యోగశాస్త్రం వివరించే మూలాధారం వంటి చక్రాలు కూడా మనిషి శరీరంలో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి కేంద్రాలు మాత్రమే .ఈ విధంగా అయస్కాంత శక్తి నిలయం అయిన మానవ శరీరం వివిధ గ్రహాల నుంచి వస్తున్న విద్యుతయస్కాంతాల తరంగాల వైబ్రేషన్లకు అనుగుణంగా మార్పుచెందును.
జ్యోతిష్య సంప్రదాయంలోనూ, తత్ఫలితంగా హిందువుల దైనందిక జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు. సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షముకు, శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు.
జ్యోతిష్య శాస్త్రంలో తెలిపినట్లు చంద్ర కుజుల వలన స్త్రీల ఋతుధర్మం , గురుని వలన కాలేయం , రవి వలన హృదయము , బుధుని వలన నరములు , శుక్రుని వలన మూత్రపిండములు ప్రభావితం అవ్వడం గురించి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు . పైత్యరసం పసుపు రంగులో ఉండటం కూడా గురుని ప్రభావం అని ఎప్పుడో నిరూపితం అయింది. చంద్రుని యొక్క ప్రభావం గర్భాశయం పైన , ప్రసవం పైన ఉంటుంది అని నిరూపితం అయినదని మనకి తెలిసిందే . అక్కడివరకు ఎందుకు మనపెద్దవారు పౌర్ణమి నాడు పిచ్చి ఎక్కువ అవుతుందని అమావాస్యకు తగ్గుతుంది అని ఎప్పుడో చెప్పారు .
ఆ తరువాత అమెరికా వారు చాల కాలము పరిశోధించి అది నిజమే అని ఒప్పుకున్నారు. శరీరంలోని సంపూర్ణ ద్రవ మరియు పార్షిక ద్రవ పదార్ధాలు ఏవైతే ఇనుమును కలిగి ఉన్నాయో అవన్ని చంద్రుని ఆకర్షణ శక్తికి లోనవుతున్నాయి అని అట్టి చర్యల వలన మానసిక భావోద్రేక సమస్యలకు మనుష్యుడు లోనవుతున్నాడు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .
- బృహజ్జాతకం వంటి పురాతన జ్యోతిష్య గ్రంథాలను పరిశీలిస్తే గర్భస్థ శిశువు పిండం దశ నుండి ప్రసవం వరకు ఏ గ్రహం వలన ఏయే అవయవాలు ఏర్పడుచున్నవో కూడా వివరణ ఇవ్వబడుచున్నది.
- పాతకాలంలో చాలా మంది వైద్యులకు జ్యోతిషం తెలిసి ఉండేది. రోగము కనపడిన రోజు నక్షత్రమును బట్టి ఆ రోగం ఎన్ని రోజులకు పోతుందనే లెక్కలుకట్టడం ఆయుర్వేద గ్రంథాలలో కనిపిస్తాయి.
- మనిషి శరీరంలోని ఏయే అవయవాల పైన ఏయే గ్రహాల ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తం, గుండె , పురుషుల కుడికన్ను , స్త్రీల ఎడమకన్ను.
స్తనములు, పాలు , గర్భాశయం, ప్రసవం, లింఫ్ గ్రంథులు, పురుషుల ఎడమ కన్ను, స్త్రీలకు కుడికన్ను , అండములు , కడుపు, ఆహారనాళం .
కుజుడు
ఎముకలలోని మజ్జ, కండరములు, బాహ్య జననేంద్రియములు, మూత్రకృచ్చం.
మెదడు, శరీరంలోని నరాలు అన్ని బుధుడుకి సంబంధించినవి . చర్మము, నాలుక , వోకల్ కార్డు నరాలు , స్వరపేటిక, మాటలు , తెలివితేటలు.
గురుడు
కాలేయం, గాల్ బ్లాడర్ , సంతానం దాని ఉత్పత్తికి సంబంధించిన భాగాలు , శరీరంలోని కొవ్వు, కఫం, తొడలు, మూత్రపిండాలు.
శుక్రుడు
వీర్యము, లోపలి జననేంద్రియాలు , కామమునకు సంబంధించిన అన్ని అవయవములు, మూత్రపిండములు, శరీరంలోని గ్లూకోజ్ , పాంక్రీయాస్ , శరీరంలోని నీరు , రతిక్రియ , యోని లొపలి భాగములు .
శని
ఎముకలు, చర్మం, విసర్జన కార్యము , మలము , గుదము , రెక్టమ్ , చెమట , గోళ్లు , శరీరం పైన గల వెంట్రుకలు , పెద్దప్రేగులు , వాతం.
పైన చెప్పిన విధంగా ఆయా అవయవాల పైన ఆయా గ్రహాల ప్రభావం ఉంటుంది.
నవ గ్రహాల పూజ
నవ గ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు నిర్వహించడం చాలామంది హిందువుల ఆచారాలలో ఒక ముఖ్యమైన అంశం. చాలా ఆలయాలలో, ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాల మందిరాలు ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి గ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి.
నవగ్రహాలను స్తుతించే శ్లోకం
ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
రవి
- తమోరిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం
జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్
చంద్ర
- నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం
కుజ
- కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం
బుధ
- సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం
గురు
- బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం
దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
శుక్ర
- సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం
శని
- ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం
నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
రాహు
- సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్
అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
కేతు
- రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్
ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్
నవగ్రహ అలయలు మొత్తముగా తమిళనాడులో ఉన్నాయి. అవి
- 1. అంగారక గ్రహనికి గాను వైదీస్వరన్ కొయిల్
- 2. బుధ గ్రహానికి గాను తిరువంగాడ్
- 3. శుక్ర గ్రహానికి గాను కంజనూర్
- 4. కేతు గ్రహానికి గాను కీల్రుమ్పల్లమ
- 5 ుగురు గ్రహానికి అలమ్ గుడి
- 6. శని గ్రహానికి తిరునల్లారు
- 7.రాహువు గ్రహానికి గాను తిరు నాగేశ్వరమ్
- 8. చంద్రగ్రహానికి తిన్గలూరు.
ఆత్మ, రాజయోగం, పదోన్నతి, పితృయోగం.
ఈ క్రింది వీడియో యు .ఆర్. యల్ . ల లో . నవగ్రహాలు మనిషి పై వాటి ప్రభావం గురించి తెలుసుకోండి