Mythologies లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mythologies లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఫిబ్రవరి 2020, ఆదివారం

కాశీలోని చాలా మంది కి తెలియని కొన్ని వింతలు..విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం

wowitstelugu.blogspot.com

కాశీలోని చాలా  మంది కి తెలియని కొన్ని వింతలు విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం 


  • కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు కంపుకొట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

  • కాశీలో పూర్వం  అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

  • కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.

  • కాశీలో అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్యపోయ్యారు.

  • కాశీలో అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు.

  • కాశీలో కాస్మోర్స్ వస్తుంటాయి అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి ఎవరికీ తెలీదు.

  • కాశీలో అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

  • కాశీలో కాశీి విశ్వేశ్వరునికి శవభస్మలేపనంతో పూజ ప్రారంభిస్తారు.

  • కాశీలో ని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

  • కాశీలో కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

  • కాశీలో విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

  • కాశీలో  శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

  • కాశీలో ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం ఇక్కడే  వున్నది.

  • కాశీలో ని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

  • కాశీలో పూర్వం  దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

  • కాశీలో మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

  • కాశీలో విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

  • కాశీలో నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

  • కాశీలో శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

  • కాశీలో ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు

  • కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. 

కాశీ అందులో కొన్ని ఘాట్ లు వాటి విశిష్టత తెలుసుకుంటే చాల  ఆశ్చర్యం కలుగుతుంది

1) దశాశ్వమేధ ఘాట్:

బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:

చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:

సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:

ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:

ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్:

ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:

గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:

తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.

11) హనుమాన్ ఘాట్:

ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నదిఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్:

పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:

సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్:

ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:

నారదుడు లింగం స్థాపించాడు.

16) చౌతస్సి ఘాట్:

ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్ ఘాట్:

ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18) అహిల్యా బాయి ఘాట్

ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీవిశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

ఈ క్రింది వీడియో లు చూసి కాశీ గొప్పదనం గురించి మరింత తెలుసుకోండి.



Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share
and subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.








2, ఏప్రిల్ 2019, మంగళవారం

Make Chant and Take a look at Sri Suktham Make your birth useful and selflessness

wowitstelugu.blogspot.com

శ్రీ సూక్తంకు తాత్పర్యం తెలుసుకొండి. జన్మను స్వార్ధకం చేసుకోండి.

  • ఓ అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను నాశనము చేసే, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడిన, చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా, సువర్ణమయమైన యున్న మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.
  • ఎవరి కరుణ, కటాక్షములతో నాకు బంగారము, ఆవులు, గుర్రాలు, బంధువులు సంప్రాప్తమైనవో ఆ మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహనము చేయుము. ఆమె నా వద్ద నుండి వీడిపోకుండా చూడుము.

  • గుర్రాలతో ఉన్న రథం మధ్యలో ఆసీనమైనది, తన రాకను ఏనుగు ఘీంకార నాదంతో సూచిస్తున్న ఆ శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాను. తల్లీ నీవు నా వద్ద సంతోషముగా నెలకొని ఉండుము.
  • చక్కని చిరునవ్వుతో, బంగారు కోటలో నివసించే, కరుణ, తేజస్సు, ఆనంద రూపిణియై, ఆనందము ప్రసాదించునది, పద్మములో ఆసీనురాలై, పద్మము వంటి ఛాయకలది అయిన ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రార్థిస్తున్నాను.

  • చంద్రుని పోలినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశించుచున్నది, దేవతలచే పూజిన్చబడుచున్నది, కరుణా స్వరూపిణి, పద్మమును ధరించినది, 'ఈం' అనే బీజమంత్రానికి భావంగా ఉన్నది అయిన మహాలక్ష్మిని నేను శరణు వేడుతున్నాను.
  • ఓ దేవీ! నిన్ను ప్రార్థిస్తున్నాను, నా దారిద్ర్యం పోయేలా కరుణించు. సూర్యుని తేజస్సు కలిగిన ఓ తల్లి! వనానికి అధిపతియైన బిల్వవృక్షం (మారేడు చెట్టు) నీ తపోమహిమచే ఉద్భవించినది.

