23, మార్చి 2020, సోమవారం

జనతా కర్ఫ్యూ కరోనా వైరస్ వల్ల వచ్చేది లాభమా నష్టమా ఒక విశ్లేషణ

wowitstelugu.blogspot.com
జనతా కర్ఫ్యూ కరోనా వైరస్ వల్ల వచ్చేది  లాభమా  నష్టమా  ఒక  విశ్లేషణ



గత నెల రోజులుగా ఒక పదం ప్రజల లో విస్తృతం గా ప్రచారం  అవుతుంది అదే కరోనా వైరస్ కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.కరోనా ఎక్కువుగా జంతువుల నుండి జంతువులకు వ్యాపిస్తుంది.  ఈ వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారులండన్  పరిశోధనల్లో దీనిని  "కరోనావైరస్‌" గా గుర్తించారు. ఇది మనుషుల నుండి వేరొకరికి వ్యాపిస్తాడని గుర్తించారు . దీనిని కోవిడ్ -19 గా పిలుస్తున్నారు. 

కోవిడ్-19( Covid  19).  దీనిని ఒక జబ్బుగా గుర్తించారు .చైనా తీవ్రం దీని ప్రభావము గురి అయి దాదాపు 3000 మంది వరకు చని పోయారు .ఇటలీ ఇపుడు దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాడు. ఇంతకు ముందు ఇలాటి  వైరస్ లు చాల వచ్చి నప్పటి కి ఇంత విస్తృత ప్రచారం జరగలేదు. 


మన దేశం లో ప్రధాన మంత్రి పిలుపు మేరకు 22-3-2020 పూర్తి జనతా కర్ఫ్యూ ఆచరించాలని పిలుపు ఇచ్చారు . ఈ పిలుపు మేర పూర్తిగా కర్ఫ్యూ సక్సెస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కర్ఫ్యూ ని ఇంకా పొడిగిస్తున్నాయి.

జనతా కర్ఫ్యూ లు వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి ?
  • ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది . చేతులు కడుక్కోవడం. కాళ్ళు కడుక్కోవడమనేది మన సంస్కృతి లో ఒక భాగం గా ఉన్నప్పటికీ చాలామంది కి వైరస్ పై ఇప్పుడు అవగాహనా ఇప్పుడే   కలుగుతున్నది.
  • జనసందోహం లో తిరగకూడదనేది మంచి అవగాహన  ఏ వైరస్ కూడా దీని వల్ల వ్యాప్తి చెందదు. 

  • మనిషి కి  మనిషి కి మధ్య కనీసం ఒక (1) మీటర్ (3 అడుగులు ) దూరాన్ని ఉంచడం ఎప్పటికైనా మంచిదే ఈ జనతా కర్ఫ్యూ వల్ల  కొంత వరకు ప్రజలకు ఇది అలవాటు గా మారింది.

  • షేక్ హ్యాండ్లూ కౌగలించు కోవడం ఈ మధ్య ఫాషన్ గా మారింది ఇలాంటి  కర్ఫ్యూ ల వల్ల  సాంఘిక అవగాహనా కలుగుతుంది.

  • మాంసాహారం తినడం తగ్గిస్తే మంచిదే. ఏది తిన్నా తినే  ఆహారాన్ని బాగా ఉడికించి తినాలి అనే అవగాహన వస్తుంది.

  • మాస్కులు ధరించి తిరగడం వల్ల మననించి  వచ్చే తుంపర్లు ఇంకొకరికి సోకకుండా ఉంటాయి. ఇంకొకరినించి వచ్చే తుంపర్లు మనకి సోకవు . 

  • ప్రజలు మసలే చోట కెమికల్ స్ప్రే , బ్లీచింగ్  పవుడర్  జల్లడం విరివిగా తరచూ చేస్తుంటే మంచిదే. ముఖ్యం గా ఇలాంటి సందర్భాలలో తప్పని సరిగా కెమికల్ స్ప్రే చేస్తున్నారు .

  • వైరస్ సద్దు మణిగే వరకు వర్క్ టు హోమ్ మంచిదే .

  • రోజువారీ పనులు చేసుకొనేవారు. కొన్ని రోజులు విశ్రాంతి దొరుకుతుంది.

