దీపావళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దీపావళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, నవంబర్ 2021, గురువారం

దీపావళి అంటే ఏమిటి దీపావళి అమావాస్య రోజు మాత్రమే మంత్రసిద్ధి కలిగే ఈ మహా మంత్రములు తెలుసుకోండి

wowitstelugu.blogspot.com
దీపావళి అంటే ఏమిటి దీపావళి అమావాస్య రోజు మాత్రమే మంత్రసిద్ధి కలిగే ఈ మహా మంత్రములు తెలుసుకోండి

దీపావళి అంటే దీపాల వరుస. దీపాలతో ప్రపంచాన్ని జ్ఞానం తో వెలిగించలన్నది దీని పరమార్ధం. రాత్రిపూట ఆకాశంలోని నక్షత్రాలు మనకు ఎలా చిన్న దీపాల్లా కనిపిస్తాయో, మన గ్రామాల్లోని వీధుల్లో చూస్తే భూమిపై ఉండే జ్యోతులు కూడా ఆకాశంలోని చుక్కల్లా కనిపిస్తాయి. ఇందులో వైజ్ఞానిక సత్యంతో పాటు ఓ ఆధ్యాత్మిక సందేశం ఉందని భావించవచ్చు. విశ్వంలో ఉన్నది మనలో ఉంది, మనలో ఉన్నది విశ్వంలో ఉందని ఈ దీపాలు సందేశాన్నిస్తున్నాయి.

ఉపనిషత్తులు ‘పద్మకోశప్రతీకాశం’ అని అన్నాయి. శంకరభాష్యంలో దీనికి వివరణ ఉంది. ప్రతి జీవి గుండెలోనూ ఓ దీపం తలకిందులుగా వేలాడే తామర మొగ్గలా ఉంటుంది. అలాంటి దీపాలే ఈ మొగ్గలోని ప్రతి రేకులో ఒకటి వంతున సూక్ష్మరూపంలో ఉన్నాయి పద్మం మధ్యభాగంలో మూల దీపం ఉంది.

‘తస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్థ్వా వ్యవస్థితా’ అని వేదాలు చెబుతున్నాయి. ఈ దీపం దేహానికి అవసరమైన వేడిని, రక్తానికి సారాన్ని ఇస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తోంది. అదే మన జీవన దీపం.

మన పురాణాల ప్రకారం నరకాసుర వధ జరిగిన రోజున దీపావళి అని చెబుతారు. హిరణ్యాక్షుడి బారి నుంచి భూమిని రక్షించడానికి విష్ణువు వరాహవాతారంలో వచ్చినప్పుడు పుట్టినవాడు నరకాసురుడు. అతను సత్య, త్రేత, ద్వాపర అనే మూడు యుగాల్లోనూ ఉన్నట్లు చెబుతారు. మరి ఇంత కాలం అతనెందుకు ఉన్నాడు.. అతన్ని చంపడం కోసం కృష్ణుడెందుకు వేచి ఉండాల్సివచ్చిందనే దానికి సమాధానం కాల మహిమ అని చెబుతారు.

రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్బంగా దీపావళి జరుపు కోవాటం, నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూరం - జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు.

దీపం పెట్టాలంటే వత్తి, చమురు, ప్రమిద, ఆరిపోకుండా ఓ పారదర్శక రక్షణ కవచం అవసరం. అలాగే మనలో జ్ఞానజ్యోతి వెలగాలంటే చమురు మన భక్తి. అది జ్వలించడానికి అవసరమైన వాయువు భగవంతుడి కోసం మనం పడే తపన. ఆశ, ద్వేషాలనే పొగ, మసి మనస్సుకు పట్టకుండా చేసే రక్షణ కవచం మన ఏకాగ్రత. బ్రహ్మచర్యం, వైరాగ్యం, ఆత్మ సంయమనం, సాధారణ జీవనం అనేవి దీపంలో వేసే వత్తులు. ఈ ఉపకరణాల సాయంతో వచ్చే వెలుగులో మనస్సు స్థిరమైన ధ్యానంలో కుదురుకుంటుంది. అనంతానందదాన్ని పొందుతుంది. అలా జ్ఞాన జ్యోతులను ప్రజ్వలింపజేయడమే దీపావళి.

