29, జూన్ 2020, సోమవారం

స్కాంద పురాణం గౌరీ ఖండం లో ఆదిత్య కవచం

wowitstelugu.blogspot.com
స్కాంద పురాణం గౌరీ ఖండం లో ఆదిత్య కవచం



ధ్యానం

ఉదయాచల మాగత్య వేదరూప మనామయంతుష్టావ పరయా భక్త వాలఖిల్యాదిభిర్వృతమ్ |దేవాసురైః సదావంద్యం గ్రహైశ్చపరివేష్టితం
ధ్యాయన్ స్తవన్ పఠన్ నామ యః సూర్య కవచం సదా ||

కవచం

ఘృణిః పాతు శిరోదేశం, సూర్యః ఫాలం చ పాతు మే

ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతః ప్రభాకరః


ఘ్రూణం పాతు సదా భానుః అర్క పాతు తథా

జిహ్వం పాతు జగన్నాధః కంఠం పాతు విభావసు

స్కంధౌ గ్రహపతిః పాతు, భుజౌ పాతు ప్రభాకరః

అహస్కరః పాతు హస్తౌ హృదయం పాతు భానుమాన్

మధ్యం చ పాతు సప్తాశ్వో, నాభిం పాతు నభోమణిః

ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ

ఊరూ పాతు సురశ్రేష్టో, జానునీ పాతు భాస్కరః

జంఘే పాతు చ మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః

పాదౌ బ్రద్నః సదా పాతు, మిత్రో పి సకలం వపుః

వేదత్రయాత్మక స్వామిన్ నారాయణ జగత్పతే

ఆయతయామం తం కంచి ద్వేద రూపః ప్రభాకరః

స్తోత్రేణానేన సంతుష్టో వాలఖిల్యాదిభి ర్వృతః

సాక్షాత్ వేదమయో దేవో రధారూఢః సమాగతః

తం దృష్ట్యా సహసొత్థాయ దండవత్ప్రణమన్ భువి

కృతాంజలి పుటో భూత్వా సూర్యా స్యాగ్రే స్తువత్తదా

వేదమూర్తిః మహాభాగో ఙ్ఞానదృష్టి ర్విచార్య చ

బ్రహ్మణా స్థాపితం పూర్వం యాతాయామ వివర్జితం

సత్త్వ ప్రధానం శుక్లాఖ్యం వేదరూప మనామయం

శబ్దబ్రహ్మమయం వేదం సత్కర్మ బ్రహ్మవాచకం

ముని మధ్యాపయామాసప్రధమం సవితా స్వయం

తేన ప్రథమ దత్తేన వేదేన పరమేశ్వరః

యాఙ్ఞవల్క్యో మునిశ్రేష్టః కృతకృత్యో భవత్తదా

ఋగాది సకలాన్ వేదాన్ ఙ్ఞాతవాన్ సూర్య సన్నిధౌ

ఇదం స్తోత్రం మహాపుణ్యం పవిత్రం పాపనాశనం

యఃపఠేచ్చ్రుణుయా ద్వాపి సర్వపాఫైఃప్రముచ్యతే

వేదార్ధఙ్ఞాన సంపన్నః సూర్యలోక మవాప్నయాత్


ఇతి స్కాంద పురాణే గౌరీ ఖండే ఆదిత్య కవచం సంపూర్ణమ్ |

ఈ క్రింద యూట్యూబ్ వీడియో లింక్ చూడండి 

Surya Kavacham In Telugu - Lord Surya Bhagavan ... - YouTube





ఆదిత్య కవచం ఆదివారం రోజు వింటే మీ ... - YouTube



Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ














27, జూన్ 2020, శనివారం

తిరుమల లో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పూజావిశేషాలు తెలుసుకుందాం





wowitstelugu.blogspot.com
తిరుమల లో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి  పూజావిశేషాలు తెలుసుకుందాం 



వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు 6 (ఆరు)సార్లు పూజలు జరుగుతాయి. అవి ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు, తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.
సుప్రభాతసేవ : 
  • నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది.

  • ముందుగానే ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల) దేవాలయం వద్దకు వస్తారు.

  • నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు.

  • సుప్రభాతం చదివే అధ్యాపకులు,తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు.

  • బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు.

  • తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ, గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతుంటాడు.

  • అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొలుపుతారు.

  • పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు.

  • మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతి నిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు.

ఆలయ శుద్ధి:
  • సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. 

  • శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.


శ్రీవారి అర్చన:
  • శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు.

  • అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు.

  • చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు.

  • ఈ సూత్రం ద్వారానే ధ్రువబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక.

  • ఇది జరిగిన తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు. 

  • అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. 

  • యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. 

  • ఆ తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.

తోమాలసేవ:

  • తమిళంలో 'తోడుత్తమాలై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల', తోమాలసేవ అయి ఉండవచ్చు.
  • దీనిని భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాలసేవ చేస్తారు.

కొలువు:
  • తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది.

  • బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు.

  • ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు.

  • అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.

సహస్రనామార్చన:
  • ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది.బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది.
  • ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసిదళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. 

  • ఈ సమయంలో మిరాశీదారు వరాహ పురాణం లోని లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు.
  • తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.

మొదటిగంట, నైవేద్యం:
  • మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. 
  • నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు.

  • అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి) కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.
అష్టోత్తర శతనామార్చన:

  • ఈ అష్టోత్తర శత నామార్చన తో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి.
  • వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.

రెండో గంట, నైవేద్యం:
  • అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.
రాత్రి కైంకర్యాలు:

  • ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి
  • ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.

ఏకాంతసేవ:
  • రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు.

  • ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా పెడతారు.

  • రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు.

  • ఏడుకొండల వాడిని నిదురపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు.

  • దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.)

  • దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.

గుడిమూసే ప్రక్రియ:
  • రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.

ప్రత్యేక సేవలు
  • రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. 

  • సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, గురువారం సడలింపు, పూలంగిసేవ, తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం. స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. 

  • డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి.
సడలింపు:
  • గురువారం ప్రాతఃకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని తగ్గిస్తారు.
  • దీనివల్ల శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి. అనంతరం శ్రీవారికి 24మూరల పట్టు అంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయాన్నీ కడతారు. సువర్ణపాదాలు, హస్తాలు, శంఖచక్రాలు, కర్ణాభరణాలు, స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు. దీన్ని సడలింపు అంటారు.

