Kannada and Bollywood films villain Rajanala Kaleswara Rao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kannada and Bollywood films villain Rajanala Kaleswara Rao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, మార్చి 2019, గురువారం

Telugu film, Telugu stage, Tamil, Kannada and Bollywood films villain Rajanala Kaleswara Rao

wowitstelugu.blogspot.com

రాజనాల కాళేశ్వర రావు నాయుడు ప్రముఖంగా రాజనాల గా పిలుస్తారు, తెలుగు సినిమా, తెలుగు రంగస్థలం  తమిళ, కన్నడ మరియు బాలీవుడ్ చిత్రాలలో ఎక్కువగా నటించిన భారతీయ నటుడు రాజనాల. ఇతర పేర్లు కాళయ్య, విలన్లకి రాజు.  రాజనాల... తెలుగు విలన్లకే రారాజు..!


జననం 1925 జనవరి 3
మరణం 1998 మే 21 (వయసు 73)
భార్య  పేరు ఆర్బిదేవి.

ప్రతి నాయకుడు (విలన్ ) అన్న పదానికి మారుపేరుగా రాజనాల చాలా కాలం తెలుగు చలన చిత్ర ప్రేక్షకుల స్మృతుల్లో నిలిచిపోయాడు. పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. పౌరాణిక చిత్రాలలోనూ, జానపద చిత్రాలలోనూ, సాంఘిక చిత్రాలలోనూ కూడా ప్రతినాయక పాత్రలలో రాణించాడుకంసుడు, జరాసంధుడు, మాయల ఫకీరు, భూకామందు, దొంగల నాయకుడు,

ఇలా ఎన్నో పాత్రలలో ప్రతినాయకుడిగా నటించాడు

జీవితము చివరి రోజులలో మధుమేహం వ్యాధితో బాధపడుతూ మరణించాడు.

రాజనాల  జనవరి 3, 1925 న నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో జన్మించారు. 1944-51 మధ్య కాలం లో నెల్లూరులో రెవిన్యూ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నప్పుడు అతను థియేటర్లో కి ప్రవేశించాడు. లక్నో యూనివర్సిటీ నుండి తత్వశాస్త్రం లో  పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు  ఆంగ్ల సాహిత్యం రీడర్ గా పనిచేసారు ..

  • 1966లో మాయా ది మెగ్నిషిమెంట్అనే హాలివుడ్ సినిమాలో నటించి, హాలివుడ్లో నటించిన తొలి తెలుగు నటునిగా రికార్డు సృష్టించారు రాజనాల.
  • తెలుగు సినీ చరిత్రలో విలనిజం అంటే ఇదిరా...అని తెగేసి చెప్పిన మేటి ప్రతినాయకుడు రాజనాల. రుషమైన డైలాగ్స్ దగ్గర నుండీ ఆహార్యం, మేనరిజం, స్టైల్ అన్నింటిలోనూ వైవిధ్యాన్ని కనబరిచిన గొప్ప విలన్ ఆయన.

  • పాతతరం నటుల్లో ఎంతమంది విలన్లు ఉన్నా టక్కున గుర్తుకొచ్చే పేరు రాజనాల అనడంలో మాత్రం అతిశయోక్తి లేదు
  • 1928 జనవరి 3 తేదిన నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు. అయితే 'రాజనాల' పేరుతోనే ఆయన స్క్రీన్ నేమ్ బాగా ప్రాచుర్యం పొందింది.

  • నాటకాలంటే పడిచచ్చే రాజనాల యువకుడిగా ఉన్నప్పుడే తన మిత్రుడితో కలసి నెల్లూరులో అడపా దడపా నాటకాలు వేసేవారు. అలా సందర్భంలో తాను వేసిన 'ఎవరు దొంగ' అనే నాటకంలో అవినీతిని పెంచి పోషించే ప్రభుత్వ ఉద్యోగులను విమర్శించడం జరిగింది
  • అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రాజనాల నాటకాన్ని చూసిన పై అధికారులు.ప్రభుత్వ ఉద్యోగై కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాటకం వేశాడన్న నెపంతో సస్పెండ్ చేశారట.

  • అయితే రాజనాల మళ్లీ తాను కోల్పోయిన ఉద్యోగాన్ని వెతుక్కుంటూ వెళ్లలేదు. సినీ నటుడు అవ్వాలని మద్రాసు పట్టణం వచ్చారు
  • హెచ్ ఎం రెడ్డి నిర్మాతగా వచ్చిన 'ప్రతిజ్ఞ' సినిమాలో  పాత్రా దొరక్కపోవడంతో ఆఖరికి విలన్గా చేశారు. అయితే అదే సినిమా సూపర్ హిట్టై తనకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని ఆయన ఊహించలేదు. ఆయన తొలి సంపాదన 200 రూపాయలు.

  • తొలుత సాంఘిక చిత్రాల్లో నటించినా.. తర్వాత పౌరాణిక పాత్రలు కూడా లెక్కలేనన్ని రాజనాలను వరించాయి. కంసుడిగా, జరాసంధుడి గా కూడా ఆయన ఆయా పాత్రల్లో జనాలను మెప్పించారు.
  • శ్రీకృష్ణ పాండవీయంలో శిశుపాలుడిగా, అల్లూరి సీతారామరాజు చిత్రంలో బ్రిటీష్ మేజర్ గుడాల్గా లాగా కూడా రాజనాల చాలా సహజంగా నటించారు.

