Psychology లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Psychology లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఏప్రిల్ 2021, ఆదివారం

మానవుడు తన జీవితాన్ని సుఖవంతంగా గడపడానికి సైకాలజిస్ట్ లు చెప్పిన 10 సూత్రాలు

wowitstelugu.blogspot.com

మానవుడు తన జీవితాన్ని సుఖవంతంగా గడపడానికి సైకాలజిస్ట్ లు చెప్పిన 10 సూత్రాలు 

మానవుడు తన జీవితాన్ని సుఖవంతం గా గడపడానికి సైకాలజిస్ట్ లు చెప్పిన 10 సూత్రాలు ఇప్పుడు  మనము తెలుసుకుందాం

01.
ఎప్పుడూ అనకూడని ఒకే  1 (ఒక) అక్షరం ( I )ఐ  (నేను)

ఎప్పుడు కూడా ఇది నాది... నేను... నావాళ్లు అని అనకూడదు. ఈ విధంగా అనడం వల్ల సంఘ జీవితం లో మిగతా వ్యక్తులకు దూరం అవుతాం అని అంటున్నారు, మానసిక శాస్త్రజ్ఞులు.

02.

ఎప్పుడూ  అనవలసిన 2 (రెండు) అక్షరాలు  WE ( మనం, లేదా మేము)

నేను అని ఎప్పుడూ అనకూడదు అనగానే దాని అర్ధం ఎప్పుడూ  మనం అని అనాలనే కదా అర్ధం.  అదే చెబుతున్నారు మానసిక శాస్త్రజ్ఞులు. నేను అనే పదం వాడడం మాని  మనం మనమందరం అని అనాలంటున్నారు మానసిక శాస్త్రజ్ఞులు . సంఘ జీవితం ఒకరి అవసరం ఒకరికి ఎదో ఒక సందర్భం లో అవసరం అయ్యే తీరుతుంది. 

03. 

ఎప్పుడూ  దగ్గరకు రానివ్వ కూడని  3 (మూడు)  అక్షరాలు  EGO (అహంకారం )

నేనే గొప్పవాణ్ణి నా అంతటి వారు ఎవ్వరూ లేరు అనుకోవడం చాలా తప్పు సమాజం ఒకరికి మించిన వారు వేరొకరు ఉంటూనే ఉంటారు. ప్రతి వ్యక్తి లోను ఎదో ఒక ప్రతిభ తప్పకుండ ఉండే ఉండి తీరుతుంది. అది ఏదో ఒక సమయం లో వేరొకరి ఉపయోగ పడే  తీరుతుంది. ధనం ప్రతిభకు కొలమానం కాదు. ప్రకృతి లో ఉచితంగా  దొరికేవే చాలా విలువ గలిగి ఉంటాయి . ఉదాహరణకు  గాలి, నీరు, ఎండ, నీడ.  ఇంకొకరికి దొరికేది  అదే మనకి కావలసింది కూడా అదే అనుకోవడం... ఇంకొకరు చేయగలిగేది మనం కూడా చేయ గలం... అని అను కోవడమే  అహంకారం.

04.

ఎప్పుడూ  మనసావాచా మనలో ఉండాల్సిన 4  (నాలుగు)  అక్షరాలు LOVE  (ప్రేమ  )

ప్రేమ ప్రేమాభిమానాలు మనుషులను దక్కరకు చేరుస్తాయి. తల్లికి తన పిల్లపై సహజమైన ప్రేమ ఎలా ఉంటుందో అలాగే మానవసంబంధాలు ధృడంగా  ఉండాలంటే ఎలాటి వారినైనా అర్ధం చేసుకోవడం ప్రేమించడం అలవాటుగా మార్చుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎప్పటికీ ఎవ్వరూ  శత్రువులుగా ఉండరు సరికదా ఎంతో సంతృప్తి ఆనందం మనకి  దొరుకుతుంది.

