3, డిసెంబర్ 2018, సోమవారం

Gana Gandharva,famous playback singer and Ghantasala personal information in the cinematography of Telugu film audience

తెలుగు సినీ ప్రేక్షకుల హృధయాలలో చిరస్థాయిగా నిలచిపోయిన గాన గంధర్వుడుప్రముఖ నేపధ్య గాయకుడుఘంటసాల వ్యక్తిగత సమాచారం  
సినీ ప్రేక్షకుల గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి డిసెంబర్ 4వ తేదీన పుట్టిన  సంవత్సరం 1922.
ఘంటసాల గారి  బాల్యం:
ఈయన తండ్రిగారు సూర్యనారాయణ మృదంగం వాయిస్తూభజనలు చేసేవారు.ఆయన ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ  సంగీత   సభాస్థలికి తీసుకెళ్ళేవారు.  ఘంటసాల  అక్కడ  జరుగుతున్నభజనలు వింటూ  పాటలు పాడుతూ నాట్యం చేసేవాడుఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అని పిలిచేవారుఘంటసాల 11వ  ఏట సూర్యనారాయణ మరణించారుచివరి రోజుల్లో ఆయన సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు.  ఆయన మరణంతో  ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య చూసుకోవడం మొదలుపెట్టారు.
ఘంటసాల సంగీత సాధన...

  1. తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా  కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశాడుఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి  నవ్వుల పాలయాడు.  అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగిందితనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల దగ్గరపనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడురెండేళ్ళ కాలంలో ఒకఇంట్లో బట్టలు ఉతకడంమరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకొనవలసి వచ్చిందిఆలస్యమైనా తనతప్పు తెలుసుకొన్న  ఘంటసాల తనదగ్గరున్న నలభైరూపాయల విలువగల ఉంగరాన్ని 8 రూపాయలకు అమ్మి ఆంధ్రరాష్ట్రంలో  ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరు కొన్నాడు. 
  2. విజయనగరం  చేరినప్పటికి  వేసవి సెలవుల  కారణంగా  కళాశాల  మూసి ఉన్నది కళాశాల ప్రిన్సిపాల్  దగ్గరకువెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బసచేయడానికి అనుమతి ఇచ్చాడుఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడుఇలా ఉండగా తోటివిద్యార్థులు చేసినతప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారుఅది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారుగత్యంతరంలేక  వూరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడుఅప్పుడు  గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీతశిక్షణ ఇవ్వడానికి అంగీకరించారుఘంటసాల తన  జీవితంలో ఎన్నోసార్లు గురువంటే ఆయనే అనిచెప్పేవాడు
  3. శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయాడుఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం (ఇంటింటా అడుక్కోవడంచేయడం నేర్పించాడుభుజాన జోలెకట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవాడుమిగిలిన అన్నాన్ని ఒకగుడ్డలో పెడితే చీమలు పడుతుండేవిగిన్నె కొనుక్కోవడానికి డబ్బులేక మేనమామకు ఉత్తరం వ్రాయగా ఆయన పంపిన డబ్బుతో ఒకడబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరచేవాడు.
  4. వేసవి సెలవులు పూర్తైన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడుశాస్త్రి శిక్షణలో నాలుగుసంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తిచేసాడుతర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటపల్లెకుచేరి అక్కడ ఉత్సవాలలోవివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు.
  5. 1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండుసంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు.

ఘంటసాల సినీ ప్రస్థానం...
  • 1944 మార్చి 4 ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్ళిచేసుకున్నాడుఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానే కచేరీచేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడుకొన్నాళ్ళకు దగ్గరివూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిసాడుఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడుఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసికొంత అప్పుచేసి మద్రాసు వెళ్ళాడుసముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్యబి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడువారిరువురు ఘంటసాల పాటవిని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.
  •  సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తన మకాంను పానగల్ పార్కు వాచ్మన్కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడుపగలంతా అవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవాడుచివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించాడుఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవాడుమరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపుపొందాడుఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్యబి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమ లో మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారుభానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతినాగయ్యలు ధైర్యం చెప్పేవారుఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.
  • తర్వాత భానుమతిరామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చిందితర్వాత బాలరాజుమనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.
  • 1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగిందిఅప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు.తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావుసంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే! 1953లో వచ్చినదేవదాసు ఘంటసాల సినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది.
  • ఆచిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెపుతుంటారు.
  • 1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది.
  • 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి.

విజయ విహారం:
  • 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేషశైలావాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైనకూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారుఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నారు .
  • 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదేఏనోట విన్నా ఆయన పాడిన పాటలే.

ఘంటసాల వ్యక్తిగత సమాచారం...
  • ఘంటసాల 1922 డిసెంబర్ 4 గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్య నారాయణరత్నమ్మ దంపతులకు జన్మించాడు.
  •  ఘంటసాల వెంకటేశ్వరరావు  ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడుఘంటసాల తెలుగుసినిమా తొలి తరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.
  • ఈయన తండ్రీ గారు ఘంటసాల సూర్యనారాయణ  గాయకుడు, వెంకటేశ్వరరావు గారి బాల్యము లోనే తండ్రీ చనిపోయారు .
  • 1944 మార్చి 4 ఘంటసాల తన మేనకోడలయిన సావిత్రిని పెళ్ళి చేసుకున్నాడు.
  • మేనమామ  రాయాలి పిచ్చి రామయ్య ఘంటసాల ఈయన వద్దనే పెరిగి పెద్దయ్యారు .
  • ఘంటసాల కి ఐదు(5) గురు పిల్లలు ఇద్దరు (2) కొడుకులు విజయ కుమార్, రత్న కుమార్, (3) ముగ్గురు కూతుర్లు శ్యామల, సుగుణ, శాంతి.
  • ఘంటసాల పాట పాడిన మొదటి సినిమా పేరు సీత రామ జననం.
  • గంభీరమైన స్వరముతో, పట్రాయని సీతారామశాస్త్రి  (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఘ౦టసాల ఆలపి౦చిన భగవద్గీత అత్యంత ప్రజాదరణ పొందింది.
  • ఈయనకు 1970 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకొన్నాడు.
  • గాన గంధర్వ ఘ౦టసాల గారు 1974 ఫిబ్రవరి 11 ఆస్పత్రిలో కన్నుమూసారు.
  • 1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవారు.1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది.
  • 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు.
  • 1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నారు.  చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యారు.
  • అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు
  • 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11నఆస్పత్రిలో కన్నుమూసాడు. యావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
ఘంటసాల గారి వ్యక్తిత్వం...
  • ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. ఆయన ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవాడు.
  • ఆనాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆవాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది " అని ఎన్నోసార్లు చెప్పేవాడు.
  • మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయనపట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు
  • సీతారామశాస్త్రిగారి కుమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు.
  • పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు.
  • సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను 'అన్నా' అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు 'అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ' అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు.
  • కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తనఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు.
నేపథ్య గాయకునిగా మరియు సంగీత దర్శకునిగా పేరు పొందిన చిత్రాలు...  
  • షావుకారు, పాతాళభైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, లవకుశ, రహస్యం, గుడిగంటలు
  • దేవదాసు, కన్యాశుల్కం, దొంగరాముడు, తోడికోడళ్ళు, డాక్టర్ చక్రవర్తి, ఇద్దరు మిత్రులు
  • అప్పు చేసి పప్పు కూడు, జగదేకవీరుని కథ, మూగ మనసులు, మంచి మనసులు
  • భక్త జయదేవ, మహాకవి కాళిదాసు, భక్త తుకారాం, పాండురంగ మహత్యం, ఆరాధనఆత్మబలం, ప్రేమనగర్, బంగారు బాబు మొదలైనవి. 
ఘంటసాల గారి ప్రైవేటు ఆల్బములు... 
  • కుంతీవిలాపం
  • పుష్ప విలాపం
  • దేశభక్తి గీతాలు
  • భగవద్గీత
  • భక్తి గీతాలు
ఘంటసాల గారి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది యూ.ఆర్ .యల్ లు చూడండి.... 
ఘంటసాల వెంకటేశ్వరరావు ( డిసెంబర్ 4, 1922 - ఫిబ్రవరి 11, 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య ...

ఘంటసాల గారి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది యూ.ఆర్ .యల్ లు Youtube videos చూడండి.... 

Sep 12, 2017 - Uploaded by Celebrity Info
Ghantasala is an Indian film playback singer and a composer who works predominantly in Tollywood film ...
Jan 8, 2012 - Uploaded by Mana Ghantasala
గానగంధర్వుడు ఘంటసాల గాత్రం వెనుక పడ్డ కష్టాల తెలిస్తే షాక్ అవుతారు|| GhantasalaVenkateswara Rao ...

నా ఈ బ్లాగ్ itstelugu.blogspot.com  చూసి Like,share and subscribe చేయండి .
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com కూడా చూడండి
Like,share and subscribe చేయండి . థాంక్యూ ...