  • 1966లో మాయా ది మెగ్నిషిమెంట్ అనే హాలివుడ్ సినిమాలో నటించి, హాలివుడ్లో నటించిన తొలి తెలుగు నటునిగా రికార్డు సృష్టించారు రాజనాల.
  • రాజనాలకు సైగల్ పాటలంటే ఎంతో ఇష్టం. ఆయన పాటలు పడుతూ ఎప్పుడూ తన తోటివారిని అలరించేవారు.

  • ఇండస్ట్రీలో ఎంతోకొంత సంపాదించినా బాగా వయసైపోయాక, మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చిన రాజనాల చాలా ఇబ్బందులు పడ్డారు. తాగుడు వ్యసనంతో చాలా ఆస్తులు పోగొట్టుకున్నారు.
  • 1979 లో ఆయన భార్య మరణించాక చాలా రోజులు బయట ప్రపంచానికి కనబడలేదు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా తారుమారవడంతో భీమాంజనేయఅనే సినిమాను స్వయంగా నిర్మించాలన్న ఆయన కోరిక కూడా తీరలేదు.

  • తర్వాత రెండవ పెళ్లి చేసుకున్న రాజనాల, హైదరాబాద్లోని అమీర్పేటలో ఉండేవారు. ఆయన కుమారుల్లో ఒకరు మరణించగా.. మరొకరు ఇల్లు విడిచి వెళ్లిపోయారు. 1995లో తెలుగు వీర లేవరసినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో జరిగిన ప్రమాదం వల్ల రాజనాల కాలు కూడా పోయింది. తర్వాత అవకాశాలు కూడా తగ్గాయి.

  • రాజనాల తన చివరి రోజుల్లో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. జ్యోతిష్యం చెప్పుకుంటూ కూడా కొన్నాళ్లు ఆయన జీవించారు
  • ఆంధ్ర ప్రదేశ్ బహుకరించే నంది అవార్డు గ్రహీత గా కూడా ఘనత వహించారు.
  • ఆఖరికి 1998 మే 21 తేదిన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రాజనాల అక్కడే తుదిశ్వాస విడిచారు.

ఆయన నటించిన ప్రసిద్ధ సినిమాలు:

  • రాముడొచ్చాడు (1996), 
  • నెంబర్ వన్ (1994)
  • హలో బ్రదర్ (1994), 
  • భలే తమ్ముడు (1985),
  • బొబ్బిలి పులి (1982),
  • పటాలం పాండు (1981),
  • నకిలీ మనిషి (1980)
  • దాన వీర సూరకర్ణ,(1977)
  • గంధర్వ కన్య (1979)
  • ఉత్తమురాలు (1976)
  • అందరూ బాగుండాలి (1975)
  • అల్లూరి సీతారామరాజు (1974)
  • మేజర్ గుడాల్, 
  • సింహాచల క్షేత్ర మహిమ (1965), 
  • గండర గండడు (1969)
  • సప్తస్వరాలు (1969), 
  • భలే తమ్ముడు (1969), 
  • రైతు బిడ్డ ,
  • బాగ్దాద్ గజదొంగ (1968), 
  • వరకట్నం (1968),
  • గూఢచారి 116 (1967)
  • శ్రీకృష్ణావతారం (1967)
  • శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967), 
  • శ్రీ కృష్ణ వ్రతం (1967), 
  • అవేకళ్ళు, 
  • అపూర్వ పిరివైగళ్ (1967), (తమిళ్ )
  • ఫార్జ్ (1967)(హిందీ )
  • పల్నాటి యుద్ధం (1966)
  • శ్రీకృష్ణ పాండవీయం (1966)
  • దేవత (1965)
  • సత్య హరిశ్చంద్ర (1965)
  • బొబ్బిలి యుద్ధం (1964)
  • రాముడు భీముడు (1964)
  • నర్తనశాల (1963)
  • పరువు ప్రతిష్ఠ (1963)
  • గుండమ్మ కథ (1962)
  • దక్షయజ్ఞం (1962)
  • సిరిసంపదలు (1962)
  • జగదేకవీరుని కథ (1961)
  • ఉషాపరిణయం (1961) - శివుడు
  •  సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
  • శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
  • రాజమకుటం (1959)
  • సువర్ణసుందరి (1957)
  • కుటుంబ గౌరవం (1957)
  • వినాయక చవితి (1957)
  • తెనాలి రామకృష్ణ (1956)
  • జయసింహ (1955),
  • గులేబకావలి కధ (1962),  
  • చిట్టి  తమ్ముడు (1962), 
  • దక్షయజ్ఞం (1962), 
  • గుండమ్మ కథ (1962), 
  • పరువు ప్రతిష్ట (1963), 
  • రాముడు భీముడు (1964), 
  • దేవత (1964), 
  • సి.ఐ.డి (1965),
  • ప్రతిజ్ఞ(1953)
  • పిడుగురాముడు
  • అగ్గిపిడుగు

రాజనాల గారి యూట్యూబ్ వీడియో U.R.L. 

RAJANALA Life Story | రాజనాల జీవితం కన్నీటి ... YouTube


Note: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. 
మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe   చేయండి.  కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.