05.

ఎప్పుడూ మనలో ఉండాల్సిన 5  (ఐదు)  అక్షరాలు SMILE  ( చిరునవ్వు )

ఎప్పుడు నవ్వుతూ ఇతరులను నవిస్తూ ఉండేవాడు ఏ పనిలోనైనా విజయం సాధించడం తథ్యం. ఆనందంగా ఉండేవారి మెదడు ఎప్పుడు చురుకుగా పని చేస్తుంది. మొహం మోట మోట లాడిస్తూ ఉండేవారిపై ఎవ్వరికీ సదభిప్రాయం ఉండదు, పైగా వారికి స్నేహితులు లభించడం కూడా కష్టమే. ఈ చిరునవ్వు లక్షణాలు ఉన్న వారికీ మగ, అడా ఎవరైనా ఫిదా కావాల్సిందే.

06.

ఎప్పుడూ  మనం నేర్చుకోవాల్సిన  6 (ఆరు )  అక్షరాలు THANKS   (కృతజ్ఞతలు  )

ఎప్పుడైనా ఎవరివల్లనైన ఏ మాత్రం సహాయాన్ని పొందినా  వారికి  మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి.  తల్లితండ్రులకు జీవితాంతం ఋణపడి ఉండాలి.  తోటి వ్యక్తుల వల్ల మనం ఎంత చిన్న సాయం పొందినా వారికి  రెండింతలు సాయం చేయాలి . ఎప్పుడు వారిని మనం మరువ కూడదు.

07.

ఎప్పుడూ  మనం  అలవర్చుకోవాలిన  7 (ఏడు  )  అక్షరాలు FORGIVE ( క్షమించడం )

ఎలాంటి శత్రువునైనా క్షమించడం వల్ల విరోధం నించి ఊరట చెందుతాం. ఎలాంటి సమస్య అయినా చర్చించు కోవడం వల్ల పరిష్కారం అవుతుంది.  పొరపాట్లు మానవ సహజం ఆ సందర్భంలో అతనలా ప్రవర్తిన్చ రావలిసి ఉండవచ్చు. ఇతరులను అర్ధం చేసుకొని క్షమించడం అసలైన మానవ  లక్షణం. 

08.

ఎప్పుడూ  మనలో ఉండకూడని 8 (ఎనిమిది )  అక్షరాలు JEALOUSY  (అసూయ )

అసూయ చాల ప్రమాదమైనది. ప్రకృతి కొన్ని కొన్ని వస్తువులు కొందరికి మాత్రమే దొరుకుతాయి. అలాంటివే మనకి కావాలి అని కోరుకోవడం తప్పు. సాధ్యమైతే నీ పరిమితి లో నీవు వాటిని సమకూర్చు కోవచ్చు.  ప్రకృతి (దేవుడు) కొన్నిటిని కొంత మందికే పరిమితం చేసింది ఉదాహరణకి మంచి శరీర ఆకృతి, రంగు, ముఖ వర్చస్సు, వాక్సుద్ధి,  మొదలైనవి కలిగి ఉండడం. 

09.

ఎప్పుడూ  మనలో ఉండవలసిన 9 (తొమ్మిది )  అక్షరాలు ADOPTABLE (రాజీ పడడం)

సమస్య వచ్చినప్పుడు సర్డుకోవడం నేర్చుకోవాలి. కష్ట సుఖాలు, ఎండా-వానలు లాంటివి వచ్చి వెంట వెంటనే పోతుంటాయి కష్టాలు వచ్చినప్పుడు అనుకోనివి సాధించ లేన్నపుడు సర్దుకొనే  లక్షణం ఉండాలి అన్ని సందర్భాలూ అన్ని కాలాలు అందరికి ఒకేలా ఉండవు. చాల సందర్భాల్లో చాల సమయాల్లో చాలా మంది రాజీ పడడం సహజం గానే నేర్చుకోవాలి.