  • నీ తపస్సు వలన కలిగిన దాని ఫలాలు అజ్ఞానము మనే లోని ఆటంకాన్ని, అమంగళకరమైన బయటి ఆటంకాన్ని తొలగిస్తాయి గాక! కుబేరుడు, కీర్తి ఐశ్వర్యాలతో నన్ను వెన్నంటి రావాలి.
  • నీ అనుగ్రహం పూర్తిగా నిండిన ఈ దేశంలో నేను జన్మించాను. సకల సంపదలను నాకు ప్రసాదించు! ఆకలి దప్పికలతో కృశించినది, శ్రీదేవి కంటే ముందుగా జన్మించిన జ్యేష్టాదేవిని (అలక్ష్మి) నేను నాశనం చేస్తాను.

  • నా గృహము నుండి అభాగ్యము, కొరతలను పూర్తిగా నిర్మూలించి నన్ను అనుగ్రహించు. సుగంధానికి నిలయమైనది, జయింప అలవికానిది, ఎల్లప్పుడూ పుష్టినిచ్చేది, సకల సంపదలు కలిగిన, సమస్త జీవులకు అధినాయిక యైన మహాలక్ష్మిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాను.
  • ఓ శ్రీదేవి! మనస్సులో జనించే ఉత్తమమైన కోరికలూ, సంతోషము, వాక్కులో సత్యము, గోసంపద చే, ఆహార సమృద్ధిచే కలిగే ఆనందాన్ని నేను చవి చూడాలి. నాకు కీర్తి కలుగచేయుము.

  • కర్దమ మహర్షి! నీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కారించాలి. తామరపువ్వుల మాల ధరించిన, సిరిసంపదలకు అధిదేవత, తల్లి అయిన ఆమెను నా కులములో ఎల్లప్పుడూ నివసింప చేయాలి.
  • మహాలక్ష్మి పుత్రుడవైన ఓ చిక్లీత! నీరు, చక్కని ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయుగాక! నా ఇంట నీవు నివసించాలి. దేవీ, నీ మాత అయిన ఆ మహాలక్ష్మి నా కులములో నిరంతరమూ నివసించేలా అనుగ్రహించు.

  • ఓ అగ్నిదేవ! కరుణ కలిగిన మనసు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారము ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు కలది, తామరపువ్వుల మాల ధరించినది, చంద్రునివలె ఆహ్లాదకరమైనది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.
  • అగ్నిదేవా! దయకలిగినది, గంభీరముగా యుండెడిది, దండము చేత బూనినది, అందమైన శరీరచాయ కలిగినది, సూర్యునివలె ప్రకాశించునది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.

  • అగ్నిదేవా! ఎవరి వలన నేను అంతులేని బంగారుము, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించుకుంటానో , అట్టి మహాలక్ష్మిని నన్ను వదలి వెళ్లిపోకుండా కృప చూపుము.
  • ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రార్తిస్తున్నారో, వారు ఇంద్రియాలు నిగ్రహించి, ప్రతిరోజూ ఆజ్యముతో హోమము చేయాలి. పైన తెలిపిన పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి.

  • సుప్రసిద్ధులు, ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు ఈ సూక్తంలోని ఋషులు, మహాలక్ష్మియే దేవత. పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలదానా! పద్మము నుండి ఉద్భవించిన తల్లి!, నేను దేని వలన సుఖాన్ని పొందుతానో దాన్ని ప్రసాదించు.
  • గుర్రాలను, గోవులను, సంపదలను ఇచ్చే, ధనానికి అధిదేవతయైన మహాలక్ష్మి! కోరికలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించు.

  • పుత్రులు, గోవులు, ధనధాన్యాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలైన సకల సంపదలు ప్రసాదించు. జనులకు నువ్వు తల్లిగా భాసిస్తున్నావు. నన్ను ఆయుష్మంతునిగా చేయుము. అగ్ని, వాయువు, సూర్యుడు,
  • అష్టవసువులు, దేవేంద్రుడు, బృహస్పతి, వరుణుడు - తమ తమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు. చంద్రునివలె చల్లగా, దేవతల శక్తిగా, సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తున్నది,

  • శ్రీదేవి, ఈశ్వరి, చంద్రుడు, సూర్యుడు, అగ్ని - మువ్వురినీ తన మహత్తుగా కలదీ అయిన శ్రీమహాలక్ష్మిని కొలుస్తున్నాను.
  • ఓ గరుత్మంతుడా! సోమరసం కోసం వచ్చిన వృత్రాసురుని సంహరించిన ఇంద్రుడు సోమరసం గ్రోలనీ. సోమయాగం నిర్వర్తించాలని సంకల్పించిన నాకు పుష్కలముగా ధనాన్ని ప్రసాదించనీ! పుణ్యము చేసిన భక్తులకు కోపము రాదు, మాత్సర్యము ఉండదు, లోభము నశిస్తుంది, దుర్బుద్ధి పుట్టదు.