పూలంగిసేవ:
  • ఆపాదమస్తకం స్వామివారిని పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ. తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్యమనోహర విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.
తిరుప్పావడ:
  • భారీసంభారాలతో స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు.
  • ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది.

  • గురువారం సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, దోసె, పాయసం, జిలేబి తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు.
అభిషేకం:
  • శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైంది ప్రతిశుక్రవారం ఉదయం జరిగే అభిషేకం. ఈ సేవ ప్రాశస్త్యం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కల్యాణశోభితుడైన స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు లభిస్తుంది.
  • గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేకానంతర దర్శనకాలంలో తప్ప మిగతా అన్ని రోజులూ స్వామి వెడల్పాటి తెల్లని కర్పూరనామంతో దర్శనమిస్తాడు.

  • ఈ మూడు సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్రదర్శనం, నిజపాద దర్శనం అంటారు.
శ్రీ వారి నిత్యా పూజ కైంకర్యాలు గురించి కింది వీడియో లింకుల్లో చూడండి...


Sri Venkatesh Swamy Nithya Pooja Vidanam || Swamy ...


Srivari Sevalu, Abhishekam-Friday | 02-06-17 | SVBC TTD ...

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ













26, జూన్ 2020, శుక్రవారం

స్కంధ షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్టి పురాణ గాధ ప్రాధాన్య తెలుసుకోండి

wowitstelugu.blogspot.com
స్కంధ షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్టి పురాణ గాథ ప్రాధాన్య తెలుసుకోండి

తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. ఈ షష్టినే సుబ్రహ్మణ్య షష్టి లేదా స్కంద షష్టిగా పిలుస్తారు.శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి, కార్తీకేయుడు,స్కందుడు,షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి ,సుబ్బరాయుడు షష్టి,తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు.

  • పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావు లేని వరం పొందాడు. దీంతో తాను అజేయుడునని, అమరుడునని వరగర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు. వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవునివద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు. అంతట దేవతలు పరమశివుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు.

  • పురాణగాథల ప్రకారం.. పరమశివుని దివ్యతేజస్సు వాయుదేవునిలో ప్రవేశింపబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపజేశాడు. అగ్ని కూడా శివతేజస్సును తాళలేక గంగానదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో రెళ్లి వనంలో (శరవనం ) చిక్కుకొని ఆరు ముఖాలు (షణ్ముఖాలు) పన్నెండు చేతులతో ఓ బాలుడు జన్మించాడు. అతడే సుబ్రహ్మణ్యస్వామి లేదా కుమార స్వామి. కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేశారు.పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. కుమారస్వామి తారకాసురుడితో ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు. లోకాన్ని, దేవతలను కాపాడి అందరి మన్ననలు పొందిన సుబ్రహ్మణ్యస్వామి దేవసేనాపతిగా కీర్తింపబడ్డారు.

  • సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి తలంటు స్నానమాచరించి పాలు, పంచాదారలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు.

  • కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉన్నది.ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది.

  • సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం లో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని,ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని,దానం చేయమని సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా "పరోప కారం మిధం శరీరం" అని భావించి పేదవారికి స్వేటర్లు , కంబళ్ళు, దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను,తిను బండారాలను దానం చేయాలని తెలుపుతున్నాయి

  • స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి.. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి. రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తుంటారు. ఈ రోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకలశుభాలు కలుగుతాయని ప్రతీతి.

*ఓం శం శరవణభవ*

ఈ క్రింది వీడియో లింక్లు చూడండి

ఈ సుబ్రహ్మణ్య షష్టి కథ విన్నవారికి కోటి ...




Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ










25, జూన్ 2020, గురువారం

శివానంద లహరి శ్రీ శ్రీ శ్రీ ఆది శఙ్కరాచార్య విరచితం Sivanandalahari

wowitstelugu.blogspot.com

శివానంద లహరి శ్రీ శ్రీ శ్రీ ఆది శఙ్కరాచార్య విరచితం 



శివానంద లహరి

కలాభ్యాం చూడాలఙ్కృత-శశి కలాభ్యాం నిజ తపః-
ఫలాభ్యాం భక్తేశు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే |
శివాభ్యాం-అస్తోక-త్రిభువన శివాభ్యాం హృది పునర్-
భవాభ్యామ్ ఆనన్ద స్ఫుర-దనుభవాభ్యాం నతిరియమ్ || ౧ ||
గలన్తీ శమ్భో త్వచ్-చరిత-సరితః కిల్బిశ-రజో
దలన్తీ ధీకుల్యా-సరణిశు పతన్తీ విజయతామ్
దిశన్తీ సంసార-భ్రమణ-పరితాప-ఉపశమనం
వసన్తీ మచ్-చేతో-హృదభువి శివానన్ద-లహరీ ౨
త్రయీ-వేద్యం హృద్యం త్రి-పుర-హరమ్ ఆద్యం త్రి-నయనం
జటా-భారోదారం చలద్-ఉరగ-హారం మృగ ధరమ్
మహా-దేవం దేవం మయి సదయ-భావం పశు-పతిం
చిద్-ఆలమ్బం సామ్బం శివమ్-అతి-విడమ్బం హృది భజే ౩
సహస్రం వర్తన్తే జగతి విబుధాః క్శుద్ర-ఫలదా
న మన్యే స్వప్నే వా తద్-అనుసరణం తత్-కృత-ఫలమ్
హరి-బ్రహ్మాదీనాం-అపి నికట-భాజాం-అసులభం
చిరం యాచే శమ్భో శివ తవ పదామ్భోజ-భజనమ్ ౪
స్మృతౌ శాస్త్రే వైద్యే శకున-కవితా-గాన-ఫణితౌ
పురాణే మన్త్రే వా స్తుతి-నటన-హాస్యేశు-అచతురః
కథం రాజ్నాం ప్రీతిర్-భవతి మయి కో(అ)హం పశు-పతే
పశుం మాం సర్వజ్న ప్రథిత-కృపయా పాలయ విభో ౫
ఘటో వా మృత్-పిణ్డో-అపి-అణుర్-అపి చ ధూమో-అగ్నిర్-అచలః
పటో వా తన్తుర్-వా పరిహరతి కిం ఘోర-శమనమ్
వృథా కణ్ఠ-క్శోభం వహసి తరసా తర్క-వచసా
పదామ్భోజం శమ్భోర్-భజ పరమ-సౌఖ్యం వ్రజ సుధీః ౬
మనస్-తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర-ఫణితౌ
కరౌ చ-అభ్యర్చాయాం శ్రుతిర్-అపి కథాకర్ణన-విధౌ
తవ ధ్యానే బుద్ధిర్-నయన-యుగలం మూర్తి-విభవే
పర-గ్రన్థాన్ కైర్-వా పరమ-శివ జానే పరమ్-అతః ౭
యథా బుద్ధిః-శుక్తౌ రజతమ్ ఇతి కాచాశ్మని మణిర్-
జలే పైశ్టే క్శీరం భవతి మృగ-తృశ్ణాసు సలిలమ్
తథా దేవ-భ్రాన్త్యా భజతి భవద్-అన్యం జడ జనో
మహా-దేవేశం త్వాం మనసి చ న మత్వా పశు-పతే ౮
గభీరే కాసారే విశతి విజనే ఘోర-విపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడ-మతిః
సమర్ప్యైకం చేతః-సరసిజమ్ ఉమా నాథ భవతే
సుఖేన-అవస్థాతుం జన ఇహ న జానాతి కిమ్-అహో ౯
నరత్వం దేవత్వం నగ-వన-మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది-జననమ్
సదా త్వత్-పాదాబ్జ-స్మరణ-పరమానన్ద-లహరీ
విహారాసక్తం చేద్-హృదయం-ఇహ కిం తేన వపుశా ౧౦
వటుర్వా గేహీ వా యతిర్-అపి జటీ వా తదితరో
నరో వా యః కశ్చిద్-భవతు భవ కిం తేన భవతి
యదీయం హృత్-పద్మం యది భవద్-అధీనం పశు-పతే
తదీయస్-త్వం శమ్భో భవసి భవ భారం చ వహసి ౧౧
గుహాయాం గేహే వా బహిర్-అపి వనే వా(అ)ద్రి-శిఖరే
జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్
సదా యస్యైవాన్తఃకరణమ్-అపి శమ్బో తవ పదే
స్థితం చెద్-యోగో(అ)సౌ స చ పరమ-యోగీ స చ సుఖీ ౧౨
అసారే సంసారే నిజ-భజన-దూరే జడధియా
భరమన్తం మామ్-అన్ధం పరమ-కృపయా పాతుమ్ ఉచితమ్
మద్-అన్యః కో దీనస్-తవ కృపణ-రక్శాతి-నిపుణస్-
త్వద్-అన్యః కో వా మే త్రి-జగతి శరణ్యః పశు-పతే ౧౩
ప్రభుస్-త్వం దీనానాం ఖలు పరమ-బన్ధుః పశు-పతే
ప్రముఖ్యో(అ)హం తేశామ్-అపి కిమ్-ఉత బన్ధుత్వమ్-అనయోః
త్వయైవ క్శన్తవ్యాః శివ మద్-అపరాధాశ్-చ సకలాః
ప్రయత్నాత్-కర్తవ్యం మద్-అవనమ్-ఇయం బన్ధు-సరణిః ౧౪
ఉపేక్శా నో చేత్ కిం న హరసి భవద్-ధ్యాన-విముఖాం
దురాశా-భూయిశ్ఠాం విధి-లిపిమ్-అశక్తో యది భవాన్
శిరస్-తద్-వదిధాత్రం న నఖలు సువృత్తం పశు-పతే
కథం వా నిర్-యత్నం కర-నఖ-ముఖేనైవ లులితమ్ ౧౫
విరిన్చిర్-దీర్ఘాయుర్-భవతు భవతా తత్-పర-శిరశ్-
చతుశ్కం సంరక్శ్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్