10.

ఎప్పుడూ  మనలో ఉండవలసిన 10 (పది ) అక్షరాలు UNDERSTAND (అర్ధం చేసుకోవడం)

అర్ధం చేసుకోవడం అనే లక్షణం లేకపోతె వాళ్ళు మానవులే కారు అనుకోవాలి. ఇతరుల సమస్యలు అర్ధం చేసుకోవడం. మన సమస్య వాళ్ళ సమస్య ఒకలాంటివే అనుకోవడమే మంచి మానవ లక్షణం అని తెలుసుకోవాలి. 

పైన చెప్పిన పది సూత్రాలు ఎవరైతే కచ్చితంగా పాటిస్తారో వాళ్ళ  జీవితమంతా ఎటువంటి శారీరక , మానసిక, ఆర్థిక సామజిక, సమస్యలు లేదా కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారని  కచ్చితంగా చెప్పవచ్చు అంటున్నారు మానసిక శాస్త్రజ్ఞులు.

ఈ క్రింది  వీడియో.యు.ఆర్.యల్. లు చూడండి 


Today's Quote

"Experience is the teacher of all things."

- Julius Caesar


Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి.

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


18, డిసెంబర్ 2020, శుక్రవారం

మాయ అంటే ఏమిటీ మనుషులు ఎందుకు ఈ మాయలో పడుతుంటారు

wowitstelugu.blogspot.com

మాయ అంటే ఏమిటీ మనుషులు ఎందుకు ఈ మాయలో పడుతుంటారు 

What is delusion and why do people fall into this delusion

💥మాయావినో మమిరే అశ్య మాయాయ (ఋగ్వేదం 9.83.3) 

💥మహా మాయగాళ్ళు ఆయన మాయచేతనే మాయచేస్తుంటారు.

👺    మాయ లో మనం పడటమే ఈ జీవితంలో అన్నిటికన్నా ఆశ్చర్యం. అసలైన మాయ

👺   ఈ జీవితమనే అడవిలో మన మనసు తికమక పడుతుంది, పెడుతుంది. 

👺 మన ఇహలోక జీవితం శాశ్వతం సంపూర్ణం ఎన్నటికి మారనిది సుఖమైనది అంటుంది. 

👺 కానీ మన మనసు అంటుకు పోయిన ఈ లోకం ఈ లోకంలోని మన జీవితం తాత్కాలికం అసంపూర్ణం ఎప్పుడూ మారేది పరిమితులతో  కూడినది చాలా విచారకరమైనది కూడా.

👺 గత జన్మల కర్మలను స్వభావాలను బట్టి మనం ఇహలోక ఆశలు పెంచుకుంటాము. మన రాగ ద్వేషాలను బట్టి ఆశలు కోర్కెలు ఎన్నోమనలో కలుగుతాయి. 

👺 మనసు పుట్టించే ఇహలోకాశలతో మనం మోసపోతాము. నాది నేను అనే మాయలో పడి మంచి మంచి వస్తువులుకోరతాము రోగం మరణం వద్దంటాము. 

👺 మహావిద్యావంతులు కూడా కోర్కెలు ఉండాలి కోర్కెలు లేనివాడు చచ్చినట్లే లెక్క అంటారు. 

👺 ల్లిదండ్రుల్నిజన్మను బంధువుల్ని కులాన్ని రంగును మరణాన్ని అన్నిటినీ మనమే ఏదేది ఎప్పుడు జరగాలో ఎలా జరగాలో కోరుకున్నట్లు అలాగే జరుగుతున్నట్లూ మనం భ్రమిస్తున్నాము. 

👺 అన్నిటికంటే ఆశ్యర్యం కలిగించే మన ఈమూర్ఖత్వపు  అజ్ఞానమే మహా  చిత్రమైన మాయ.