  • భక్తిని పొంద కోరేవారు శ్రీ సూక్తాన్ని సదా జపము చెయ్యాలి. నీ కృపతో మేఘాలు ఎల్లప్పుడూ వర్షించనీ! విత్తనాలు చక్కగా మొలకెత్తి బాగా పెరగనీ! భగవంతుని నిందించేవారు నిష్క్రమించు గాక!
  • పద్మము అంటే ఇష్టపడేదానా! పద్మములు చేతిలో ధరించిన జగన్మాతా! పద్మములో జన్మించి, నివసించే తల్లీ! తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలిగి, విష్ణువు మనస్సుకు అనుకూలమైన మాతా! నీ పాదపద్మములతో నన్ను అనుగ్రహించు.

  • పద్మము మీద ఆసీనురాలై ఉన్నదేవరో, విస్తారమైన పిరుదులు కలిగిన, తామర రేకులవంటి నేత్రములు కలవారెవరో, లోతైన నాభి కలిగి, స్తన భారముతో వంగి ఉన్న వారెవరో, స్వచ్చమైన వస్త్రాలు, ఉత్తరీయము ధరించిన దెవరో, రత్నాలు పొదిగిన కలశాల జలంతో దేవలోకములోని అత్యుత్తమైన గజములతో అభిషేకించ బడుతున్న దెవరో, పద్మాన్ని చేత ధరించిన దెవరో, సర్వ మంగళ స్వరూపిణియైన దెవరో అట్టి మహాలక్ష్మి నా గృహములో సదా సర్వవేళలా నివసించుగాక!
  • భాగ్యానికి నిలయమైనది, పాలకడలి నుండి ఉద్భవించినది, శ్రీరంగములో వెలసిన దేవీ, దేవ లోక స్త్రీల నందరిని దాసీజనంగా చేసుకొన్నది, లోకాని దీపంగా భాసిస్తున్నది, ఎవరి మృదుల కటాక్షంతో ఇంద్రుడు, శివుడు వైభవము పొందుతున్నారో, మూడు లోకాలను తన కుటుంబముగా చేసుకున్నది, తామర కొలనులో ఉద్భవించినది, మహావిష్ణువుకు ప్రియమైనది అయిన నీకు నమస్కరిస్తున్నాను.

  • సిద్ధులను ఇచ్చే, ముక్తిని అనుగ్రహించే, విజయాన్ని సిద్ధింప చేసే లక్ష్మీ రూపాలలో, సరస్వతిగాను, సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలిచ్చే వరలక్ష్మిగా నువ్వు సదా నాకు ప్రసన్నురాలవుగా ఉండుగాక!
  • వర, అభయ ముద్రలు చేత దాల్చిన, పాశము, అంకుశములు చేత ధరించిన, పద్మములో నివసిస్తున్న, కోటి బాల సూర్యుల ప్రకాశము కలదీ, మూడు నేత్రములు కలదీ, ఆదిశక్తి, జగదీశ్వరి అయిన ఆమెను నేను స్తుతిస్తాను.

  • శుభములలో శుభానివి, సకల శుభాలను సాధించి, ప్రసాదించే దానవు, శరణు పొందటానికి యుక్తమైన దానవు, మూడు కన్నులు కాలిగిన ఓ దేవీ, నారాయణీ! నా నమస్కారము.
  • పద్మ వాసిని, పద్మమును చేత ధరించినది, పవిత్రమైన తెల్లని వస్త్రములు, సుగంధభరితమైన మాలను ధరించి శోభిస్తున్న, భగవతి, హరిపత్ని, కామ్యదాయిని, ముల్లోకాలను పోషించి కాపాడే నువ్వు నన్ను అనుగ్రహించు.

  • విష్ణుపతిని, భూదేవి, తులసి గా అలరారుతున్నది, మాధవుని ప్రియురాలు, ప్రియసఖి, విష్ణువుతో కూడిన దేవీ! నేను నమస్కరిస్తున్నాను.
  • మహాలక్ష్మిని తెలుసుకుందాము. విష్ణుపత్నియైన ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక! మహాలక్ష్మీ! వర్చస్సు, లోటు లేని జీవితం, మంచి ఆరోగ్యం - నాకు ప్రసాదించే పవనాలు సదా వీచనీ. ధన ధాన్యాలు, పశు సంపద, పుత్రులు, నూరేళ్ళ దీర్ఘాయుష్షు నాకు చేకూరనీ.