  • నిరంతరం పనిచేసే హోటళ్లు , షాపులకు కొంత విశ్రాంతి దొరుకుతుంది .వైరస్ వ్యాప్తి కొంత అరికట్ట బడుతుంది .

  • ఒక ప్రదేశంలో "కరోనా వైరస్" జీవితం సుమారు 12 గంటలు మరియు జనతా కర్ఫ్యూ 14 గంటలు. కాబట్టి, కరోనా నివసించే బహిరంగ ప్రదేశాలు లేదా జనం తిరిగే ప్రదేశాలు 14 గంటలు తాకబడవు.

జనతా కర్ఫ్యూ లు వల్ల వచ్చే అనర్ధాలు ఏమిటి ?

  • ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది . చేతులు కడుక్కోవడం. కాళ్ళు కడుక్కోవడమనేది మన సంస్కృతి లో ఒక భాగం గా ఉన్నప్పటికీ  నోటికి ముక్కుకి చేతులు తగల కుండా ఉండాలంటే  అది ఇంచు మించు అసాధ్యం.

  • ముఖ్యం గా ఈ రోజులో ప్రతి ఒక్కరు స్నో లు పౌడర్  మోకానికి రాసుకుంటున్నారు.
  • జనసందోహం లో తిరగకూడదనేది మంచి అవగాహన అయినప్పటికీ మనం సాంఘిక జీవులం జనసందోహం లో తిరగకుండా ఉండడమనేది దాదాపు అసాధ్యం. తాత్కాలికం గా పరవాలేదు గాని దీర్ఘ కాలం లో సమస్యలు వస్తాయి.

  • మనిషి సాంఘిక జీవి మనిషికి మనిషికి మధ్య దూరం (తాత్కాలికం గా పర్వాలేదు) ఉండాలనటం వాళ్ళ విద్వేషాలు వైషమ్యాలు పెరిగే అవకాశం ఎక్కువ.
  • మాంసాహారం తినడం తగ్గిస్తే మంచిదే.  అలవాటు ఉన్నవారు తట్టుకోవడం కష్టం.

  • కొన్ని రకాలైన మాంసాలు  తినడం తగ్గిస్తే  క్రమం గా ఆహార కొరత వచ్చే ప్రమాదం ఉంది.

  • మాస్కులు ధరించి తిరగడం మంచిదే అయినప్పటికీ అవి శానిటైజ్ చేసి ఉండి ప్రతి రోజు మారుస్తుండాలి . 

  • మురికి పట్టిన మాస్కులు ప్రతి రోజు ధరించడం ఇంకా ప్రమాదం. 

  • కెమికల్  స్ప్రేలు ,బ్లీచింగ్ పవడర్లు,  ప్రజలకి చెప్పినట్లుగా ప్రభుత్వాలు అంతగా స్ప్రే చెయ్యట్లేదు . 

  • వైరస్ ఎలా వస్తుంది. ఎలా సోకుతుంది అనేది  ఇప్పటికీ సరిఅయిన అవగాహన లేదు. దీని  వల్ల అనవసమైన భయాలు ప్రజల్లో పెరిగి పోతున్నాయి.

  • వైరస్ నిర్ధారణ కాకుండా కోరంటైన్ 14 రోజులు చేయడం ప్రజాస్వామ్య దేశాలలో సాధ్యం కాదు .

  • వైరస్ సద్దు మనిగె వరకు వర్క్ టు హోమ్ మంచిదే. కానీ అని రకాలైన పనులు వర్క్ తో హోమ్ సాధ్యం కాదు. క్రమేణా ఉద్యోగులు సోమరులు అయ్యే అవకాశం ఉంది.

  • ఈ కర్ఫ్యూ లు ఇలాగె కోన సాగితే రోజు వారి పనులు చేసు కొనేవారు చాల నష్ట పోతారు. ఒక వేళ ప్రభుత్వాలు నష్ట పరిహారం ఇవ్వాలను కున్న ఎంత ఇవ్వాలి ఎవరికీ ఇవ్వాలనేది లెక్కించడం కష్టమే . 