మాయకు సంబంధించిన  కథలు  :

1.👺    ఒక వ్యాపారి ఒక ఎడారి ని దాటవలసి ఉన్నది . అతడు అతని యొక్క బరువైన సామానులు మోసుకొని పోవుటకు ఒక ఒంటెను ఏర్పాటు చేసుకొన్నాడు. అతను అతని యొక్క మొత్తం సామానులు ఒంటెపైకి ఎక్కించి నాడు , వాటితో పటు ఒక చిన్న ఖాళీ డబ్బాను కూడా ఉంచాడు. ఆ ఒంటె ఆ సామాను బరువుకు బాధ పడుతూ ముందుకు పోవుటకు మొరాయించింది. అప్పుడు ఆ వ్యాపారి ఆ ఒంటె మీద ఉన్న సామాన్ల లో నుండి కాళీ డబ్బాను తీసి క్రిందకు విసిరి నాడు. ఆ డబ్బా శబ్దం చేస్తూ క్రింద పడింది . అప్పుడు ఆ ఒంటె తన వీపు మీద నున్న సామాను బరువు తగ్గిందని భావించి ఆ మండుతున్న ఇసుక ఎడారిని కూడా లెక్క చేయకుండా ఎడారిని దాటింది. మనిషి కూడా ఇలాంటి మాయల లోనే పడుతుంటాడు . మనిషి కూడా తనకి అన్ని సాధ్యమైయ్యే సాధ్యం కాదు అనుకుంటాడు.

2.👺   ఒక డాక్టర్ మరి యు ఒక పారిశ్రామిక వేత్త స్నేహితులు . వారిద్దరూ ఒక్క ముఖ్యమైన సమావేశానికి అర్ధరాత్రి కారులో ప్రయాణమైనారు. పారిశ్రామిక వేత్త కారు నడుపుతున్నారు. డాక్టర్ కబుర్లు చెబుతున్నారు. ప్రయాణిక బదలి కో లేదా ఇంకేదైనా మానసిక ఒత్తిడో తెలీదు కానీ పారిశ్రామిక వేత్తకు హఠాత్తుగా తల బద్దలైయెలా తల నొప్పి మొదలైంది. పారిశ్రామిక వేత్త డాక్టర్ ని ఏదైనా మందు ఇమ్మని అడిగాడు . డాక్టర్ దగ్గర ఉన్న మెడికల్ కిట్ లో మందులు తలనొప్పికి సంబందించినవి ఏవి లేవు . 

👺     కానీ కోటులోంచి ఒకటి తీసి స్నేహితుడిని పైకి తీసి చూడకుండా చప్పరించాలని దాన్ని మింగ కూడదని  చెప్పాడు. పారిశ్రామిక వేత్త మాట్లాడుతూ చప్పరిస్తూ ఉండగానే హఠాత్తుగా తలనొప్పి తగ్గి పోయింది. తలనొప్పి తగ్గగానే దాన్ని నోట్లోంచి చూడకుండా తీసి పారేయమన్నాడు . పారిశ్రామిక వేత్త డాక్టర్ చెప్పినట్లు అలాగే చేసాడు. కాని తలనొప్పికి వాడిన మందు పేరేమిటి అని అడిగడానికి  మొహమాట పడి. చాలా కాలమైనా తరువాత డాక్టర్ ని పారిశ్రామిక వేత్త అడిగినాడు మీరు నాకు తల నొప్పికి ఇచ్చిన మందేమిటని? అప్పుడు డాక్టర్ చెప్పిన  సమాధానానికి పారిశ్రామిక వేత్త నివెర్రపోయాడు . ఆ డాక్టర్ ఇచ్చిన మందు ఏమిటంటే అతని కోటు గుండీ. డాక్టర్ మంచి మందే ఇస్తాడు లే అనే నమ్మకమే అతని తలా నొప్పిని తగ్గించింది.మనిషి అలాగే మన జబ్బులకు అన్నిటికి కారణం మన మనస్సే అన్న సంగతి మర్చి పోతాడు. ఇదే మరి మాయ అంటే ?