  • ఋణము, రోగము, దారిద్ర్యము, ఆకలి, అకాల మరణము, భయము, శోకము, మానసిక వ్యథలు నశించు గాక!. శ్రీదేవి చేరే వారిని ఐశ్వర్యం వరిస్తుంది; సంపద, దీర్ఘాయుష్షు చేకూరుతుంది. వారు ఐశ్వర్యాలతో తులతూగుతూ మరణం లేని స్థితికి చేరుకుంటారు. సత్వరమే వారు కీర్తిని, విజయాన్ని పొందుతారు.
  • మంచివి అన్నీ లక్ష్మే దేవియే - ఇలా తెలుసుకున్న వాడు లక్ష్మీ దేవిని చేరుకుంటాడు. మంత్రయుక్తముగా ఎల్లప్పుడూ యాగము చేయాలి. అలా చేసే వాడికి పుత్ర సంపద, పశు సంపద లభిస్తుందని గ్రహించాలి.

  • మహాలక్ష్మిని తెలుసుకుందాము. విష్ణుపత్నియైన ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక!

  • ఓం సదా శాంతి సౌభాగ్యాలతో వర్దిల్లలాలి 

శ్రీ సూక్తం సంస్కృత శ్లోకాలు:- 
ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రతస్ర’జామ్ | ంద్రాం హిరణ్మ’యీం క్ష్మీం జాత’వేదో  ఆవ’హ ||
తాం  ఆవ’ జాత’వేదో క్ష్మీమన’పగామినీ”మ్ |
స్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం పురు’షాహమ్ ||
శ్వపూర్వాం ర’థధ్యాం స్తినా”ద-ప్రబోధి’నీమ్ |
శ్రియం’ దేవీముప’హ్వయే శ్రీర్మా దేవీర్జు’షతామ్ ||
కాం సో”స్మితాం హిర’ణ్యప్రాకారా’మార్ద్రాం జ్వలం’తీం తృప్తాం ర్పయం’తీమ్ |
ద్మే స్థితాం ద్మవ’ర్ణాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||
ంద్రాం ప్ర’భాసాం సా జ్వలం’తీం శ్రియం’ లోకే దేవజు’ష్టాముదారామ్ |
తాం ద్మినీ’మీం శర’ణహం ప్రప’ద్యే‌உలక్ష్మీర్మే’ నశ్యతాం త్వాం వృ’ణే ||
దిత్యవ’ర్ణే తసో‌உధి’జాతో వస్పతిస్తవ’ వృక్షో‌உథ బిల్వః |
స్య ఫలా’ని తసాను’దంతు మాయాంత’రాయాశ్చ’ బాహ్యా అ’క్ష్మీః ||
ఉపైతు మాం దేఖః కీర్తిశ్చ మణి’నా హ |
ప్రాదుర్భూతో‌உస్మి’ రాష్ట్రే‌உస్మిన్ కీర్తిమృ’ద్ధిం దాదు’ మే ||
క్షుత్పి’పాసామ’లాం జ్యేష్ఠామ’క్షీం నా’శయామ్యహమ్ |
అభూ’తిమస’మృద్ధిం చ సర్వాం నిర్ణు’ద మే గృహాత్ ||
ద్వారాం దు’రార్షాం నిత్యపు’ష్టాం కరీషిణీ”మ్ |
శ్వరీగ్‍మ్’ సర్వ’భూతానాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||
మన’సః కామాకూతిం వాచః త్యమ’శీమహి |
శూనాం రూపమన్య’స్య మయి శ్రీః శ్ర’యతాం యశః’ ||
ర్దమే’న ప్ర’జాభూతా యి సంభ’వ ర్దమ |
శ్రియం’ వాసయ’ మే కులే మాతరం’ పద్మమాలి’నీమ్ ||
ఆపః’ సృజంతు’ స్నిగ్దాని చిక్లీత వ’స మే గృహే |
ని చ’ దేవీం మారం శ్రియం’ వాసయ’ మే కులే ||
ర్ద్రాం పుష్కరి’ణీం పుష్టిం సుర్ణామ్ హే’మమాలినీమ్ |
సూర్యాం హిరణ్మ’యీం క్ష్మీం జాత’వేదో  ఆవ’హ ||
ర్ద్రాం యః కరి’ణీం ష్టిం పిలామ్ ప’ద్మమాలినీమ్ |
ంద్రాం హిరణ్మ’యీం క్ష్మీం జాత’వేదో  ఆవ’హ ||
తాం  ఆవ’ జాత’వేదో క్షీమన’పగామినీ”మ్ |
స్యాం హిర’ణ్యం ప్రభూ’తం గావో’ దాస్యో‌உశ్వా”న్, విందేయం పురు’షాహమ్ ||
ఓం హాదేవ్యై చ’ విద్మహే’ విష్ణుత్నీ చ’ ధీమహి | తన్నో’ లక్ష్మీః ప్రచోదయా”త్ ||
శ్రీ-ర్వర్చ’స్వ-మాయు’ష్య-మారో”గ్యమావీ’ధాత్ పవ’మానం మహీయతే” | ధాన్యం నం శుం హుపు’త్రలాభం తసం”వత్సరం దీర్ఘమాయుః’ ||     ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
ఈ  You tube వీడియో యు .ఆర్ . యల్.ల లో శ్రీ సూక్తాన్ని వినండి.