  • హోటలు స్కూల్, వ్యాపారసంస్థలు తరచూ  మూసివేయడం  వల్ల  ఆర్థిక సమస్యలు వస్తాయి .దీర్ఘకాలం కోన సాగితే ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుంది. 

  • ఒక ప్రదేశంలో "కరోనా వైరస్" జీవితం సుమారు 12 గంటలు మరియు జనతా కర్ఫ్యూ 14 గంటలు. కాబట్టి, కరోనా నివసించే బహిరంగ ప్రదేశాలు లేదా జనం తిరిగే ప్రదేశాలు 14 గంటలు తాకబడవు అని అంటున్నారు కానీ ఇంటి లోని ఇంటి ఆవరణలోని గోడల వద్ద ఈ వైరస్ ఉండదని చెప్పలేము.

  • పైగా ఇంటిలోనే ఉంటె సూర్యరశ్మి కొంతకాలం దూరం గా మనిషి ఉండవలసి ఉంటుంది 

  • ఏది ఏమైనప్పటికి ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఇంతగా ప్రతిస్పందించడం మంచి పరిమాణమే. 

  • మన దేశము లో ఈ వైరస్కు అంతగా ఎవరు గురికాలేదు. 

  • గురికాకూడదనే ఆశిద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ గైడ్ లైన్ పాటించడం మంచిదే అని అన్ని దేశాలు నమ్ముతున్నాయి. 

  • ఈ కర్ఫ్యూల వల్ల మనకు  ఒన గూరేదెంత అని  ప్రభుత్వాలు ప్రజలు ఎవరికీ వారు తర్కించు కోవాలి తప్ప మనం (సామాన్య ప్రజలు ) చేయగలిగేది ఏమి లేదు. 

  • త్వరలోనే ఈ వైరస్ కు మందు దొరికి ఈ వివాదాలకు తెర పడుతుందని ఆశిద్దాం 

ఈ క్రింది యూట్యూబ్ వీడియో యు.ఆర్.యల్.లుచూడండి

కరోనా వైరస్ పై స్పెషల్ రిపోర్ట్ | Coronavirus in India

కరోనా వైరస్ నుంచి భారత్ తప్పించుకుందా? - 10tv

Advantages and Disadvantages of Going Public Using an IPO ...

The Coronavirus Outbreak Is Now A Crisis, How Might That ...

Can China's Economy Withstand the Coronavirus? by Michael ...

SARS wiped $40 billion off-world markets; what will ...


Corona virus precautions కరోనా వైరస్ అంటే ఏమిటి దీని నుండి ఎలా మనం తప్పించు కోవాలి


COVID-19 CHECK LIST కోవిడ్ -19 చెక్ లిస్ట్ చూడండి 

Adapted from DOH Guidelines www.doh.gov.ph

Note :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి.   

నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.




















19, మార్చి 2020, గురువారం

కరోనావైరస్‌ అంటే ఏమిటి దాని లక్షణాలు ఏమిటి దీని నుండి మనం ఎలా తప్పించుకోవాలి

wowitstelugu.blogspot.com

కరోనావైరస్‌ అంటే ఏమిటి  దాని లక్షణాలు ఏమిటి  దీని  నుండి మనం ఎలా తప్పించు కోవాలి 

కరోనా వైరస్ 

కరోనా అంటే కిరీటం అని అర్థం. సూర్యుడు చుట్టూ వుండే దట్టమైన కాంతి ని కూడా ఆంగ్లం లో  క రోనా  అంటారు.ఈ  సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. కరోనా క్రౌన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చినది.

మొత్తం ఏడు (7) కరోనావైరస్లు ఉన్నాయి, వాటిలో 

  • ‘మెర్స్ సీఓవీ’ అంటే ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అనేది ఒక రకమైన వైరస్.

  • రెండోది ‘సార్స్ సీఓవీ’ అంటే ‘సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’

  • ఈ రెండురకాల కరోనావైరస్‌ల వల్ల సాధారణ జలుబు, జ్వరం వస్తుంది. ఈ సాధారణ కరోనావైరస్‌లు జంతువుల నుండి జంతువులకు. జంతువుల నుండి మనుషులకు వస్తుంది. 