👺     ఈ ప్రపంచము లో మానవ జీవితం అంతా కూడా ఒక ఎడారి లేదా సముద్రం లాంటిది . ఎన్నెన్నో వింతలూ విచిత్రాలు. ఈ మాయ దేవి లీలలకు అంతు లేదు . అన్ని తెలిసిన వాడు తనకు ఏమి తెలీదనుకుంటాడు . ఏమి తేలినవాడు తనకు అన్ని తెలుసు అనుకుంటాడు.  అన్నిటికి ఈ మాయ లేదా డెల్యూషన్ మనిషిని మాయ లోకి తోస్తుంది . మాయ అనేది ఓకే ఊహ. ఒకొక్క సారి చిన్న చిన్న కష్టాలు తొలగించి అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. అంతులేని ధన సంపదలు ఉంది కూడా చాలామందికి మానసిక శారీరక భాదలు ఈ మాయ వల్లే కలుగుతాయి .మానవుడు ఈ కష్టాల నుంచి పూర్తిగా విముక్తి లభించిందని భ్రమిస్తుంటాడు. ఈ మాయ  ప్రతి క్షణం ప్రతి మానవుడిని వెంటాడుతూనే ఉంటుంది. 

ఏమిటి మాయ? ఇది ఎవరు?

👉    అంబ లేదా జగదాంబ ఈ జగత్తున్నంతా సృష్టించి రక్షించి తిరిగి లయం చేసే శక్తి స్వరూపం.

👉    జగత్తుకంతటికీ అధినాయకి. జగదాంబిక.త్రిమూర్తుల యోగదృష్టి సంయోగం వల్ల జన్మించింది.

 👉    ఈ శక్తి స్వరూపిణి, త్రికళ. విష్ణుమాయ.జగాన్ని సంహరించే లయకారిణి.

మాయేశ్వరీ దేవి ఎవరు? 


🙏 మాయేశ్వరీ మాత.దేవీ భాగవతం ఆరో స్కంధంలో సకల జగత్తుకు మూలాధారమైన  శక్తే ఈ మాయేశ్వరీ మాత

🙏 హరిహరబ్రహ్మ రుద్రాదులను సయితం ఈమె సృష్టించి వారి చేత ఏయే పనులు చేయించాలో వాటిని చేయిస్తుంటుంది. 

🙏 చరాచర జగత్తునంతటినీ ఆడించే మాయాశక్తి ఆమె. సత్వ, రజో, తమో అనే మూడు గుణాలతో ఆవరించి ఉండే మాయ ఆ తల్లి చేతిలోని ఓ సూత్రం. 

🙏 ఆ మాయాశక్తి వల్లే అంతటి పెద్ద పెద్ద దేవుళ్ళు కూడా ఒకసారి కోపంగా, మరోసారి దుఃఖపడుతూ కనిపిస్తుంటారు. 

🙏 తమోగుణం ఆవరించి ఉన్నప్పుడు మూఢంగా ప్రవర్తించి విషాదాన్ని అనుభవిస్తూ కనిపిస్తారు.

🙏 మాయాశక్తికి లోనుకాకుండా మోక్షపథం వైపు పయనించాలంటే తనలోని మాయను తొలగించమని వేడుకోవాలి. 

🙏  ఆదిపరాశక్తి అని, సచ్చిదానంద స్వరూపిణి అని, భగవతి, మాయేశ్వరి అని కూడా ఆ మాతఅని కూడా అంటుంటారు. 

🙏 ఆ సూత్రంతోనే సకల సృష్టిని బొమ్మను చేసి ఆడించినట్టు ఆడిస్తూ ఉంటుంది ఆమె. 

🙏బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు కూడా త్రిగుణాత్మకమైన మాయను పొంది ఉంటారు. 

