28, నవంబర్ 2018, బుధవారం

Learn about the superior health benefits of Indian Apple Guava fruit

భారత దేశపు ఆపిల్ పండు జామపండు లో ఉండే విశేష  ఆరోగ్య రహస్యాలు తెలుసుకోండి 

మన దేశంలో చౌకగా దొరికే పండ్లలో జామపండు  ఒకటి.    దీని వలన ఆరోగ్యానికి   కలిగే  ప్రయోజనాలు  తెలిస్తే అందరు ఆశ్చర్యానికిగురవుతారు!

విటమిన్‌ " సి" ఎక్కుగా దొరికేవాటిలో ఉసిరికాయలకు ధీటుగా జామను చెప్పుకోవచ్చు. అపరిమిత పోషకాల నిలయం జామ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. 

కొందరికి పచ్చి కాయలు నచ్చితే, మరి కొందరికి పండుపైనే మనసు. కమలా పండు  కన్నా ఐదు రెట్లు ఇందులో విటమిన్‌  "సి"  ఉంటుంది.  నిమ్మ, నారింజ లలో కంటే నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువగా వుంటుంది. ఈ కాయ పండుతున్నకొద్దీ ‘సి' విటమిన్ శాతం అధికమవుతుంది. 

కేవలం విటమిన్‌ "సి" మాత్రమే కాదు. ఇందులో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, కేల్షియమ్‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి మెండుగా ఉన్నాయి.అంతేకాదు, జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌ ఇందులో నిండుగా ఉంది. 
  • A , B , C   విటమిన్లు పుష్కలంగా లభిస్తాయిశరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా  లభిస్తాయి.
  • జామ అతి తక్కువ క్యాలరీలు , తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు.
  • జామ ఎక్కవ పీచు పదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది.మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
  • ముసలితనాన్ని(Early Aging) అరికట్టడంలో సహాయపడుతుంది. 
  • జామపండు వయసుకు ముందే ముఖం పై ముడతలు, చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.
  • జామపండ్లతో తయారు చేసిన జ్యూస్‌లు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, అందంగా, ముఖ ఛాయ పెరుగుతుందని బ్యూటీషియన్లు చెబుతుంటారు. 
  • స్త్రీలలో రుతుచక్ర సమస్యలు , బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది
  • కంటి సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది.
  • జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
  • దీనిలో విటమిన్ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్, లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు, చర్మానికి , కంటికి  చాల మంచిది.
  • అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయ లో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.
  • కాలిన గాయాలకు జామ పండు  గుజ్జును రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
  • ఎసిడిటికి రోజుకో పండు తింటే మంచిది. కడుపు ఉబ్బరం, కడుపులో మంట నుండి ఉపశనం పొందేలా చేస్తుంది.
  • జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు , బీపి పెరగకుండా చేస్తాయి.
  • అంతే కాకుండా జమకాయలో B కాంప్లెక్స్ విటమిన్స్ (B 6 , B 9 ) , E , K విటమిన్స్ ఉంటాయి.
  • ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.
  • జామ నుంచి లభించే పీచు షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా పనిచేస్తుంది. వీరు జామకాయను నిరభ్యంతరంగా తినవచ్చు. 
  • జామకాయలో ఉండే బి3, బి6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
  • జామకాయను బాగా నమిలి తినడం వల్ల శరీరంలో ఫిల్లెట్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఈ పోషకాంశాలు గల ఫిల్లెట్ సంతానోత్పత్తిని పెంచే హార్మోలను ఉత్పత్తి చేస్తుంది.
  • జామకాయలో ఐయోడిన్ లేదు. అయితే ఇందులో ఉండే కాపర్, మరియు ఇతర మినిరల్స్ థైరాయిడ్ జీవక్రియలు క్రమబద్దం చేయడానికి, హార్మోనుల ఉత్పత్తికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
  • మొదడు కణాలు చురుకుగా పనిచేయడానికి జామపండు లోని కెరొటినాయిడ్స్‌, ఐసోఫావో నాయిడ్స్‌, పాలి ఫినాల్స్‌ తోడ్పడతాయి. 
జామ ఆకుల వల్ల కూడా చాల ప్రయోజనాలు :
  • జామ ఆకులలో రక్త పీడనం మరియు హృదయ స్పందనల రేటును తగ్గించే సమ్మేళనాలు ఉంటాయని కనుగొనబడింది. 
  • జామ ఆకుల నుండి తయారు చేసిన టీని తాగటం వలన రక్తంలో లిపిడ్ ల స్థాయి మెరుగుపడి, చెడు కొవ్వు పదార్థాల మరియు అనారోగ్యకర ట్రై-గ్లిసరైడ్ ల స్థాయిలు తగ్గుతాయి.
  • జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. 
  • ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి. ధృడత్వం కూడా చేకూరుతుంది. 
  • దంతాలు కదలటం, చిగుళ్లనుంచి రక్తం కారటం వంటి సమస్యలను అరికడుతుంది.
  • కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. 
  • కీళ్లవాపు, నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు జామాకులను కొద్దిగా వేడిచేసి వాపులున్నచోట కట్టుకట్టుకోవాలి. 
  • కండరాలు గట్టిపడేలా చేస్తుంది. ఎముకల ద్రుడత్వనాకి జామకాయలో ఉండే మ్యాంగనీస్ బాగా సహాయపడుతుంది.
  • ఐదు, ఆరు ఆకులు నీటిలో మరగబెట్టి డికాక్షన్‌ వాడితే దగ్గు, జలుబు పోతుంది. ఆకుల నుంచి లభించే తైలం యాంటీ ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తాయి.
  • చర్మ సంరక్షణకు సైతం జామ తనవంతు కృషి చేసుందని వైద్య నిపుణుల చెబుతుంటారు. మొటిమలతో బాధపడేవారు జామ ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి లేపనం చేసుకుంటే కొద్దిరోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
జామ పండును ఏ ఏ పద్దతులలో తీసుకోవచ్చునో తెలుసుకోండి...
  1. జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగా మాగిన జామపండు లోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.
  2. ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు.
  3. గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.
  4. జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.
ఇన్ని రకాలైన ఆరోగ్య ప్రయోజనాలున్న జామ పండుని ఇప్పటి నుంచే తినడం ప్రారంబిద్దామా మరి...
మరింత వివరాలకు క్రింది యూ.ఆర్. యల్ లు చూడండి ...
జామ లేదా జామి (ఆంగ్లం Guava) మిర్టేసి కుటుంబానికి చెందిన ... కొన్ని దేశాల్లో జామ పండు పై తొక్క తొలగించి పంచదార ...

ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్ లు . చూసి మరింత వివరాలు తెలుసుకోండి ..

    ఒక్క జామపండు 10 ఆపిల్స్ తో సమానం ? |Benefits Of Guava ...

   జామ పండు వల్ల ఉపయోగాలు || Guava benefits - YouTube
Nov 2, 2016 - Uploaded by Amulya TV
Subscribe Here : https://www.youtube.com/channel/UCugCuqIU-UQzlW3Obka8EPw Unknown Facts Telugu ...
Jul 28, 2017 - Uploaded by Entertainment Media360
jama pandu upayagalu|Ultimate Health Benefit Guavas|# ... Up next. Health Benefits of Guava Leaves ...
Jul 14, 2013 - Uploaded by V6 News Telugu
V6 News Telugu ... Health Benefits of Guava Leaves Telugu I Jama Akulu I జామఆకుల ఉపయోగాలు I Good ...

NOTEమీకు ఈ నా బ్లాగ్ www.itstelugu.blogger.com  నచ్చినట్లైతే లైక్ ,షేర్, మరియు సబ్స్క్రయిబ్ చేయండి ...

అలాగే నా ఇంగ్లీష్ వెబ్సైటు ...www.iamgreatindian.comనచ్చినట్లైతే లైక్ ,షేర్, మరియు సబ్స్క్రయిబ్ చేయండి...

26, నవంబర్ 2018, సోమవారం

Divine praises (stotras) to be followed by the litting divine light in the room of God.

దేవుడి గదిలో దీపం వెలిగించేక మనం నిత్యం పాటించ వలసిన దైవ స్తోత్రాలు
ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు  ముగించిన తరువాత సూర్యుని వైపు తిరిగి ఈ మంత్రం చదవాలి.

బ్రహ్మస్వరూపముదాయే, మధ్యాహ్నేతు మహేశ్వరం, సాయంద్యేతు సదావిష్ణుం, త్రిమూర్తిత్వ దివాకరం . 
తరువాత సూర్య నమస్కారం ... 

ఆదిత్యాయచ సోమాయ, మంగళాయ, బుధాయచ, గురు, శుక్ర, శనిభ్యశ్చరాహువే, కేతవే నమః 
తరువాత దేవుడి గదిలో వచ్చిదీపానికి పసుపు, కుంకుమ, అలంకరించి దీపం వెలిగించి ...

దీపం జ్యోతి పరంబ్రహ్మం దీపం జ్యోతి నమో నమః |
దీపేన హరతే పాపం దీప దేవి నమో నమః || 

తరువాత ఆచమనం...

కేశవయా స్వాహా ( స్త్రీలు అయితే) నమః | 
నారాయణాయ స్వాహా
మాధవాయ స్వాహా | అంటూ సుద్దజలాన్ని సేవించాలి. 
తరువాత గోవిందా అంటూ నీటి ప్రక్కకు విడవాలి.

తరువాత విగ్నేశ్వర స్తోత్రాలు చదువుకోవాలి... 