29, నవంబర్ 2018, గురువారం

Patients can easily use medication if you know the doctors who write codes

wowitstelugu.blogspot.com
డాక్టర్స్ రాసే కోడ్స్ తెలిస్తే పేషెంట్లు మందులు సులభంగా వాడొచ్చు
Doctor Prescription
మనకి జలుబు చేసినా, జ్వరమొచ్చినా,   లేదా ప్రాణాంతకమైన జబ్బు చేసినా ముందు డాక్టర్లను సంప్రదించిన తరువాతే  నన్ను సురక్షితంగా ఉంచు అంటూ దేవుడిని వేడుకుంటాం
డాక్టర్లను సంప్రదించినప్పుడు వారు రాసే రాత చాలా సార్లు చాల మందికి  అర్ధం కాదు. ఆంగ్లం తెలీనివారికి  అంతగా  చదువుకొని వారికీ అయితే  ఈ  సమస్య మరీ ఎక్కువుగా  ఉంటుంది . కనీసం  మందుల షాపు వారికైనా అర్ధమవు తుంది.  అది  కొంచెం గుడ్డిలో మెల్ల  అని  చెప్పు కోవచ్చు.   ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ప్రతీ మనిషి ప్రతీ దానికి ఇంకొకరి మీద ఆధార పడే పరిస్థితి తగ్గి పోతుంది.
డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ లో కొన్ని కోడ్స్ ఉంటాయిRx అని.. Hx అని.. ఇలా ఎన్నో కోడ్స్ ఉంటాయి.  వీటిని  ఎప్పుడైనా గమనించారా?   పోనీవీటికి అర్ధం ఏమిటో మీకు తెలుసా? అలాంటి ముఖ్యమైన కోడ్స్ అర్ధాలను మీరు తెలుసుకోండి . 
డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ లో రాసేటువంటి  కోడ్స్ అర్ధాలు చూడండి… 
(Common Abbreviations related to doctors prescriptions)
  • Rx = Treatment (చికిత్స)
  • Hx = History (చరిత్ర)
  • Dx = Diagnosis (నిర్ధారణ)
  • q = Every (ప్రతి)
  • qd = Every day (ప్రతి రోజు)
  • qod = Every other day (ప్రతి ఇతర రోజు)
  • qh = Every Hour (ప్రతి గంట)
  • S = without (లేకుండా)
  • SS = One half (సగం)
  • C = With (తోడు)
  • SOS = If needed (అవసరమైతే)
  • AC = Before Meals (భోజనానికి ముందు)
  • PC = After meals (భోజనం తరవాత)
  • OD = Once a Day (రోజుకి ఒక్కసారి)
  • BID = Twice a Day (రోజుకి రెండు సార్లు)
  • TID = Thrice a Day (రోజుకి మూడు సార్లు)
  • QID = Four times a day (రోజుకి నాలుగు సార్లు)
  • BT = Bed Time (పడుకునేటప్పుడు)
  • hs = Half Strength or Bed Time (సగం లేదా పడుకునేటప్పుడు)
  • BBF = Before Breakfast (అల్పాహారం తినే ముందు)
  • BD = Before Dinner (రాత్రి భోజనం తరువాత)
  • Tw = Twice a week (వారానికి రెండు సార్లు)
  • SQ = sub cutaneous (చర్మం కింద)
  • IM = Intramuscular (కండరాలలో)
  • ID = Intradermal (చర్మం లోపల)
  • IV = Intravenous (నరాల లోపల)
  • QAM = (every morning) (ప్రతి ఉదయం)
  • QPM (every night) (ప్రతి రాత్రి)
  • Q4H = (every 4 hours) (ప్రతి 4 గంటలకు)
  • PRN = (as needed) (అవసరమైనప్పుడు)
  • PO or “per os” (by mouth) (నోటి ద్వారా)
  • Mg = (milligrams) (మిల్లీ గ్రాములు)
  • Wt= (weight) (బరువు)
  • Mcg/ug = (micrograms) (మైక్రో గ్రాములు)
  • G or Gm = (grams) (గ్రాములు)
  • 1TSF ( Teaspoon) = 5 ml (ఒక చెంచా)
  • 1 Tablespoonful =15ml (టేబుల్ స్పూన్ నిండా)
  • F.B.S=fasting blood sugar(ఆహారం తీసుకోకుండా షుగర్ పరీక్ష )
  • P.P.B.S=Postprandial blood sugar   (ఆహారం తీసుకున్న తర్వాత)
  • B.P=Blood Pressure (రక్త ప్రసరణ )
  • R.B.S=Random Blood sugar 
  • A.B.G.S = Arterial blood Gas sugar
  • H.D.L=high density lipoproteins
  • L.D.L.= low-density lipoproteins
  • V.L.D.L= Very low density lipoprotein
  • E.S.R: = erythrocyte sedimentation rate
  • R.B.C= Red Blood cells
  • tab= tablet (మాత్ర)
  • W.B.C= white blood cells( తెల్ల రక్త కణాలు )
  • Yo= years old (వయ్యస్సు)
  • W.N.L= within normal Limit (సాధారణ స్థాయిలోఉన్న)
  • U.T.I= urinary tract infection   (మూత్ర ద్వారం లోవ్యాధి  సంక్రమణ)
  • tsp= tea spoon full
నేను ఇక్కడ మీకు తెలియ జేసినా చాల ముఖ్య మైనవి కొన్ని మాత్రమే తెలియ జేయడం జరిగింది. తెలియని కోడ్ లు ఏమైనా ఉంటె డాక్టర్ రాసిన వెంటనే అడగడం మర్చిపోకండి.
prescription గురించి వివరాలు ఈ క్రింద తెలుసుకోండి ...
A prescription is a health-care program implemented by a physician or other qualified health care practitioner in the form of instructions that govern the plan of ...
Prescription, prescriptive, or prescribe may refer to: Health care[edit]. Medical prescription, a plan of care written by a physician or other health care professional.


నా ఈ బ్లాగ్ wowitstelugu.blogsopt.com

నా బ్లాగ్ wowitsviral.blogsopt.com

నా బ్లాగ్ teluguteevi.blogspot.com

మరియు ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com 

కూడా  like,share and subscribe చేయండి మరియు  comment

చేయడం మర్చిపోకండి .థాంక్యూ.