  • ముఖ్యమైన కరోనావైరస్లలో సార్స్ SARS మరియు మెర్స్ MERS ఉన్నాయి

  • ‘సార్స్ సీఓవీ’ వైరస్ పిల్లుల నుండి మనుషులకు సోకుతుందని. ‘మెర్స్-సీఓవీ’ ఒంటెల నుండి మనుషులకు సోకుతుందని తేలింది.

  • ఇవి కాకుండా అనేక రకాలైన కరోనావైరస్‌లు జంతువుల నుండి జంతువులకే సోకుతున్నాయని వెల్లడైంది., 

  • ఇవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఎంత తేలికగా వ్యాపిస్తుందో అనే విషయం మీద స్పష్టమైన ఆధారాలు లేవు .
కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందింది 

  • కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే  ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.

  • పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

  • చైనాలో తిరిగి కొత్తగా పుట్టుకొచ్చిన ఈ వైరస్ ను  కరోనా  వైరస్‌  గా గుర్తించారు 

  • ఈ వైరస్‌ వుహాన్‌ లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో కొత్త  ఈ వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు.

  • వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు

  • లండన్ప పరిశోధనల్లో దీనిని  "కరోనావైరస్‌" గా గుర్తించారు. 

  • ఈ వ్యాధికి ఇంత వరకు ఎటువంటి టీకాలు కనుగొన బడలేదు 

కోవిడ్-19 (Covid-19) అంటే  ఏమిటి? 

  • వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు 'నావెల్ కరోనా వైరస్ లేదా nCoV'అని పేరు పెట్టారు

  • ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకూ మనుషుల్లో గుర్తించలేదు

  • కరోనావైరస్ అనే పేరుగల వైరస్ కలిగించే జబ్బు పేరు కోవిడ్-19( Covid  19).  Coronavirus లోని  Co vi లకు డిసీస్ (disease) లోని d ని చేర్చి Covid అనే పేరు పెట్టారు.

 కోవిడ్-19 (Covid-19) లక్షణాలు ఏమిటి? 

  • కరోనావైరస్ సోకిన తరువాత కోవిడ్-19 జబ్బు లక్షణాలు బయటపడేందుకు ఒక(1) రోజు నుండి (14) పద్నాలుగు  రోజుల వరకు పట్టవచ్చని, సాధారణంగా ఇది ఐదు (5)  రోజుల్లో బయట పడుతుందనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

  • ఇప్పుడు చైనా లో  కొత్తగా వచ్చిన కరోనా వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

  • ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు , జ్వరందగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది

  • చలికాలంలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

    • మామూలుగా వచ్చే influenza (flu) కన్నా COVID-19 కనీసం పదింతలు ఎక్కువ ప్రాణాంతకమైనది. 

    • COVID-19 నుండి 80% మంది తేలికపాటి లక్షణాలతొ (దగ్గు, జ్వరం)తో కోలుకుంటారు. 

    • 10-20 శాతం మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. 

    • 2-3 % మంది ఈ వ్యాధితో చనిపోతారు. 

     కోవిడ్-19 (Covid-19) తీసుకోవలసిన జాగ్రర్తలు 

    • నావల్ కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇతరులతో మాట్లాడుతుండగా వారి నోటి నుండి వచ్చే తుంపర్లు ఇతరులపై పడితే ఇతరులకు సోకవచ్చు. 

    • తుమ్మితే వారి ముక్కు నుండి బయటకు వచ్చే క్రిములు ఇతరులపై పడితే సోకవచ్చు. 

    • ఈ వైరస్ సోకిన వ్యక్తి ఇతరులు ఆలింగనం చేసుకున్నా, కరచాలనం చేసినా ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. 

    • అలాగే వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించే వస్తువులను ఇతరులు వాడినా ఇతరులకు సోకవచ్చు. 

    • లిఫ్ట్‌లలో, మెట్లు ఎక్కేటప్పుడు పట్టుకునే రాడ్లపై కరోనా వైరస్ చేరితే అది 12 గంటల వరకు ఉంటుంది. 