🙏 మూడు గుణాలలో మొదటిదైన సత్వగుణం ఆవరించి ఉన్నప్పుడు త్రిమూర్తులు శాంతులై తపస్సు చేసుకుంటూ ఉంటారు. 

🙏 అదే రజోగుణం ఉన్నప్పుడు ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. 

🙏 ఈ జగత్తంతా మాయ ఆధీనంలో ఉంటుంది . ఈ మాయాశక్తిని ప్రేరేపించే జగదాంబికను పరతత్వం అని, పరమేశ్వరి అని కూడా అంటారు.

🙏అప్పుడు మనస్సు నిర్మలంగా ప్రకాశిస్తుంది. ఇంద్రియాలకు నిగ్రహశక్తి లభించినప్పుడు మనిషి చూపు తాత్కాలిక సుఖాల మీద ఉండదు. 

🙏  నిత్యము, నిశ్చలము అయిన మోక్షపథం వైపు ఆ చూపు ప్రసరిస్తుంది.

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. లలో మాయ గురించి చూడండి 


ఈ రోజు సూక్తి "

"When you know what you want, and want it bad enough, you’ll find a way to get it."
- Jim Rohn

Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  YouTube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials  like share and Subscribe,  కామెంట్   చేయడం మర్చిపోకండి.




25, అక్టోబర్ 2018, గురువారం

'What are the characters needed to Marry a Girl' according to Chanakya

అమ్మాయిల్లో లక్షణాలు లేనివాళ్ళని పెళ్లి చేసుకుంటేనే బెటర్చాణక్యుడు



ప్రతీ మనిషికి పెళ్లి అనేది జీవితంతో మరిచిపోలేని ఘట్టం. ప్రతీ అబ్బాయిలో తను చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలనే ఊహలు, అభిప్రాయాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. జీవితంపై అవగాహన కలిగిన,మంచి అమ్మాయి భాగస్వామిగా దొరికితే అంతకంటే భాగ్యం మరొకటి ఉండదు


అయితే జీవితం ఎటువంటి గొడవలు లేకుండా సాఫీగా సాగాలంటే ఎలాంటి అమ్మాయిలను అస్సలు పెళ్లి చేసుకోకూడదో చాణక్యుడు ఇలా చెప్పాడు..

1. సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే అమ్మాయిలు

అమ్మాయిల్లో అందాన్ని చూసుకుని విర్రవీగే వాళ్ళని నిర్మొహమాటంగా తిరస్కరించాలని చాణక్యుడు చెబుతున్నాడు. వారు తమ అందానికి ఇచ్చే ప్రాధాన్యం చుట్టూ ఉండే కష్ట సుఖాలకు ఇవ్వరట. పైకి కనపడే అందం కన్నా మానసిక అందం కలిగిన అమ్మాయిలను మాత్రమే వివాహ మాడాలని చెబుతున్నారు.

2. కుటుంబ నేపథ్యం సరిగ్గాలేని అమ్మాయిలు

కుటుంభ భాద్యత తెలియని వాళ్ళు, కుటుంబ నేపథ్యం సరిగ్గా లేకున్నా పెళ్లి తర్వాత కష్టాలు తప్పవట. పెళ్లయిన కొద్ది రోజులకే వేరు కాపురం గురించి పోరు పెట్టవచ్చట. అత్త మామల పట్ల అమర్యాదగా ప్రవర్తించవచ్చు.