*దీపాగ్రే వర్తతే విష్ణు: దీప మధ్యే మహేశ్వర: దీపాంతే చ తదా బ్రహ్మ దీపం త్రైమూర్తికం విదు:!!*

తాత్పర్యం:-

దీపం అగ్ర భాగం విష్ణువు, మధ్య భాగం మహేశ్వరుడు, దీపం కింది భాగాన బ్రహ్మ కొలువై ఉన్నారు. దీపం త్రిమూర్తిమయం. దీప ప్రజ్వలన త్రిమూర్తి ఆరాధన.


*దీపాగ్రే వర్తతే లక్ష్మీ దీప మధ్యేచ పార్వతీ దీపాంతే శారదా ప్రోక్త దీపం శక్తి మయం విదు:!!*

తాత్పర్యం:-

దీపం అగ్ర భాగం లక్ష్మీ, మధ్య భాగం పార్వతీ, దీపం కింది భాగాన సరస్వతి కొలువై ఉన్నారు. దీపం త్రిశక్తి మయం. దీప ప్రజ్వలన త్రిమాతల ఆరాధన.

దీపావళి అమావాస్య రోజు మాత్రమే మంత్రసిద్ధి కలిగే ఈ మహా మంత్రములు సాధన చేసి అద్భుత ఫలితములు పొందండి

దీపావళిరోజు సాయంకాలం లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం వద్ద ఆవునెయ్యి దీపం వెలిగించాలి. మంత్రసాధనకు ముందు మీకు నాలుగు దిక్కులా నెయ్యి దీపాలను వెలిగించుకోవాలి , మీకు అవసరమయిన మంత్రాన్ని 11 మాలలు అంటే 11 X 108 సార్లు పఠించాలి.

● మహాలక్ష్మి అనుగ్రహం కొరకు

ఓం హ్రీం శ్రియం దేహి మహాలక్ష్మి ఆగచ్ఛ స్వాహా

● కుబేర అనుగ్రహం కొరకు

ఓం హ్రీం శ్రీమ్ నమో భగవతే ధనం దేహి దేహి ఓం

● ఆకస్మిక ధనప్రాప్తికి

ఓం హ్రీం శ్రీమ్ హ్రీం నమః

● నూతన గృహప్రాప్తికి లేక స్థలము ప్రాప్తికి

ఓం హ్రీం వసుధాలక్ష్మియే నమః

● శత్రునివారణకు

ఓం క్లీం కాళీ శతృశమనం కురు కురు ఫట్

● విద్యాభివృద్ధికి
ఓం ఐ0 క్రీమ్ ఐ0 ఓం

● అన్నపూర్ణ అనుగ్రహం కొరకు

ఓం హ్రీం శ్రీమ్ క్లీం అన్నపూర్ణే స్వాహా

● దీర్ఘాయుష్ష్ మరియు అనారోగ్య నివారణ

ఓం ఐమ్ దీర్ఘాయుష్యం సిద్ధయే ఓం నమః

● సత్సంతాన ప్రాప్తి కొరకు

ఓం నమో భగవతే పుత్ర సుఖం సాధయ కురు కురు నమః

● ప్రమాదాలు జరుగకుండా ఉండుటకు

ఓం క్రీమ్ కాళికే హ్రూం ఫట్ స్వాహా

● ఉద్యోగప్రాప్తి కొరకు

ఓం హ్రీం కార్యసిద్ధిం ఓం నమః

● ధనప్రాప్తి కొరకు

ఓం శ్రీమ్ శ్రీమ్ మహాధనం దేహి ఓం నమః

● కీర్తి ప్రతిష్టలు

ఓం ఐ0 కీర్తి వృద్ధిం దేహి దేహి ఓం

● కోపం తగ్గుటకు

ఓం క్రీమ్ క్రోధం సంహారయ వస్య ఓం ఫట్

● వ్యాపార ఆకర్షణకు

ఓం శ్రీమ్ ఇం శ్రీయం సాధయ ఫట్

● భార్యాభర్తల అనురాగముకు

ఓం హ్రీం మొహితే ఆకర్షయ నమః స్వాహా

● కోర్టు కేసులలో విజయం కొరకు

ఓం హ్రూం శత్రూన్ వశ్య విజయ సిద్ధిం ఓం ఫట్

● జీవితములో కష్టములు తొలగుటకు

ఓం క్లీం శ్రీమ్ శ్రీయహ్ స్వాహా

● శ్రీఘ్ర వివాహం కొరకు

ఓం క్లీం వివాహ సిద్ధిం ఓం ఐ0 ఫట్

● నిత్య సుమంగళి గా ఉండుటకు

ఓం శ్రీమ్ సౌభాగ్యం సుమంగళాయ ఫట్

దీపావళి అంటే ఏమిటి ఆ రోజు చేసే పూజలు ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. లో తెలుసుకోండి



ఈ రోజు సూక్తి:

"Find out what you like doing best, and get someone to pay you for doing it."
- Katherine Whitehorn

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com



14, నవంబర్ 2020, శనివారం

దీపావళి అంటే ఏమిటి దాని విశిష్టత దీపావళి నాడు లక్ష్మీ దేవి పూజ ఎలా చేస్తారు

wowitstelugu.blogspot.com

దీపావళి అంటే ఏమిటి దాని విశిష్టత దీపావళి నాడు లక్ష్మీ దేవి పూజ ఎలా చేస్తారు


దీపావళి దీపాల వరుస అంటే సంతోషం సందడి సంబరం.

ఈ రోజున ఉదయం వేళలో ఇళ్లన్నీ పసుపు గడపలతో మామిడి తోరణాలతో కళకళలాడుతూ కనిపిస్తాయి.

ఇక చీకటిపడే సరికి అందరి ఇళ్లలోనూ అనేక దీపాలు పసిడి వెలుగులను విరజిమ్ముతుంటాయి. ఈ వెలుగులకు భయపడిన చీకటి ఎక్కడా దాచుకోవడానికి చోటులేకపోవడంతో పొలిమేరలు దాటి పారిపోతుంది.

చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ వుంటారు. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది.

భారతీయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో 'దీపావళి' ఒకటి. దీనిని రెండు రోజుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఆశ్వీయుజ మాస బహుళ చతుర్థశి నరక చతుర్థశిగాను, అమావాస్యను దీపావళి పుణ్యదినంగా భావించి ఆరోజు శ్రీ మహాలక్ష్మీపూజ జరిపి, రాక్షసుల బాధలు తొలగిన ఆనందాన్ని వ్యక్తపరచుటకై దీపాలంకరణలు చేసి బాణాసంచా కాలుస్తారు.


దీపావళి పురాణ గాథ :

  • శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకీ ... భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణంలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ... ఇటు మానవులను నానాబాధలు పెట్టసాగాడు.
  • ఈ విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి, సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళతాడు. సతీసమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు, ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది.
  • ఇక పురాణ సంబంధమైన కథ ఇలా వుంటే, ధర్మ శాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెబుతోంది. దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం. తారాజువ్వాలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటోంది.
  • పూర్వం దూర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిధ్యానికి సంతసించిన వాడై; ఒక మహిమాన్వితమైన ఒక హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో, తనవద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్‌ఫలితంగా రాజ్యాధిపత్యం కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు.
  • దానికి తృప్తి చెందిన లక్ష్మీ అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొంది దుర్వాసుని పాదాలపై పడతాడు. అనంతరం మహాలక్ష్మీతో! తల్లీ నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండుట న్యాయమా! నీ భక్తులను కరుణించవా? అంటాడు. అంత ఆ మాత, త్రిలోకాధిపతీ! నీవు అనుకున్నట్లు నా శ్రీహరి అంత సంకుచిత మనస్కుడు మాత్రం కాదు. నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవార్కి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ప్రసన్నమవుతానని దేవేంద్రుని సమాధానపరచింది, దానికి త్రిలోగాధిపతి కృతజ్ఞతాంజలి సమర్పించుకున్నాడు.
  • శ్రీరామచంద్రుడు రావణ సంహారము గావించి సీతాదేవితో అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడైన శుభసందర్భంగా! శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై లోకకంటకుడైన నరకాసురుని వధించినందుకు సంబరంగా! ఇలా ఈ దివ్య దీపావళిని దేదీప్యమైన దివ్యకాంతుల దీపాలను అలంకరించి బాణాసంచా కాలుస్తూ! అందరూ వారి వారి ఆనందాలను వ్యక్తపరుస్తూ ఉంటారు.

  • ఇక ఈ దీపావళి పండుగను దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చిన దివ్యజ్యోతి ఈ జీవకోటికి వెలుగును ప్రసాదించిన విశిష్టమైన రోజుగా చెప్పబడింది.

💥దీపావళి నాడు లక్ష్మీ దేవి పూజా విధానం

వ్రత నియమాలు💥

  • విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీ పక్కనుండటమే అంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు.

  • త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు దేవేరి, భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీ దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం ‘సినీవాలి’ అనే దేవతను ‘విష్ణుపత్ని’గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు.

  • లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.

  • పురాణాలు, ఇతిహాసాలలో లక్ష్మీ దేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని, 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు.

  • లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు.

  • దీపం జ్యోతి పరబ్రహ్మమ్, దీపం సర్వతమోహరమ్, దీపేన సాధ్యతే సర్వమ్, సంధ్యా దీపం నమామ్యహమ్.. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది.

  • దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి ఈ కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి.

       💥  ప్రాణ ప్రతిష్ఠ 💥

‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

బెల్లం ముక్కను నివేదన చేస్తూ … ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం

జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి

అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే

రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః

పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్

బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా

దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః

పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి.


     💥 కలశ స్థాపన💥

వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి.

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః

కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య’


💥లక్ష్మీదేవి ఆధాంగ పూజ.💥

చంచలాయై నమః- పాదౌ పూజయామి

చపలాయై నమః- జానునీ పూజయామి

*పీతాంబర ధరాయై నమః -ఊరూ పూజయామి

కమలవాసిన్యై నమః- కటిం పూజయామి

పద్మాలయాయై నమః- నాభిం పూజయామి

మదనమాత్రే నమః- స్తనౌ పుజయామి

లలితాయై నమః -భుజద్వయం పూజయామి

కంబ్కంఠ్యై నమః- కంఠం పూజయామి

సుముఖాయై నమః- ముఖం పూజయామి

శ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామి

సునాసికాయై నమః నాసికం పూజయామి

సునేత్రాయై నమః ణెత్రే పూజయామి

రమాయై నమః కర్ణౌ పూజయామి

కమలాలయాయై నమః శిరః పూజయామి

ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

* ఈ కింది మంత్రాన్ని పఠిస్తూ దీపం వెలిగించాలి…

*ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం

సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ

ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం

దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవ

శ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి.

లక్ష్మీ దేవికి తిలకాధారణ చేసి, విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి, మొదలైనవి సమర్పణలు ఉంచాలి. అలాగే బంగారు, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణేలను కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్దోదక స్నానం చేయాలి. ఆభరణం, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి.