    • 12 గంటలలోగా ఎవరైనా ఈ ప్రాంతంలో చేతులుపెట్టినా, శరీరంలోని ఇతర భాగాలు పెట్టినా వారికి సోకవచ్చు. 

    • కరోనా సోకిన వ్యక్తి అందరికీ దూరంగా ఉండటం మంచిది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతిరుమాలు, లేదా నాప్కిన్ అడ్డుగా పెట్టుకోవాలి.

    • తరచూ చేతులు రెండు కనీసం 20 సెకండ్స్ కు తక్కువ కాకుండా శుభ్రం చేసుకోవాలి .

    • చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

    • విదేశాలకు వెళ్లినప్పుడు బాగా ఉడికించిన మాంసాహారం మాత్రమే తీసుకోవాలి.

    • పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది.

    • కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది. 

    • అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.

    • మరీ ముఖ్యంగా దగ్గడం, తుమ్మడం, జ్వరం ఉన్న వ్యక్తులకు మధ్య కనీసం (1 ఒక)  మీటరు  లేదా (3 అడుగులు) దూరం ఉండేలా చూసుకోవాలి.

    • అనుమానితుల కు కనీసం 1 మీటరు (3 అడుగులు ) దూరం లో ఉండి మాట్లాడాలి.

    • మార్కెట్లు  సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాల్ మీటింగ్స్ ల కు కొంతకాలము (అనేక ఈ వైరస్ పూర్తిగా సద్దుమనిగింది తెలిసేంతవరకు ) దూరం గా ఉండాలి . 

     కోవిడ్-19 (Covid-19) ఉన్న అపోహలు :

    • చేతులు కడుక్కున్న తరువాత వేడి గాలి వచ్చే పరికరం కింద చెయ్యి పెడితే వైరస్ చచ్చిపోతుందనుకోవడం కూడా ఒక అపోహ. 

    • ముఖానికి మాస్క్ ధరించి ఎక్కడికి వెళ్లినా కరోనా రాదనుకోవడం అపోహ మాత్రమే. డాక్టర్లు వాడే అత్యంత కాస్ట్‌లీ మాస్కుల వల్ల మాత్రమే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి 

    • మాస్క్ అనేది నేరుగా కరోనా సోకిన వ్యక్తి నుంచి విడుదల అయ్యే తుంపర్లు మనలోకి ప్రవేశించకుండా మాత్రమే ఆపగలవు.

    • ఒక మాస్కు ను మళ్ళీ  మళ్లీ వాటినే వాడుతున్నారు. అది మరింత ప్రమాదం.

    • ఎండ పెరిగితే కరోనా రాదా? - అలా రుజువు కాలేదు. ఇదివరకు వచ్చిన స్వైన్ ఫ్లూ సహా చాలా వైరస్‌లు ఎండా కాలంలో కూడా ప్రభావం చూపాయి

    • ఒంటిపై మద్యం, క్లోరిన్ చల్లుకుంటే వైరస్ చనిపోతుందా?  అప్పటికే ఒంట్లోకి ప్రవేశించిన వైరస్ బయటి నుంచి మద్యం, క్లోరిన్ చల్లుకున్నంత మాత్రాన చనిపోదు. పైగా అవి చర్మానికి, కళ్లకు హాని చేస్తాయి

    • యాంటీబయోటిక్స్ తో కరోనాను ఆపగలమా అంటే  యాంటీబయోటిక్స్ & బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నయం చేయటానికే తోడ్పడతాయి. వైరస్ ల మీద పనిచేయవు.

    • నువ్వుల నూనె కాపాడుతుందా? - నువ్వుల నూనె ఒంటికి రాసుకుంటే కరోనా వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించదని అనుకోవటం అపోహ. 

    • బ్లీచ్/క్లోరిన్; ఆధారిత క్రిమినాశకాలు, ఈథర్ ద్రావణాలు, 75% ఇథనాల్, పెరాసెటిక్ యాసిడ్& క్లోరోఫాం వంటివి ఆయా వస్తువులు, ఉపరితలాల మీద అంటుకున్న వైరస్ లను చంపగలవు. 

    • గోమూత్రం తాగడం వలన వైరస్ రాకపోవడం అనేది అపోహ వెల్లుల్లి తింటే కరోనా రాదా?  ఇది కూడా అపోహ మాత్రమే.