విచారః కో వా మాం విశద-కృపయా పాతి శివ తే
కటాక్శ-వ్యాపారః స్వయమ్-అపి చ దీనావన-పరః ౧౬
ఫలాద్-వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో
ప్రసన్నే(అ)పి స్వామిన్ భవద్-అమల-పాదాబ్జ-యుగలమ్
కథం పశ్యేయం మాం స్థగయతి నమః-సమ్భ్రమ-జుశాం
నిలిమ్పానాం శ్రేణిర్-నిజ-కనక-మాణిక్య-మకుటైః ౧౭
త్వమ్-ఏకో లోకానాం పరమ-ఫలదో దివ్య-పదవీం
వహన్తస్-త్వన్మూలాం పునర్-అపి భజన్తే హరి-ముఖాః
కియద్-వా దాక్శిణ్యం తవ శివ మదాశా చ కియతీ
కదా వా మద్-రక్శాం వహసి కరుణా-పూరిత-దృశా ౧౮
దురాశా-భూయిశ్ఠే దురధిప-గృహ-ద్వార-ఘటకే
దురన్తే సంసారే దురిత-నిలయే దుఃఖ జనకే
మదాయాసమ్ కిం న వ్యపనయసి కస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్-చేత్ తవ శివ కృతార్థాః ఖలు వయమ్ ౧౯
సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచ-గిరౌ
నటత్య్-ఆశా-శాఖాస్-వటతి ఝటితి స్వైరమ్-అభితః
కపాలిన్ భిక్శో మే హృదయ-కపిమ్-అత్యన్త-చపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవద్-అధీనం కురు విభో ౨౦
ధృతి-స్తమ్భాధారం దృఢ-గుణ నిబద్ధాం సగమనాం
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతి-దివస-సన్మార్గ-ఘటితామ్
స్మరారే మచ్చేతః-స్ఫుట-పట-కుటీం ప్రాప్య విశదాం
జయ స్వామిన్ శక్త్యా సహ శివ గణైః-సేవిత విభో ౨౧
ప్రలోభాద్యైర్-అర్థాహరణ-పర-తన్త్రో ధని-గృహే
ప్రవేశోద్యుక్తః-సన్ భ్రమతి బహుధా తస్కర-పతే
ఇమం చేతశ్-చోరం కథమ్-ఇహ సహే శన్కర విభో
తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ ౨౨
కరోమి త్వత్-పూజాం సపది సుఖదో మే భవ విభో
విధిత్వం విశ్ణుత్వమ్ దిశసి ఖలు తస్యాః ఫలమ్-ఇతి
పునశ్చ త్వాం ద్రశ్టుం దివి భువి వహన్ పక్శి-మృగతామ్-
అదృశ్ట్వా తత్-ఖేదం కథమ్-ఇహ సహే శన్కర విభో ౨౩
కదా వా కైలాసే కనక-మణి-సౌధే సహ-గణైర్-
వసన్ శమ్భోర్-అగ్రే స్ఫుట-ఘటిత-మూర్ధాన్జలి-పుటః
విభో సామ్బ స్వామిన్ పరమ-శివ పాహీతి నిగదన్
విధాతృఋణాం కల్పాన్ క్శణమ్-ఇవ వినేశ్యామి సుఖతః ౨౪
స్తవైర్-బ్రహ్మాదీనాం జయ-జయ-వచోభిర్-నియమానాం
గణానాం కేలీభిర్-మదకల-మహోక్శస్య కకుది
స్థితం నీల-గ్రీవం త్రి-నయనం-ఉమాశ్లిశ్ట-వపుశం
కదా త్వాం పశ్యేయం కర-ధృత-మృగం ఖణ్డ-పరశుమ్ ౨౫
కదా వా త్వాం దృశ్ట్వా గిరిశ తవ భవ్యాన్ఘ్రి-యుగలం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్శసి వహన్
సమాశ్లిశ్యాఘ్రాయ స్ఫుట-జలజ-గన్ధాన్ పరిమలాన్-
అలభ్యాం బ్రహ్మాద్యైర్-ముదమ్-అనుభవిశ్యామి హృదయే ౨౬
కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధన-పతౌ
గృహస్థే స్వర్భూజా(అ)మర-సురభి-చిన్తామణి-గణే
శిరస్థే శీతాంశౌ చరణ-యుగలస్థే(అ)ఖిల శుభే
కమ్-అర్థం దాస్యే(అ)హం భవతు భవద్-అర్థం మమ మనః ౨౭
సారూప్యం తవ పూజనే శివ మహా-దేవేతి సఙ్కీర్తనే
సామీప్యం శివ భక్తి-ధుర్య-జనతా-సాఙ్గత్య-సమ్భాశణే
సాలోక్యం చ చరాచరాత్మక-తను-ధ్యానే భవానీ-పతే
సాయుజ్యం మమ సిద్ధిమ్-అత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహమ్ ౨౮
త్వత్-పాదామ్బుజమ్-అర్చయామి పరమం త్వాం చిన్తయామి-అన్వహం
త్వామ్-ఈశం శరణం వ్రజామి వచసా త్వామ్-ఏవ యాచే విభో
వీక్శాం మే దిశ చాక్శుశీం స-కరుణాం దివ్యైశ్-చిరం ప్రార్థితాం
శమ్భో లోక-గురో మదీయ-మనసః సౌఖ్యోపదేశం కురు ౨౯
వస్త్రోద్-ధూత విధౌ సహస్ర-కరతా పుశ్పార్చనే విశ్ణుతా
గన్ధే గన్ధ-వహాత్మతా(అ)న్న-పచనే బహిర్-ముఖాధ్యక్శతా
పాత్రే కాన్చన-గర్భతాస్తి మయి చేద్ బాలేన్దు చూడా-మణే
శుశ్రూశాం కరవాణి తే పశు-పతే స్వామిన్ త్రి-లోకీ-గురో ౩౦
నాలం వా పరమోపకారకమ్-ఇదం త్వేకం పశూనాం పతే
పశ్యన్ కుక్శి-గతాన్ చరాచర-గణాన్ బాహ్యస్థితాన్ రక్శితుమ్
సర్వామర్త్య-పలాయనౌశధమ్-అతి-జ్వాలా-కరం భీ-కరం
నిక్శిప్తం గరలం గలే న గలితం నోద్గీర్ణమ్-ఏవ-త్వయా ౩౧
జ్వాలోగ్రః సకలామరాతి-భయదః క్శ్వేలః కథం వా త్వయా