Sri Suktam with Telugu Meaning & lyrics || The Most Powerful Vedic ...

https://www.youtube.com/watch?v=lCKiB1BIEF0

Note: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి  మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండికామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ..

Search Results






13, అక్టోబర్ 2018, శనివారం

Tulasi plant one of Hindus religious plant and it also had many Ayurvedic uses for many diseases

తులసి - సర్వరోగ నివారిణి తులసి

తులసీ స్మరణేరైవ సర్వపాపం వినశ్యతి తులసీ స్పర్శనేరైవ సశ్యంతి వ్యాదయో నృణామ్


తులసీ స్మరణ మాత్రము చేతనే సర్వపాపములు నశించును. తులసిమాలని స్పర్శించినంత మాత్రము చేతనే సర్వవ్యాధులు నశించును.

తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థస్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.రోజూ నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం, ప్రదక్షిణలు చేయడం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూ మండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం.తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పోషించినా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.తులసి మొక్కతో హరిహరులను పూజిస్తే పునర్జన్మ ఉండదని చెబుతారు 
    1. తులసి ఆకులను ఎప్పుడు తుంచరాదు ?
    • సనాతన సంప్రదాయాల ప్రకారం ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తులసి ఆకులను తుంచరాదు.
    • తులసి ఆకులను తూర్పు, ఉత్తర ముఖంగా నిల్చుని మాత్రమే కోయాలి.
    • ద్వాదశి అమావాస్య, పున్నమి తిథులలో తులసి ఆకులను తుంచరాదు.
    • రాత్రి వేళల్లోనూ, స్నానం చేయకుండా గానీ, పాదరక్షలతో గానీ తులసి మొక్కను ముట్టుకోరాదు.
    • తులసి ఆకులను ఒంటిగా తుంచరాదు. మూడు ఆకుల దళంతో కలిపే తుంచాలి.
    2. తులసి ఆకులూ కొమ్మలు, వేర్లు అనేక రకాలుగా ఉపయోగ పడతాయి ?