3. అబద్ధాలు మాట్లాడే అమ్మాయిలు
అబద్ధాలు చెప్పే అమ్మాయిలను పెళ్లాడవద్దని చాణక్యుడు చెప్పాడు.అమ్మాయిల ప్రవర్తన తీరు తీక్షణంగా గమనిస్తే ఆమె మీతో ఎంత నిజాయితీగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే పెళ్లయిన తర్వాత కూడా రకరకాల అబద్ధాలు చెప్పి కుటుంభంలో కలహాలు తీసుకరావొచ్చు.
4. విశ్వాసం,నిజాయితీ లేని అమ్మాయిలు

నిజాయితీ,విశ్వాసం లేని అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దని సూచించాడు చాణక్యుడు. తన కుటుంబానికే విశ్వాసం లేని అమ్మాయిలు భర్త పట్ల కూడా విశ్వాసఘాతుకంగానే ప్రవర్తిస్తారట.
5. ఇంటి ని చక్కదిద్దుకోలేని అమ్మాయిలు

ఇంటిని చూస్తే చాలు ఇల్లాలిని చూడక్కలేదు అన్నారు పెద్దలు. ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకోవడంలో మగాళ్లతో పోల్చితే ఆడవాళ్లదే ప్రధాన పాత్ర. ఇల్లు శుభ్రంగా లేకపోతే ఇంట్లో ప్రశాంతత ఉండదు.
6. గొడవలు పడే అమ్మాయిలు


చిన్న చిన్న విషయాలకే గొడవలు పడే అమ్మాయిలతో పెళ్లే వద్దంటున్నాడు చాణక్యుడు. ఇటువంటి వారు ఏవిధంగానైనా తమకు కావల్సింది సాధించుకుంటారట. అటువంటి వారిని వివాహమాడితే జీవితాంతం తిప్పలు తప్పవట.


7. దైవ భక్తిలేని అమ్మాయిలు:  

నిత్యం దేవుడిని  పూజించే అమ్మాయిలే భర్తను బాగా చూసుకుంటారట. అమ్మాయిలకు దైవ భక్తి తప్పనిసరి అని చాణక్యుడు చెబుతున్నాడు.

  • అయితే పై విషయాలని బట్టి పెళ్ళికి అర్హత ఉన్న అమ్మాయిలు అందానికి ప్రాముఖ్యత ఇవ్వరాదు, కుటుంబసభ్యులతో కలిసి మెలిసి కలివిడిగా ఉండాలి, నిజాయితీగా నిజానికి కట్టుబడి ఉండాలి, ఇల్లు పరిశుభ్రం గా ఉంచుకోవాలి, చిన్న విషయాలకే గొడవలు పడకూడదు, దైవ భక్తి పరాయణురాలై ఉండాలి అని అర్ధం అవుతుంది .
  • అలాగే అర్ధం చేసుకొనే మనస్త్వం, రాజీపడే మనస్తవం , పెద్దలమీద గౌరవం, ధనము మీద కంటే భర్త ప్రేమ నే ఎక్కువ ఆశించే అమ్మాయి అయితే బాగుంటుంది .
ఈ పై లక్షణాలు అమ్మాయిలకేనా అబ్బాయిలకు ఉండవా అని మీరు అనవచ్చు
. కానీ చాణిక్యుడి దృష్టిలో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు  ఉండవలసిన లక్షలేమిటో తెలిపారు.

అబ్బాయిలకు ఉండవలసిన లక్షణాలు ఏమిటో మరోసారి తెలుసుకుందాం.  ఈ లక్షణాలన్నీ కావాలని ప్రతీ అబ్బాయిలు కోరుకొంటారు . 

కానీ లక్షణాలు అనేవి పైకి కనిపించేవి కాదు కదా? అందుకే పెద్దవారి జోక్యంతో , అన్నిక్షుణ్ణం గా పరిశీలించి , కొంతకాలం ఆగి పెళ్లి చేసుకుంటే మంచిది . పెళ్లంటే నూరేళ్ళ పంట కదా మరి.

ఈ క్రింది వీడియో యూ.ర్.ఎల్ చూడండి .....

Chanakya Neeti - Men Only! 5 Types of Women You should not marry ...

https://www.youtube.com/watch?v=hQcmzQjPHig

Note:
అలాగే నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blgspot.com like,share and subscribe చేయండి. 
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి .మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .