తెలుగు సినీ ప్రేక్షకుల హృధయాలలో చిరస్థాయిగా నిలచిపోయిన గాన గంధర్వుడు, ప్రముఖ నేపధ్య గాయకుడు, ఘంటసాల వ్యక్తిగత సమాచారం
సినీ ప్రేక్షకుల గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి డిసెంబర్ 4వ తేదీన పుట్టిన సంవత్సరం 1922.
సినీ ప్రేక్షకుల గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి డిసెంబర్ 4వ తేదీన పుట్టిన సంవత్సరం 1922.
ఘంటసాల గారి బాల్యం:
ఈయన తండ్రిగారు సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు.ఆయన ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్నభజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో ఆయన సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య చూసుకోవడం మొదలుపెట్టారు.
ఘంటసాల సంగీత సాధన...
- తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశాడు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వుల పాలయాడు. అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల దగ్గరపనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. రెండేళ్ళ కాలంలో ఒకఇంట్లో బట్టలు ఉతకడంమరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకొనవలసి వచ్చింది. ఆలస్యమైనా తనతప్పు తెలుసుకొన్న ఘంటసాల తనదగ్గరున్న నలభైరూపాయల విలువగల ఉంగరాన్ని 8 రూపాయలకు అమ్మి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరు కొన్నాడు.
- విజయనగరం చేరినప్పటికి వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉన్నది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరకువెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బసచేయడానికి అనుమతి ఇచ్చాడు. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా తోటివిద్యార్థులు చేసినతప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరంలేక ఆ వూరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీతశిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఘంటసాల తన జీవితంలో ఎన్నోసార్లు గురువంటే ఆయనే అనిచెప్పేవాడు.
- శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయాడు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం (ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించాడు. భుజాన జోలెకట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవాడు. మిగిలిన అన్నాన్ని ఒకగుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి. గిన్నె కొనుక్కోవడానికి డబ్బులేక మేనమామకు ఉత్తరం వ్రాయగా ఆయన పంపిన డబ్బుతో ఒకడబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరచేవాడు.
- వేసవి సెలవులు పూర్తైన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడు. శాస్త్రి శిక్షణలో నాలుగుసంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తిచేసాడు. తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటపల్లెకుచేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు.
- 1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండుసంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు.
ఘంటసాల సినీ ప్రస్థానం...
- 1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్ళిచేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానే కచేరీచేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరివూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసి, కొంత అప్పుచేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాటవిని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.
- సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తన మకాంను పానగల్ పార్కు వాచ్మన్కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించాడు. ఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపుపొందాడు. ఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమ లో మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.
- తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.
- 1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు.తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావుసంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే! 1953లో వచ్చినదేవదాసు ఘంటసాల సినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది.
- ఆచిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెపుతుంటారు.
- 1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది.
- 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి.
విజయ విహారం:
- 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేషశైలావాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైనకూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నారు .
- 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే! ఏనోట విన్నా ఆయన పాడిన పాటలే.
ఘంటసాల వ్యక్తిగత సమాచారం...
- ఘంటసాల 1922 డిసెంబర్ 4 న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్య నారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.
- ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఘంటసాల తెలుగుసినిమా తొలి తరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.
- ఈయన తండ్రీ గారు ఘంటసాల సూర్యనారాయణ గాయకుడు, వెంకటేశ్వరరావు గారి బాల్యము లోనే తండ్రీ చనిపోయారు .
- 1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలయిన సావిత్రిని పెళ్ళి చేసుకున్నాడు.
- మేనమామ రాయాలి పిచ్చి రామయ్య ఘంటసాల ఈయన వద్దనే పెరిగి పెద్దయ్యారు .
- ఘంటసాల కి ఐదు(5) గురు పిల్లలు ఇద్దరు (2) కొడుకులు విజయ కుమార్, రత్న కుమార్, (3) ముగ్గురు కూతుర్లు శ్యామల, సుగుణ, శాంతి.
- ఘంటసాల పాట పాడిన మొదటి సినిమా పేరు సీత రామ జననం.
- గంభీరమైన స్వరముతో, పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఘ౦టసాల ఆలపి౦చిన భగవద్గీత అత్యంత ప్రజాదరణ పొందింది.
- ఈయనకు 1970 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకొన్నాడు.
- గాన గంధర్వ ఘ౦టసాల గారు 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసారు.
- 1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవారు.1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది.
- 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు.
- 1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యారు.
- అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు.
- 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11నఆస్పత్రిలో కన్నుమూసాడు. యావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
ఘంటసాల గారి వ్యక్తిత్వం...
- ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. ఆయన ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవాడు.
- ఆనాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆవాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది " అని ఎన్నోసార్లు చెప్పేవాడు.
- మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయనపట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు.
- సీతారామశాస్త్రిగారి కుమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు.
- పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు.
- సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను 'అన్నా' అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు 'అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ' అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు.
- కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తనఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు.
నేపథ్య గాయకునిగా మరియు సంగీత దర్శకునిగా పేరు పొందిన చిత్రాలు...
- షావుకారు, పాతాళభైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, లవకుశ, రహస్యం, గుడిగంటలు
- దేవదాసు, కన్యాశుల్కం, దొంగరాముడు, తోడికోడళ్ళు, డాక్టర్ చక్రవర్తి, ఇద్దరు మిత్రులు
- అప్పు చేసి పప్పు కూడు, జగదేకవీరుని కథ, మూగ మనసులు, మంచి మనసులు
- భక్త జయదేవ, మహాకవి కాళిదాసు, భక్త తుకారాం, పాండురంగ మహత్యం, ఆరాధనఆత్మబలం, ప్రేమనగర్, బంగారు బాబు మొదలైనవి.
ఘంటసాల గారి ప్రైవేటు ఆల్బములు...
- కుంతీవిలాపం
- పుష్ప విలాపం
- దేశభక్తి గీతాలు
- భగవద్గీత
- భక్తి గీతాలు
ఘంటసాల గారి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది యూ.ఆర్ .యల్ లు చూడండి....
ఘంటసాల వెంకటేశ్వరరావు ( డిసెంబర్ 4, 1922 - ఫిబ్రవరి 11, 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య ...
ఘంటసాల గారి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది యూ.ఆర్ .యల్ లు Youtube videos చూడండి....
Sep 12, 2017 - Uploaded by Celebrity Info
Ghantasala is an Indian film playback singer and a composer who works predominantly in Tollywood film ...
Jan 8, 2012 - Uploaded by Mana Ghantasala
గానగంధర్వుడు ఘంటసాల గాత్రం వెనుక పడ్డ కష్టాల తెలిస్తే షాక్ అవుతారు|| GhantasalaVenkateswara Rao ...
Jun 26, 2015 - Uploaded by Saregama Telugu
Listen to the evergreen hit songs of legendary Ghantasala Venkateswara Rao Venkata Rao from the Telugu ...
Ghantasala Ganamrutam - Telugu Old Hit Video Songs ... - YouTube
Feb 11, 2016 - Uploaded by Volga Video
Ghantasala Ganamrutam - Telugu Old Hit Video Songs Collections Watch more movies @ http://www ...
Dec 22, 2017 - Uploaded by TeluguOne
Ghantasala & P. Susheela All Time Super Hit Old Melody Songs, Non Stop VideoSongs Collection ...
Apr 28, 2017 - Uploaded by Saregama South
Ghantasala Venkateswara Rao was a composer, playback singer known for his works predominantly in ...
Mar 18, 2014 - Uploaded by Volga Video
Ghantasala Super Hit Old Video Songs Back to Back - Vol 1 Watch more movies @ http://www.youtube.com ...
Dec 12, 2017 - Uploaded by VolgaMusicBox
Ghantasala Golden Hits (మధుర గీతాలు) || Ghantasala Back 2 Back Super HitSongs Jukebox Watch Latest Telugu ...
Jun 24, 2015 - Uploaded by Rose Telugu Movies
Ghantasala Super hit Songs -Telugu Classical Songs - ANR - Jamuna. RoseTelugu ... Subscribe ...
Oct 4, 2014 - Uploaded by Rose Telugu Movies
Ghantasala Telugu Hit Songs - Jukebox - (Ghantasala Jukebox). Rose Telugu... Subscribe For More Telugu ...
Jul 15, 2017 - Uploaded by Saregama South
ONE STOP JUKEBOX - Top 50 Songs of N.T. Rama rao from super hit Telugumovies. Here you can enjoy ...
Feb 18, 2013 - Uploaded by Telugu Filmnagar
Watch Anthasthulu/Antastulu Telugu Movie Songs. Starring ANR/Nageswara Rao and Krishna Kumari For ...
Jul 28, 2017 - Uploaded by Saregama South
ONE STOP JUKEBOX - Top 50 Songs of ANR - Akkineni Nageswara Rao from super hit Telugu movies. Here ...
Apr 10, 2015 - Uploaded by iDream Telugu Movies
Watch Ghantasala Best Melody Hit Songs, Ghantasala Venkateswara Rao was an Indian playback singer ...
Mar 4, 2016 - Uploaded by Saregama Telugu
Listen to the super hit Telugu romantic songs of all time performed by the legends Ghantasala & P.Susheela ...
Sep 21, 2013 - Uploaded by Manjunatha Rao
Nannu Dochukunduvate Gulebakavali Katha TeluguOld Classics NTRGhantasala, Susheela YouTub ...
Nov 1, 2014 - Uploaded by Rose Telugu Movies
Ghantasala Telugu Hit Songs - Jukebox - NTR Old Songs Jukebox - (Ghantasala ... Subscribe For More ...
Jan 12, 2018 - Uploaded by TeluguOne
Watch Ghantasala-NTR Super Hit Combination Songs Video Jukebox. ఘంటసాల- ఎన్.టి.ఆర్ ల కలయికలో వచ్చిన అద్భుతమైన ...
Feb 23, 2016 - Uploaded by Saregama South
Listen to the super hit Telugu romantic songs of all time performed by the legends Ghantasala & P.Susheela ...
Jul 26, 2016 - Uploaded by My3 Music
Listen to the enchanting and mesmerizing songs of Lord Venkateswara ... Sung by legendary and ...
Jun 26, 2015 - Uploaded by Saregama Telugu
Listen to the evergreen hit songs of legendary Ghantasala Venkateswara Rao Venkata Rao from the Telugu ...
Jan 28, 2018 - Uploaded by Temple Tales
Listen to Ghantasala Songs on Lord Venkateswara which has Namo Venkatesa, Yedukondala Swamy ...
Listen to Ghantasala Songs on Lord Venkateswara which has Namo Venkatesa, Yedukondala Swamy ...
Feb 15, 2016 - Uploaded by Volga Video
Non Stop Ghantasala Ganamrutam Vol 2 - Telugu Video Songs Jukebox Watch more movies @ http://www ...Search Results
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com కూడా చూడండి
Like,share and subscribe చేయండి . థాంక్యూ ...