దృశ్టః కిం చ కరే ధృతః కర-తలే కిం పక్వ-జమ్బూ-ఫలమ్
జిహ్వాయాం నిహితశ్చ సిద్ధ-ఘుటికా వా కణ్ఠ-దేశే భృతః
కిం తే నీల-మణిర్-విభూశణమ్-అయం శమ్భో మహాత్మన్ వద ౩౨
నాలం వా సకృద్-ఏవ దేవ భవతః సేవా నతిర్-వా నుతిః
పూజా వా స్మరణం కథా-శ్రవణమ్-అపి-ఆలోకనం మాదృశామ్
స్వామిన్న్-అస్థిర-దేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కా వా ముక్తిర్-ఇతః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా ౩౩
కిం బ్రూమస్-తవ సాహసం పశు-పతే కస్యాస్తి శమ్భో భవద్-
ధైర్యం చేదృశమ్-ఆత్మనః-స్థితిర్-ఇయం చాన్యైః కథం లభ్యతే
భ్రశ్యద్-దేవ-గణం త్రసన్-ముని-గణం నశ్యత్-ప్రపన్చం లయం
పశ్యన్-నిర్భయ ఏక ఏవ విహరతి-ఆనన్ద-సాన్ద్రో భవాన్ ౩౪
యోగ-క్శేమ-ధురం-ధరస్య సకలః-శ్రేయః ప్రదోద్యోగినో
దృశ్టాదృశ్ట-మతోపదేశ-కృతినో బాహ్యాన్తర-వ్యాపినః
సర్వజ్నస్య దయా-కరస్య భవతః కిం వేదితవ్యం మయా
శమ్భో త్వం పరమాన్తరఙ్గ ఇతి మే చిత్తే స్మరామి-అన్వహమ్ ౩౫
భక్తో భక్తి-గుణావృతే ముద్-అమృతా-పూర్ణే ప్రసన్నే మనః
కుమ్భే సామ్బ తవాన్ఘ్రి-పల్లవ యుగం సంస్థాప్య సంవిత్-ఫలమ్
సత్త్వం మన్త్రమ్-ఉదీరయన్-నిజ శరీరాగార శుద్ధిం వహన్
పుణ్యాహం ప్రకటీ కరోమి రుచిరం కల్యాణమ్-ఆపాదయన్ ౩౬
ఆమ్నాయామ్బుధిమ్-ఆదరేణ సుమనః-సన్ఘాః-సముద్యన్-మనో
మన్థానం దృఢ భక్తి-రజ్జు-సహితం కృత్వా మథిత్వా తతః
సోమం కల్ప-తరుం సు-పర్వ-సురభిం చిన్తా-మణిం ధీమతాం
నిత్యానన్ద-సుధాం నిరన్తర-రమా-సౌభాగ్యమ్-ఆతన్వతే ౩౭
ప్రాక్-పుణ్యాచల-మార్గ-దర్శిత-సుధా-మూర్తిః ప్రసన్నః-శివః
సోమః-సద్-గుణ-సేవితో మృగ-ధరః పూర్ణాస్-తమో-మోచకః
చేతః పుశ్కర-లక్శితో భవతి చేద్-ఆనన్ద-పాథో-నిధిః
ప్రాగల్భ్యేన విజృమ్భతే సుమనసాం వృత్తిస్-తదా జాయతే ౩౮
ధర్మో మే చతుర్-అన్ఘ్రికః సుచరితః పాపం వినాశం గతం
కామ-క్రోధ-మదాదయో విగలితాః కాలాః సుఖావిశ్కృతాః
జ్నానానన్ద-మహౌశధిః సుఫలితా కైవల్య నాథే సదా
మాన్యే మానస-పుణ్డరీక-నగరే రాజావతంసే స్థితే ౩౯
ధీ-యన్త్రేణ వచో-ఘటేన కవితా-కుల్యోపకుల్యాక్రమైర్-
ఆనీతైశ్చ సదాశివస్య చరితామ్భో-రాశి-దివ్యామృతైః
హృత్-కేదార-యుతాశ్-చ భక్తి-కలమాః సాఫల్యమ్-ఆతన్వతే
దుర్భిక్శాన్-మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః ౪౦
పాపోత్పాత-విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుం-జయ
స్తోత్ర-ధ్యాన-నతి-ప్రదిక్శిణ-సపర్యాలోకనాకర్ణనే
జిహ్వా-చిత్త-శిరోన్ఘ్రి-హస్త-నయన-శ్రోత్రైర్-అహమ్ ప్రార్థితో
మామ్-ఆజ్నాపయ తన్-నిరూపయ ముహుర్-మామేవ మా మే(అ)వచః ౪౧
గామ్భీర్యం పరిఖా-పదం ఘన-ధృతిః ప్రాకార-ఉద్యద్-గుణ
స్తోమశ్-చాప్త-బలం ఘనేన్ద్రియ-చయో ద్వారాణి దేహే స్థితః
విద్యా-వస్తు-సమృద్ధిర్-ఇతి-అఖిల-సామగ్రీ-సమేతే సదా
దుర్గాతి-ప్రియ-దేవ మామక-మనో-దుర్గే నివాసం కురు ౪౨
మా గచ్చ త్వమ్-ఇతస్-తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు
స్వామిన్న్-ఆది కిరాత మామక-మనః కాన్తార-సీమాన్తరే
వర్తన్తే బహుశో మృగా మద-జుశో మాత్సర్య-మోహాదయస్-
తాన్ హత్వా మృగయా-వినోద రుచితా-లాభం చ సమ్ప్రాప్స్యసి ౪౩
కర-లగ్న మృగః కరీన్ద్ర-భన్గో
ఘన శార్దూల-విఖణ్డనో(అ)స్త-జన్తుః
గిరిశో విశద్-ఆకృతిశ్-చ చేతః
కుహరే పన్చ ముఖోస్తి మే కుతో భీః ౪౪
చన్దః-శాఖి-శిఖాన్వితైర్-ద్విజ-వరైః సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేద-భేదిని సుధా-సారైః ఫలైర్-దీపితే
చేతః పక్శి-శిఖా-మణే త్యజ వృథా-సన్చారమ్-అన్యైర్-అలం
నిత్యం శన్కర-పాద-పద్మ-యుగలీ-నీడే విహారం కురు ౪౫
ఆకీర్ణే నఖ-రాజి-కాన్తి-విభవైర్-ఉద్యత్-సుధా-వైభవైర్-
ఆధౌతేపి చ పద్మ-రాగ-లలితే హంస-వ్రజైర్-ఆశ్రితే
నిత్యం భక్తి-వధూ గణైశ్-చ రహసి స్వేచ్చా-విహారం కురు
స్థిత్వా మానస-రాజ-హంస గిరిజా నాథాన్ఘ్రి-సౌధాన్తరే ౪౬
శమ్భు-ధ్యాన-వసన్త-సన్గిని హృదారామే(అ)ఘ-జీర్ణచ్చదాః
స్రస్తా భక్తి లతాచ్చటా విలసితాః పుణ్య-ప్రవాల-శ్రితాః
దీప్యన్తే గుణ-కోరకా జప-వచః పుశ్పాణి సద్-వాసనా
జ్నానానన్ద-సుధా-మరన్ద-లహరీ సంవిత్-ఫలాభ్యున్నతిః ౪౭
నిత్యానన్ద-రసాలయం సుర-ముని-స్వాన్తామ్బుజాతాశ్రయం
స్వచ్చం సద్-ద్విజ-సేవితం కలుశ-హృత్-సద్-వాసనావిశ్కృతమ్
శమ్భు-ధ్యాన-సరోవరం వ్రజ మనో-హంసావతంస స్థిరం
కిం క్శుద్రాశ్రయ-పల్వల-భ్రమణ-సఞ్జాత-శ్రమం ప్రాప్స్యసి ౪౮
ఆనన్దామృత-పూరితా హర-పదామ్భోజాలవాలోద్యతా
స్థైర్యోపఘ్నమ్-ఉపేత్య భక్తి లతికా శాఖోపశాఖాన్వితా
ఉచ్చైర్-మానస-కాయమాన-పటలీమ్-ఆక్రమ్య నిశ్-కల్మశా
నిత్యాభీశ్ట-ఫల-ప్రదా భవతు మే సత్-కర్మ-సంవర్ధితా ౪౯
సన్ధ్యారమ్భ-విజృమ్భితం శ్రుతి-శిర-స్థానాన్తర్-ఆధిశ్ఠితం
స-ప్రేమ భ్రమరాభిరామమ్-అసకృత్ సద్-వాసనా-శోభితమ్
భోగీన్ద్రాభరణం సమస్త-సుమనః-పూజ్యం గుణావిశ్కృతం
సేవే శ్రీ-గిరి-మల్లికార్జున-మహా-లిన్గం శివాలిన్గితమ్ ౫౦
భృన్గీచ్చా-నటనోత్కటః కరి-మద-గ్రాహీ స్ఫురన్-మాధవ-
ఆహ్లాదో నాద-యుతో మహాసిత-వపుః పన్చేశుణా చాదృతః
సత్-పక్శః సుమనో-వనేశు స పునః సాక్శాన్-మదీయే మనో
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీ శైల-వాసీ విభుః ౫౧
కారుణ్యామృత-వర్శిణం ఘన-విపద్-గ్రీశ్మచ్చిదా-కర్మఠం
విద్యా-సస్య-ఫలోదయాయ సుమనః-సంసేవ్యమ్-ఇచ్చాకృతిమ్
నృత్యద్-భక్త-మయూరమ్-అద్రి-నిలయం చన్చజ్-జటా-మణ్డలం
శమ్భో వాన్చతి నీల-కన్ధర-సదా త్వాం మే మనశ్-చాతకః ౫౨
ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రా కలాపీ నతా-
(అ)నుగ్రాహి-ప్రణవోపదేశ-నినదైః కేకీతి యో గీయతే
శ్యామాం శైల-సముద్భవాం ఘన-రుచిం దృశ్ట్వా నటన్తం ముదా
వేదాన్తోపవనే విహార-రసికం తం నీల-కణ్ఠం భజే ౫౩
సన్ధ్యా ఘర్మ-దినాత్యయో హరి-కరాఘాత-ప్రభూతానక-
ధ్వానో వారిద గర్జితం దివిశదాం దృశ్టిచ్చటా చన్చలా
భక్తానాం పరితోశ బాశ్ప వితతిర్-వృశ్టిర్-మయూరీ శివా
యస్మిన్న్-ఉజ్జ్వల-తాణ్డవం విజయతే తం నీల-కణ్ఠం భజే ౫౪
ఆద్యాయామిత-తేజసే-శ్రుతి-పదైర్-వేద్యాయ సాధ్యాయ తే
విద్యానన్ద-మయాత్మనే త్రి-జగతః-సంరక్శణోద్యోగినే
ధ్యేయాయాఖిల-యోగిభిః-సుర-గణైర్-గేయాయ మాయావినే
సమ్యక్ తాణ్డవ-సమ్భ్రమాయ జటినే సేయం నతిః-శమ్భవే ౫౫
నిత్యాయ త్రి-గుణాత్మనే పుర-జితే కాత్యాయనీ-శ్రేయసే
సత్యాయాది కుటుమ్బినే ముని-మనః ప్రత్యక్శ-చిన్-మూర్తయే
మాయా-సృశ్ట-జగత్-త్రయాయ సకల-ఆమ్నాయాన్త-సన్చారిణే
సాయం తాణ్డవ-సమ్భ్రమాయ జటినే సేయం నతిః-శమ్భవే ౫౬
నిత్యం స్వోదర-పోశణాయ సకలాన్-ఉద్దిశ్య విత్తాశయా
వ్యర్థం పర్యటనం కరోమి భవతః-సేవాం న జానే విభో
మజ్-జన్మాన్తర-పుణ్య-పాక-బలతస్-త్వం శర్వ సర్వాన్తరస్-
తిశ్ఠస్యేవ హి తేన వా పశు-పతే తే రక్శణీయో(అ)స్మ్యహమ్ ౫౭
ఏకో వారిజ-బాన్ధవః క్శితి-నభో వ్యాప్తం తమో-మణ్డలం
భిత్వా లోచన-గోచరోపి భవతి త్వం కోటి-సూర్య-ప్రభః
వేద్యః కిం న భవస్యహో ఘన-తరం కీదృన్గ్భవేన్-మత్తమస్-
తత్-సర్వం వ్యపనీయ మే పశు-పతే సాక్శాత్ ప్రసన్నో భవ ౫౮
హంసః పద్మ-వనం సమిచ్చతి యథా నీలామ్బుదం చాతకః
కోకః కోక-నద-ప్రియం ప్రతి-దినం చన్ద్రం చకోరస్-తథా
చేతో వాన్చతి మామకం పశు-పతే చిన్-మార్గ మృగ్యం విభో
గౌరీ నాథ భవత్-పదాబ్జ-యుగలం కైవల్య-సౌఖ్య-ప్రదమ్ ౫౯
రోధస్-తోయహృతః శ్రమేణ-పథికశ్-చాయాం తరోర్-వృశ్టితః
భీతః స్వస్థ గృహం గృహస్థమ్-అతిథిర్-దీనః ప్రభం ధార్మికమ్
దీపం సన్తమసాకులశ్-చ శిఖినం శీతావృతస్-త్వం తథా
చేతః-సర్వ-భయాపహం-వ్రజ సుఖం శమ్భోః పదామ్భోరుహమ్ ౬౦
అన్కోలం నిజ బీజ సన్తతిర్-అయస్కాన్తోపలం సూచికా
సాధ్వీ నైజ విభుం లతా క్శితి-రుహం సిన్ధుహ్-సరిద్-వల్లభమ్
ప్రాప్నోతీహ యథా తథా పశు-పతేః పాదారవిన్ద-ద్వయం
చేతోవృత్తిర్-ఉపేత్య తిశ్ఠతి సదా సా భక్తిర్-ఇతి-ఉచ్యతే ౬౧
ఆనన్దాశ్రుభిర్-ఆతనోతి పులకం నైర్మల్యతశ్-చాదనం