    • తులసి మొక్క ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటినీ వైద్య రంగంలో ఉపయోగిస్తారు.
    • తులసి ఆకుల రసాన్ని జ్వరం, వాంతులు, విరేచనాలు, అతిసార, రక్తస్రావం తదితర వ్యాధులను తగ్గించడంలో వాడతారు.
    • తులసి ఆకురసం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
    • తులసి ఆకులను నిమ్మ రసంతో కలిపి చర్మ సంబంధిత వ్యాధుల నిర్మూలనలో ఉపయోగిస్తారు.
    • గొంతు గరగరను తగ్గించడంలోనూ, కఫాన్ని తొలగించి గొంతును శుభ్రం చేయడంలోనూ తులసి రసాన్ని ఎక్కువగా వాడతారు.
    • పాము కరిచిన వ్యక్తి చేత తులసి ఆకులను తినిపించి, తులసి ఆకులు, వేర్లు, మిరియాలు కలిపి నూరి తినిపిస్తే విషం త్వరగా ఎక్కదని ఆయుర్వేద వైద్యులు చెబుతారు.
    • తేలు కుడివైపు కుడితే ఎడమవైపు, ఎడమ వైపు కుడితే కుడి వైపు చెవిలో తులసి రసం వేస్తే విషం ఎక్కదంటారు.
    • తులసితో దోమలు దూరం:
    • తులసీ దళాలను నీటిలో వేస్తే నీటిలో ఉన్న సూక్ష్మక్రిములు నాశనమ వుతాయి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు రెండు పెద్ద స్పూన్పరిమా ణంలో తులసి రసాన్ని తీసుకుని తగినంతగా తేనె చేర్చి 2,3 సార్లు తాగితే తగ్గుతుంది. తులసి ఆకులను నమలవచ్చు. ఇంటిచుట్టూ తులసి మొక్కల ఉంటే దోమల బాధ ఉండదు.
    •  తులసి జ్వరానికి దివ్యౌషధం కూడా పనిచేస్తుంది. 
    • గొంతునొప్పి, స్వరం సరిగా పలుకని సమయంలో కొంచెం నీళ్లలో తులసి ఆకులను వేసి ఉడికించి నీటితో పుక్కిలిపట్టాలి. నీళ్లు వెచ్చగా ఉన్నప్పుడే చేయాలి. పైత్యం, అలర్జీ లేదా ఏదైనా పురుగు కొరికినప్పుడు తులసి రసాన్ని రాయాలి. రెండు స్పూన్ల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగించాలి. తులసి ఆకులలో చెమటపట్టించే గుణం ఉంది. అందుకే అన్నిరకాల జ్వరాలలోను తులసి రసాన్ని తేనెతో కలిసి నాలుగు గంటలకు ఒకసారి ఇస్తారు.
    • చర్మవ్యాధులకు పోగొట్టడానికి ఉపయోగిస్తారు .
    • లివర్సమస్య ఉన్నటువంటి వారికి తులసి ఆకుల కషాయం చాలా మంచిది
    • మూత్రవిసర్జనలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, రసానికి కొద్దిగా పాలు, చక్కెరతోపాటు తీసుకోవాలి. తులసి విత్తనాలను ఒక గంటపాటు నీటిలో నానబెట్టి బాగా పిసికి, వడగట్టి తాగాలి
    • గజ్జి మొదలైన చర్మవ్యాధులలో దురద ఎక్కువగా ఉంటే తులసి ఆకుల రసాన్ని రాసి తులసి కషాయాన్ని తాగించాలి.
    • కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.
    • గొంతులో కఫం మటుమాయం అవడానికి దయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా రసంలో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది
    • తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి. జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది.
    • తులసి కషాయం తాగితే కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి). తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది
    • తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది. తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి. తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతు నొప్పి, బొంగురు పోయిన గొంతు సాఫీగా ఉంటుంది.
    • తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది., తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. నిద్రలేమితో బాధపడే వారికి తులసి గొప్ప ఔషధం
    • అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్ర పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
    • సౌందర్యసాధనకు ఎంతో ఉపయోగం గా ఉంటుంది ఆడవాళ్లు లక్షలు, వేలు ఖర్చుపెట్టి బ్యూటీషియన్ల వద్దకు వెళతారు. అక్కడ ట్రీట్మెంట్కోసం డబ్బులు మంచినీళ్లులా ఖర్చుపెడతారు. తులసి ఆకులను పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుంటే కొన్నాళ్లకు చర్మంలోని స్వేదగ్రంధులలో జీవం తొణికిసలాడి...మీ చర్మం నిగనిగలాడటం ఖాయం.
    1. తులసి మొక్కను ఈశాన్యాన గాని తూర్పు పక్కన గాని నాటాలి . అటు వైపు సూర్యుడి వెలుగు ఎక్కువ ఉండాలి.
    2. తులసి దైవ సంభూతమైన మొక్కగా హిందువులు భావిస్తారు. విష్ణువుకు ప్రీతి పాత్రమైనది ఇది .
    మన ఆరోగ్యానికి  మంచి ఔషధంగా పనిచేసే తులసిని మీ ఇంట్లో  రోజే నాటండిచక్కని ఆరోగ్యం సొంతం చేసుకోండి.
    See details of this plant in English...

    Ocimum tenuiflorum (synonym Ocimum sanctum), commonly known as holy basil  Tulasi (sometimes spelled thulasi) or tulsi, is an aromatic perennial plant in the ...



    Video URL's of this plant ...






    Note: నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి .
    నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి.
    మరియు wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
    అలాగే నా బ్లాగ్ teluguteevi.blogspot.com కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .