అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొలుపుతారు.

  • పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు.

  • మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతి నిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు.

ఆలయ శుద్ధి:
  • సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. 

  • శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.


శ్రీవారి అర్చన:
  • శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు.

  • అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు.

  • చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు.

  • ఈ సూత్రం ద్వారానే ధ్రువబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక.

  • ఇది జరిగిన తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు. 

  • అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. 

  • యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. 

  • ఆ తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.

తోమాలసేవ:

  • తమిళంలో 'తోడుత్తమాలై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల', తోమాలసేవ అయి ఉండవచ్చు.
  • దీనిని భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాలసేవ చేస్తారు.

కొలువు:
  • తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది.

  • బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు.

  • ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు.

  • అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.

సహస్రనామార్చన:
  • ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది.బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది.
  • ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసిదళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. 

  • ఈ సమయంలో మిరాశీదారు వరాహ పురాణం లోని లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు.
  • తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.

మొదటిగంట, నైవేద్యం:
  • మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. 
  • నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు.

  • అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి) కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.
అష్టోత్తర శతనామార్చన:

  • ఈ అష్టోత్తర శత నామార్చన తో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి.
  • వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.

రెండో గంట, నైవేద్యం:
  • అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.
రాత్రి కైంకర్యాలు:

  • ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి
  • ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.

ఏకాంతసేవ:
  • రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు.

  • ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా పెడతారు.

  • రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు.

  • ఏడుకొండల వాడిని నిదురపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు.

  • దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.)

  • దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.

గుడిమూసే ప్రక్రియ:
  • రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.

ప్రత్యేక సేవలు
  • రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. 

  • సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, గురువారం సడలింపు, పూలంగిసేవ, తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం. స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. 

  • డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి.
సడలింపు:
  • గురువారం ప్రాతఃకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని తగ్గిస్తారు.
  • దీనివల్ల శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి. అనంతరం శ్రీవారికి 24మూరల పట్టు అంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయాన్నీ కడతారు. సువర్ణపాదాలు, హస్తాలు, శంఖచక్రాలు, కర్ణాభరణాలు, స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు. దీన్ని సడలింపు అంటారు.

పూలంగిసేవ:
  • ఆపాదమస్తకం స్వామివారిని పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ. తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్యమనోహర విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.
తిరుప్పావడ:
  • భారీసంభారాలతో స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు.
  • ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది.

  • గురువారం సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, దోసె, పాయసం, జిలేబి తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు.
అభిషేకం:
  • శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైంది ప్రతిశుక్రవారం ఉదయం జరిగే అభిషేకం. ఈ సేవ ప్రాశస్త్యం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కల్యాణశోభితుడైన స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు లభిస్తుంది.
  • గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేకానంతర దర్శనకాలంలో తప్ప మిగతా అన్ని రోజులూ స్వామి వెడల్పాటి తెల్లని కర్పూరనామంతో దర్శనమిస్తాడు.

  • ఈ మూడు సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్రదర్శనం, నిజపాద దర్శనం అంటారు.
శ్రీ వారి నిత్యా పూజ కైంకర్యాలు గురించి కింది వీడియో లింకుల్లో చూడండి...


Sri Venkatesh Swamy Nithya Pooja Vidanam || Swamy ...


Srivari Sevalu, Abhishekam-Friday | 02-06-17 | SVBC TTD ...

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ













26, జూన్ 2020, శుక్రవారం

స్కంధ షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్టి పురాణ గాధ ప్రాధాన్య తెలుసుకోండి

wowitstelugu.blogspot.com
స్కంధ షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్టి పురాణ గాథ ప్రాధాన్య తెలుసుకోండి

తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. ఈ షష్టినే సుబ్రహ్మణ్య షష్టి లేదా స్కంద షష్టిగా పిలుస్తారు.శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి, కార్తీకేయుడు,స్కందుడు,షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి ,సుబ్బరాయుడు షష్టి,తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు.

  • పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావు లేని వరం పొందాడు. దీంతో తాను అజేయుడునని, అమరుడునని వరగర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు. వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవునివద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు. అంతట దేవతలు పరమశివుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు.

  • పురాణగాథల ప్రకారం.. పరమశివుని దివ్యతేజస్సు వాయుదేవునిలో ప్రవేశింపబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపజేశాడు. అగ్ని కూడా శివతేజస్సును తాళలేక గంగానదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో రెళ్లి వనంలో (శరవనం ) చిక్కుకొని ఆరు ముఖాలు (షణ్ముఖాలు) పన్నెండు చేతులతో ఓ బాలుడు జన్మించాడు. అతడే సుబ్రహ్మణ్యస్వామి లేదా కుమార స్వామి. కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేశారు.పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. కుమారస్వామి తారకాసురుడితో ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు. లోకాన్ని, దేవతలను కాపాడి అందరి మన్ననలు పొందిన సుబ్రహ్మణ్యస్వామి దేవసేనాపతిగా కీర్తింపబడ్డారు.

  • సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి తలంటు స్నానమాచరించి పాలు, పంచాదారలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు.

  • కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉన్నది.ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది.

  • సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం లో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని,ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని,దానం చేయమని సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా "పరోప కారం మిధం శరీరం" అని భావించి పేదవారికి స్వేటర్లు , కంబళ్ళు, దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను,తిను బండారాలను దానం చేయాలని తెలుపుతున్నాయి

  • స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి.. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి. రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తుంటారు. ఈ రోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకలశుభాలు కలుగుతాయని ప్రతీతి.

*ఓం శం శరవణభవ*

ఈ క్రింది వీడియో లింక్లు చూడండి

ఈ సుబ్రహ్మణ్య షష్టి కథ విన్నవారికి కోటి ...




Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