    • వెల్లుల్లికి సూక్ష్మక్రిములను చంపే శక్తి ఉంది. అంతమాత్రాన వెల్లుల్లిని తింటే కరోనా వైరస్‌ రాదని  చెప్పలేము. 

    • వెల్లుల్లి కరోనాను పోగొడుతుందని రుజువు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పింది.
    ప్రభావిత దేశాలు ఏవి  ప్రపంచ దేశాలు 
    తీసుకునే జాగర్తలు ఏమిటి 

    2020 మార్చి 5 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 95,000 కంటే ఎక్కువ కేసులు నిర్ధారణ  అయ్యాయి. వాటిలో 7,100 తీవ్రమైనవి. 85 దేశాలు ప్రభావితమయ్యాయి, మధ్య చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్లలో పెద్దయెత్తున వ్యాపించింది. 3,200 మందికి పైగా మరణించారు: మరణించిన వారిలో చైనాలో దాదాపు 3,000, ఇతర దేశాలలో 275 మంది ఉన్నారు. 51,000 మందికి పైగా కోలుకున్నారు.
    • చైనా తీసుకున్న చర్యల్లో హుబీ లాక్డౌన్, వివిధ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడం వంటివి ఉన్నాయి; జపనీస్ జలాల్లో బ్రిటిష్ క్రూయిజ్ షిప్ డైమండ్ ప్రిన్సెస్ ను దిగ్బంధించారు; 

    • ఇటలీలో లాకౌట్ విధించారు. కొన్ని విమానాశ్రయాలు, రైలు స్టేషన్లు ఉష్ణోగ్రత తనిఖీలు, ఆరోగ్య ప్రకటన బోర్డులు, డెమోన్స్ట్రేషన్స్  వంటి స్క్రీనింగ్ పద్ధతులను ఏర్పాటు చేశాయి. 

    • చైనా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాలకు ప్రయాణాలు చేయవద్దని అనేక దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. చైనా, ఇరాన్, జపాన్, ఇటలీలోని అన్ని పాఠశాలలను మూసివేసారు .

    • ఇండియా లో మర్చి నెలాఖరు వరకు ప్రభుత్వ పాఠశాలలకు కొన్ని కార్యాలయాల కు సెలవులు పరకటించారు. జనసందోహాలు ఉండే చోట ప్రజలు మసల వద్దని ప్రకటనలు చేస్తున్నారు.

    పూర్తి వివరాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ లో  చూడండి 


    కరోనా పైన యూట్యూబ్ వీడియో లు చూడండి 



    వీడియో  లింక్లు చూడండి 

    Coronavirus disease 2019 - World Health Organization
    https://www.who.int › Emergencies › Diseases 

    When and how to use masks - World Health Organization


     - ఈ పేజీని అనువదించు

    ట్విట్టర్ లో పోస్ట్లు చూడండి 

    TWEETS ON TWITTER

    ఈ జనతా కర్ఫ్యూ  వల్ల వచ్చే ఫలితం ఏమిటి అని ఎవరికైనా సందేహం కలగ వచ్చు. ఇది ఎందుకంటే ?

    ఒక ప్రదేశంలో "కరోనా వైరస్" జీవితం సుమారు 12 గంటలు మరియు జనతా కర్ఫ్యూ 14 గంటలు. కాబట్టి, కరోనా నివసించే బహిరంగ ప్రదేశాలు లేదా జనం తిరిగే ప్రదేశాలు 14 గంటలు తాకబడవు.

    ఇది కరోనా వైరస్ వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేస్తుంది.14 గంటల తర్వాత మనకు లభించేది సురక్షితమైన  మన దేశం. కాబట్టి, అది వెనుక ఉన్న ఆలోచన. సమీప భవిష్యత్తులో ఎక్కువ సమయం అవసరమైతే ఇది ఒక డెమో  ప్రాక్టీస్ గా మనం అలవర్చుకోవాలి.  ఈ క్రింది లింక్ చూడండి ..

    MoHFW
    గమనిక :

    నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

    నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

    అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి. 
    నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

    నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

    కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.