  • శుక్లాంభరదరం ,విష్ణుం శశి వర్ణం చతుర్భుజం, ప్రసన్న వదనం జ్యాయే సర్వవిఘ్న్గోప శాంతయే, అఘజనన పద్మార్కం గజానన మరహర్నిశం, అనేకదంతం భక్తానాం ఏకదంతా ముఖాస్మహే| 
  • వక్ర తుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ | నిర్విఘ్నం కురుమే దేవా  సర్వకార్యేషు సర్వదా || 
  • ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నోదంతి   ప్రచోదయాత్|| 
  • ఓం శ్రీమ్  హ్రీమ్  క్రీమ్ గ్రౌమ్  గం  గణపతేయ వర వరద సర్వజనంమే వసమానయా స్వాహా || 
  • గం గం గణాధిపతయే నమః 
తరువాత ఆయా దేవతల స్తోత్రాలు చదువుకోవాలి. 
లక్ష్మీ స్తోత్రం...

  • ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యోనమః 
  • ఓం శ్రీం  హ్రీం శ్రీం కమలే కమలాయే ప్రసీద ప్రసీద 
  • శ్రీం  హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యైనమః 
  • ఓం ధనధ సౌభాగ్య లక్ష్మి కుబేర వైశ్రవణాయ మమ కార్య సిద్దిరస్తు
  • ఓం హ్రీం శ్రీం ధన లక్ష్మీచ విద్మహే కుభేర యుక్తాచ ధీమహీ  తన్నో లక్ష్మీ కుబేరౌ ప్రచోదయాత్|| 
  • ఓం భూర్భుస్సువః తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
  • భువనేశ్వరి సంకల్పమే జనియించె మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం || 
  • నమస్తేస్తు  మహామాయే శ్రీ పీఠే సుర పూజితే  శంఖ చక్ర గథా హస్తే  మహాలక్ష్మీ నమోస్తుతే || 
  • ఓం పంచతన్మామాత్మ సాయకాయై నమః 
  • ఓం శ్రీ మాత్రేయ నమః  
తరువాత శ్రీ రామస్తోత్రం 
ఇది ఒక్క సారి  పఠిస్తే లక్షసార్లు పఠించిన ఫలితం వస్తుంది ... 


  • శ్రీ రామ రామ రామేతి రమేరామే మనోరమే సహశ్రనామ తత్తుల్యం రామనామ వరాననే|| 
శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రం  

  •  శ్రీయః కాంతాయ కల్యాణ  నిధ నిధయేర్థినామ్ శ్రీవేంకట నివాస శ్రీనివాసాయ  మంగళమ్ || 
శ్రీకృష్ణా ప్రార్థన...

  • గోవిందా హరి గోవిందా గోకుల  నందన గోవిందా| గోవిందా హరి గోవిందా గోకుల  నందన గోవిందా|| 
శివస్తుతి... 

  • ఓం నాగేంద్ర హారాయ  త్రిలోచనాయ| ఓం  భస్మాంగ  రాగాయ త్రిలోచనాయ|  ఓం నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ | ఓం తస్మైన కారాయ నమశ్శివాయ
  • వాగర్థావివ సంపృక్తవ్ వాగర్థ ప్రతిపత్తయే| జగతః  పితరౌ వందే  పార్వతి పరమేశ్వరౌ || 
  • ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివ భంధనా స్ర్ర్మత్యో మృక్షీయ మామృతాత్ ||  
హనుమాన్ స్తుతి... 

అంజనా గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమా| రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా || 
నృసింహ స్తోత్రం... 

ఓం ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వోతోముఖం నృసింహభీషణం భద్రం మృత్యోమృత్యుర్నమామ్యహం|| 


కుమారస్వామి స్తోత్రం... 
ఓం తత్పురుషాయ విద్మహేమహాసేనాయ ధీమహీ 
తనః షణ్ముఖ ప్రచోదయాత్||

వాస్తుదేవుడు... 

ఓం వాస్తునాధాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో వాస్తు  ప్రచోదయాత్ | |విశ్వకర్మ|విశ్వకర్మ|విశ్వకర్మ|  
శనైశ్చర స్వామి... 

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం త్వం నమామి శనైశ్చరం|| 
సులభంగా అందరూ ఇంట్లో  పఠించడానికి వీలైన స్తోత్రాలు తప్పక ప్రతినిత్యం అందరూ పఠించగలరని ఆశిస్తున్నాను
Note:
ఈ నా బ్లాగ్  wowitstelugu.blogspot.com 
మీకు నచ్చితే Like,share and subscribe, comment చేయండి.  
నా బ్లాగ్  wowitsviral.blogspot.com 

మీకు నచ్చితే Like,share and subscribe, comment చేయండి.
నా ఇంగ్లీష్ వెబ్సైటు...www.iamgreatindian.com
కూడా చూడండి  Like,share and subscribe, comment చేయండి.  ధన్యవాదాలు, థాంక్యూ...