వాచా శన్ఖ ముఖే స్థితైశ్-చ జఠరా-పూర్తిం చరిత్రామృతైః
రుద్రాక్శైర్-భసితేన దేవ వపుశో రక్శాం భవద్-భావనా-
పర్యన్కే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్శతి ౬౨
మార్గా-వర్తిత పాదుకా పశు-పతేర్-అఙ్గస్య కూర్చాయతే
గణ్డూశామ్బు-నిశేచనం పుర-రిపోర్-దివ్యాభిశేకాయతే
కిన్చిద్-భక్శిత-మాంస-శేశ-కబలం నవ్యోపహారాయతే
భక్తిః కిం న కరోతి-అహో వన-చరో భక్తావతమ్సాయతే ౬౩
వక్శస్తాడనమ్-అన్తకస్య కఠినాపస్మార సమ్మర్దనం
భూ-భృత్-పర్యటనం నమత్-సుర-శిరః-కోటీర సన్ఘర్శణమ్
కర్మేదం మృదులస్య తావక-పద-ద్వన్ద్వస్య గౌరీ-పతే
మచ్చేతో-మణి-పాదుకా-విహరణం శమ్భో సదాన్గీ-కురు ౬౪
వక్శస్-తాడన శన్కయా విచలితో వైవస్వతో నిర్జరాః
కోటీరోజ్జ్వల-రత్న-దీప-కలికా-నీరాజనం కుర్వతే
దృశ్ట్వా ముక్తి-వధూస్-తనోతి నిభృతాశ్లేశం భవానీ-పతే
యచ్-చేతస్-తవ పాద-పద్మ-భజనం తస్యేహ కిం దుర్-లభమ్ ౬౫
క్రీడార్థం సృజసి ప్రపన్చమ్-అఖిలం క్రీడా-మృగాస్-తే జనాః
యత్-కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్
శమ్భో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేశ్టితం నిశ్చితం
తస్మాన్-మామక రక్శణం పశు-పతే కర్తవ్యమ్-ఏవ త్వయా ౬౬
బహు-విధ-పరితోశ-బాశ్ప-పూర-
స్ఫుట-పులకాన్కిత-చారు-భోగ-భూమిమ్
చిర-పద-ఫల-కాన్క్శి-సేవ్యమానాం
పరమ సదాశివ-భావనాం ప్రపద్యే ౬౭
అమిత-ముదమృతం ముహుర్-దుహన్తీం
విమల-భవత్-పద-గోశ్ఠమ్-ఆవసన్తీమ్
సదయ పశు-పతే సుపుణ్య-పాకాం
మమ పరిపాలయ భక్తి ధేనుమ్-ఏకామ్ ౬౮
జడతా పశుతా కలన్కితా
కుటిల-చరత్వం చ నాస్తి మయి దేవ
అస్తి యది రాజ-మౌలే
భవద్-ఆభరణస్య నాస్మి కిం పాత్రమ్ ౬౯
అరహసి రహసి స్వతన్త్ర-బుద్ధ్యా
వరి-వసితుం సులభః ప్రసన్న-మూర్తిః
అగణిత ఫల-దాయకః ప్రభుర్-మే
జగద్-అధికో హృది రాజ-శేఖరోస్తి ౭౦
ఆరూఢ-భక్తి-గుణ-కున్చిత-భావ-చాప-
యుక్తైః-శివ-స్మరణ-బాణ-గణైర్-అమోఘైః
నిర్జిత్య కిల్బిశ-రిపూన్ విజయీ సుధీన్ద్రః-
సానన్దమ్-ఆవహతి సుస్థిర-రాజ-లక్శ్మీమ్ ౭౧
ధ్యానాన్జనేన సమవేక్శ్య తమః-ప్రదేశం
భిత్వా మహా-బలిభిర్-ఈశ్వర నామ-మన్త్రైః
దివ్యాశ్రితం భుజగ-భూశణమ్-ఉద్వహన్తి
యే పాద-పద్మమ్-ఇహ తే శివ తే కృతార్థాః ౭౨
భూ-దారతామ్-ఉదవహద్-యద్-అపేక్శయా శ్రీ-
భూ-దార ఏవ కిమతః సుమతే లభస్వ
కేదారమ్-ఆకలిత ముక్తి మహౌశధీనాం
పాదారవిన్ద భజనం పరమేశ్వరస్య ౭౩
ఆశా-పాశ-క్లేశ-దుర్-వాసనాది-
భేదోద్యుక్తైర్-దివ్య-గన్ధైర్-అమన్దైః
ఆశా-శాటీకస్య పాదారవిన్దం
చేతః-పేటీం వాసితాం మే తనోతు ౭౪
కల్యాణినం సరస-చిత్ర-గతిం సవేగం
సర్వేన్గితజ్నమ్-అనఘం ధ్రువ-లక్శణాఢ్యమ్
చేతస్-తురన్గమ్-అధిరుహ్య చర స్మరారే
నేతః-సమస్త జగతాం వృశభాధిరూఢ ౭౫
భక్తిర్-మహేశ-పద-పుశ్కరమ్-ఆవసన్తీ
కాదమ్బినీవ కురుతే పరితోశ-వర్శమ్
సమ్పూరితో భవతి యస్య మనస్-తటాకస్-
తజ్-జన్మ-సస్యమ్-అఖిలం సఫలం చ నాన్యత్ ౭౬
బుద్ధిః-స్థిరా భవితుమ్-ఈశ్వర-పాద-పద్మ
సక్తా వధూర్-విరహిణీవ సదా స్మరన్తీ
సద్-భావనా-స్మరణ-దర్శన-కీర్తనాది
సమ్మోహితేవ శివ-మన్త్ర-జపేన విన్తే ౭౭
సద్-ఉపచార-విధిశు-అను-బోధితాం
సవినయాం సుహృదం సదుపాశ్రితామ్
మమ సముద్ధర బుద్ధిమ్-ఇమాం ప్రభో
వర-గుణేన నవోఢ-వధూమ్-ఇవ ౭౮
నిత్యం యోగి-మనహ్-సరోజ-దల-సన్చార-క్శమస్-త్వత్-క్రమః-
శమ్భో తేన కథం కఠోర-యమ-రాడ్-వక్శః-కవాట-క్శతిః
అత్యన్తం మృదులం త్వద్-అన్ఘ్రి-యుగలం హా మే మనశ్-చిన్తయతి-
ఏతల్-లోచన-గోచరం కురు విభో హస్తేన సంవాహయే ౭౯
ఏశ్యత్యేశ జనిం మనో(అ)స్య కఠినం తస్మిన్-నటానీతి మద్-
రక్శాయై గిరి సీమ్ని కోమల-పద-న్యాసః పురాభ్యాసితః
నో-చేద్-దివ్య-గృహాన్తరేశు సుమనస్-తల్పేశు వేద్యాదిశు
ప్రాయః-సత్సు శిలా-తలేశు నటనం శమ్భో కిమర్థం తవ ౮౦
కన్చిత్-కాలమ్-ఉమా-మహేశ భవతః పాదారవిన్దార్చనైః
కన్చిద్-ధ్యాన-సమాధిభిశ్-చ నతిభిః కన్చిత్ కథాకర్ణనైః
కన్చిత్ కన్చిద్-అవేక్శణైశ్-చ నుతిభిః కన్చిద్-దశామ్-ఈదృశీం
యః ప్రాప్నోతి ముదా త్వద్-అర్పిత మనా జీవన్ స ముక్తః ఖలు ౮౧
బాణత్వం వృశభత్వమ్-అర్ధ-వపుశా భార్యాత్వమ్-ఆర్యా-పతే
ఘోణిత్వం సఖితా మృదన్గ వహతా చేత్యాది రూపం దధౌ
త్వత్-పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్-దేహ భాగో హరిః
పూజ్యాత్-పూజ్య-తరః-స ఏవ హి న చేత్ కో వా తదన్యో(అ)ధికః ౮౨
జనన-మృతి-యుతానాం సేవయా దేవతానాం
న భవతి సుఖ-లేశః సంశయో నాస్తి తత్ర
అజనిమ్-అమృత రూపం సామ్బమ్-ఈశం భజన్తే
య ఇహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభన్తే ౮౩
శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా
భవ మమ గుణ-ధుర్యాం బుద్ధి-కన్యాం ప్రదాస్యే
సకల-భువన-బన్ధో సచ్చిద్-ఆనన్ద-సిన్ధో
సదయ హృదయ-గేహే సర్వదా సంవస త్వమ్ ౮౪
జలధి మథన దక్శో నైవ పాతాల భేదీ
న చ వన మృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః
అశన-కుసుమ-భూశా-వస్త్ర-ముఖ్యాం సపర్యాం
కథయ కథమ్-అహం తే కల్పయానీన్దు-మౌలే ౮౫
పూజా-ద్రవ్య-సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే
పక్శిత్వం న చ వా కీటిత్వమ్-అపి న ప్రాప్తం మయా దుర్-లభమ్
జానే మస్తకమ్-అన్ఘ్రి-పల్లవమ్-ఉమా-జానే న తే(అ)హం విభో
న జ్నాతం హి పితామహేన హరిణా తత్త్వేన తద్-రూపిణా ౮౬
అశనం గరలం ఫణీ కలాపో
వసనం చర్మ చ వాహనం మహోక్శః
మమ దాస్యసి కిం కిమ్-అస్తి శమ్భో
తవ పాదామ్బుజ-భక్తిమ్-ఏవ దేహి ౮౭
యదా కృతామ్భో-నిధి-సేతు-బన్ధనః
కరస్థ-లాధః-కృత-పర్వతాధిపః
భవాని తే లన్ఘిత-పద్మ-సమ్భవస్-
తదా శివార్చా-స్తవ భావన-క్శమః ౮౮
నతిభిర్-నుతిభిస్-త్వమ్-ఈశ పూజా
విధిభిర్-ధ్యాన-సమాధిభిర్-న తుశ్టః
ధనుశా ముసలేన చాశ్మభిర్-వా
వద తే ప్రీతి-కరం తథా కరోమి ౮౯
వచసా చరితం వదామి శమ్భోర్-
అహమ్-ఉద్యోగ విధాసు తే(అ)ప్రసక్తః
మనసాకృతిమ్-ఈశ్వరస్య సేవే
శిరసా చైవ సదాశివం నమామి ౯౦
ఆద్యా(అ)విద్యా హృద్-గతా నిర్గతాసీత్-
విద్యా హృద్యా హృద్-గతా త్వత్-ప్రసాదాత్
సేవే నిత్యం శ్రీ-కరం త్వత్-పదాబ్జం
భావే ముక్తేర్-భాజనం రాజ-మౌలే ౯౧
దూరీకృతాని దురితాని దురక్శరాణి
దౌర్-భాగ్య-దుఃఖ-దురహఙ్కృతి-దుర్-వచాంసి
సారం త్వదీయ చరితం నితరాం పిబన్తం
గౌరీశ మామ్-ఇహ సముద్ధర సత్-కటాక్శైః ౯౨
సోమ కలా-ధర-మౌలౌ
కోమల ఘన-కన్ధరే మహా-మహసి
స్వామిని గిరిజా నాథే
మామక హృదయం నిరన్తరం రమతామ్ ౯౩
సా రసనా తే నయనే
తావేవ కరౌ స ఏవ కృత-కృత్యః
యా యే యౌ యో భర్గం
వదతీక్శేతే సదార్చతః స్మరతి ౯౪
అతి మృదులౌ మమ చరణౌ-
అతి కఠినం తే మనో భవానీశ
ఇతి విచికిత్సాం సన్త్యజ
శివ కథమ్-ఆసీద్-గిరౌ తథా ప్రవేశః ౯౫
ధైయాన్కుశేన నిభృతం
రభసాద్-ఆకృశ్య భక్తి-శృన్ఖలయా
పుర-హర చరణాలానే
హృదయ-మదేభం బధాన చిద్-యన్త్రైః ౯౬
ప్రచరత్యభితః ప్రగల్భ-వృత్త్యా
మదవాన్-ఏశ మనః-కరీ గరీయాన్
పరిగృహ్య నయేన భక్తి-రజ్జ్వా
పరమ స్థాణు-పదం దృఢం నయాముమ్ ౯౭
సర్వాలన్కార-యుక్తాం సరల-పద-యుతాం సాధు-వృత్తాం సువర్ణాం
సద్భిః-సమ్స్తూయ-మానాం సరస గుణ-యుతాం లక్శితాం లక్శణాఢ్యామ్
ఉద్యద్-భూశా-విశేశామ్-ఉపగత-వినయాం ద్యోత-మానార్థ-రేఖాం
కల్యాణీం దేవ గౌరీ-ప్రియ మమ కవితా-కన్యకాం త్వం గృహాణ ౯౮
ఇదం తే యుక్తం వా పరమ-శివ కారుణ్య జలధే
గతౌ తిర్యగ్-రూపం తవ పద-శిరో-దర్శన-ధియా
హరి-బ్రహ్మాణౌ తౌ దివి భువి చరన్తౌ శ్రమ-యుతౌ
కథం శమ్భో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః ౯౯
స్తోత్రేణాలమ్-అహం ప్రవచ్మి న మృశా దేవా విరిన్చాదయః
స్తుత్యానాం గణనా-ప్రసన్గ-సమయే త్వామ్-అగ్రగణ్యం విదుః
మాహాత్మ్యాగ్ర-విచారణ-ప్రకరణే ధానా-తుశస్తోమవద్-ధూతాస్-త్వాం విదుర్-ఉత్తమోత్తమ ఫలం శమ్భో భవత్-సేవకాః ౧౦౦


శివానందలహరి యూట్యూబ్ వీడియో లింక్లు 

శోథన ఫలితాలు



Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.