💥లక్ష్మీదేవి అష్టోత్తరం పూలు, అంక్షితలతో పూజ💥

ఓం ప్రకృత్యై నమః

ఓం వికృత్యై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూతహితప్రదాయై నమః

ఓం శ్రద్దాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓం పరమాత్మికాయై నమః

ఓం పద్మాలయాయై నమః

ఓం పద్మాశన్యే నమః

ఓం స్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓం హిరణ్మయై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యై నమః

ఓం ఆదిత్యై నమ:

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణ్యై నమ:

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓంకామాక్ష్యై నమః

ఓం క్రోధసముద్భవాయై నమః

ఓం అనుగ్రహప్రదాయై నమః

ఓం బుద్ద్యై నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓం అమృతాయై నమః

ఓం దీప్తాయై నమః

ఓం లోకశోకవినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓం లోకమాత్రే నమః

ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓం పద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓం పద్మముఖ్యై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓం పద్మమలాదరాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం పద్మిన్యై నమః

ఓం పద్మగంధిన్యై నమః

ఓం పుణ్యగంధిన్యే నమః

ఓం సుప్రసన్నయై నమః

ఓం ప్రసాదాభిముఖ్యై నమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓం చంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్రరూపాయై నమః

ఓం ఇందిరాయై నమః

ఓం ఇందుశీతలాయై నమః

ఓం ఆహ్లాదజనన్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం దారిద్రనాశిన్యై నమః

ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః

ఓం శాంతాయై నమః

ఓం శుక్లమాల్యాంబరాయై నమః

ఓం శ్రియై నమః

ఓం భాస్కర్యై నమః

ఓం బిల్వనిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యై నమః

ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాగ్యై నమః

ఓం హేమమాలిన్యై నమః

ఓం హరిణ్యై నమః

ఓం ధనధాన్యకర్త్యై నమః

ఓం సిద్ద్యై నమః

ఓం స్రైణసౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశ్మగతానందాయై నమః

ఓం వరలక్ష్మ్యై నమః

ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓం హిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్రతనయాయై నమః

ఓం జయాయై/మంగళాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓం ప్రసన్నాక్ష్యై నమః

ఓం నారాయణ సమాశ్రితాయై నమః

ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః

ఓం దేవ్యై నమః

ఓం సర్వోపద్రవవారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః


అష్టోత్తరం పూర్తయిన తర్వాత కింది మంత్రాన్ని జపిస్తూ కుడివైపునకు మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి.


యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ

త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల

అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి

శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.


💥సాష్టాంగ నమస్కారం💥

నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే

పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః

శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి


సంధ్యాసమయంలో ఆవు నెయ్యితో దీపాలను ఇంటిముందర వరస క్రమంలో వెలిగించాలి.

ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో! ఆ ఇంట శ్రీమహాలక్ష్మీ ప్రవేశిస్తుందని మనకు ఋగ్వేదం చెప్తోంది. అటువంటి పుణ్యదిన సాయం సంధ్యాకాలమందు లక్ష్మీస్వరూపమైన తులసికోట ముందు తొలుత దీపాలు వెలిగించి శ్రీమహాలక్ష్మీ అష్టోత్తర శతనామాలతో అందు వర్ణించిన విధంగాపూజ గావించి నివేదన చేసి 

|| చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టి శివాం శివకరీం సతీమ్ ||

అని ధ్యానించి, ఈ సర్వప్రాణ కోటికి హృదయ తాపాలను పోగొట్టు సర్వసంపన్న శక్తివంతురాలుగా భావించి, పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయుటవల్ల కాలి అందియలు ఘల్లుఘల్లుమన అన్నట్లు ఆ మహాలక్ష్మీ ప్రసన్నమౌతుందట! ఇలా రెండు రోజుల పండుగ నరక చతుర్థశి, దీపావళిలను విశేషంగా జరుపుకుని, శ్రీమహాలక్ష్మీని మన ముంగిటకు ఆహ్వానించేద్దాం.

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. లలో . దీపావళి విశిష్టత తెలుసుకోండి 




Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుంది,  థాంక్యూ