శ్రీ రామనవమి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ రామనవమి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఏప్రిల్ 2021, మంగళవారం

శ్రీ రామనవమి ఎలా జరుపుకోవాలి ఈ పండుగ ప్రాముఖ్యత రామాయణం లో తెలుసుకోవలసిన 10 ముఖ్య విషయాలు

wowitstelugu.blogspot.com

శ్రీ రామనవమి ఎలా జరుపుకోవాలి ఈ పండుగ ప్రాముఖ్యత రామాయణం లో తెలుసుకోవలసిన 10 ముఖ్య విషయాలు


శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి , గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము , రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.

ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో ఒంటిమిట్ట కోదండ రామాలయం లో తెలంగాణలో భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

"రామా" అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ - జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో , పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం.

భక్తుల గుండెల్లో కొలువై , సుందర సుమధుర చైతన్య రూపమై , కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు.

నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు.

శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం , సకల దోష నివారణం , సర్వ సంపదలకు నిలయం , సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.

శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం.

శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా , అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు , కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు.

శ్రీ సీతారామ కళ్యాణము , రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటారు.

శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా , నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి , హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి.

శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు , ఏకపత్నీ వ్రతుడు , పితృ , మాతృ , భాతృ , సదాచారం , నిగ్రహం , సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని , లక్ష్మణ , భరత , శతృఘ్న , ఆంజనేయ సమేతముగా ఆరాధించి , వడ పప్పు , పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు.

ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేది భక్తుల విశ్వాసం.

14 సంవత్సరములు అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడ‌య్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రతీతి. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది.

ఈ చైత్ర శుద్ధ నవమి నాడు భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం.

ఇంట్లో జరుపుకునే విధానము


👉 శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ ఉద‌య‌మే లేచి, తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన లేదా కొత్త వస్త్రములను ధరించాలి. సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి పటమును గాని, సీతారాముల విగ్రహములనుగాని పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి. నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు(నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి.

👉 సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి ఊరిలోని రామాలయమునకు, పందిళ్లకు వెళ్లి సీతారాములను చూసి, వారిని ధ్యానించుకొని, ప్రసాదం స్వీకరించాలి. వీలైన వారు రామాలయంలో గాని, శ్రీరామ నవమి పందిళ్లలో గాని సీతారాముల కళ్యాణం జరిపించవచ్చు. లేదా ఆ సమయానికి వెళ్లి సీతారాముల కళ్యాణం చూసి రావాలి. శ్రీసీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా సర్వ శుభాలు కలుగుతాయి.


ఇంటిలో చేసుకొనే పూజా విధానం

  • వినాయక ధ్యానం, సంకల్పం, పూజ చేసి దేవునికి షోడశపూజలు మాములే గనుక పూజ యధావిధిగా వాటిని ముగించి, ఆపై శ్రీరామాష్టకం, శ్రీరామ అష్టోత్తరం, జానకీ అష్టకం పఠించి పువ్వులతో పూజ చేయాలి.

  • చైత్రమాసం మల్లెలమాసమే గనుక మల్లెపూవులతో పూజించడం శుభప్రదం. మల్లెపూవులు లభ్యంకాని ప్రాంతాలలో వుండేవారు ఏదైనా సువాసనలు గల తెల్లరంగు పూవులతో సీతాలక్ష్మామాంజనేయ సమేత శ్రీరామ పటానికి, లేదా విగ్ర‌హానికి పూజించాలి.

  • వడపప్పు, పానకం, రామయ్యకు ప్రీతి. అంటే స్వామి ఖరీదైన వ్యయ ప్రయాసలతో ముడిపడిన పిండివంటలేవీ కోరుకోడనీ, స్వామి సాత్వికుడనీ భక్తుల నుంచి పిండి వంటలుగాక పరిపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే ఆశిస్తాడ‌ని మ‌న‌కు తెలుస్తోంది.

  • వడపప్పు స్నానానికి ముందుగా నానబెట్టుకోకూడదు. స్నానానంతరం మొదట వడపప్పు నానబెట్టుకొంటే, తక్కిన వంటలు పూజాదికాలు పూర్తయి, నైవేద్య సమయానికి ఎలాగూ నానుతుంది. ఆ రోజు ఏ వంట చేయాలనుకొన్నారో ఆ వంట పూర్తిగావించి అదికూడా నైవేద్యం చేయాలి.

  • వీటితో పాటు ఏదైన ఒక ఫలం నివేదించాలి.

రాముడు మరియు రామాయణం గురించి మనం తెలుసుకోవలసిన 10 అతి ముఖ్య విషయాలు

01) హిందువుల కు ముఖ్యమైన ఒక దేవుడు రాముడు, భారతీయ సంస్కృతి కి మూలమైన ప్రతిష్టాత్మకమైన పుస్తకాలలో ఒకటైనది రామాయణం, ఈ కథ వ్రాతపూర్వకముగా ప్రపంచం లోకి రాకముందే తర తరాలకి విశ్వవ్యాప్తంగా తరలి పోయింది. 2) రాముడు విష్ణువు యొక్క 7 వ అవతారం, మరియు కృష్ణుడిని, విష్ణువు యొక్క అతి ముఖ్యమైన అవతారంగా (ఒక దేవతా రూపమైన వ్యక్తి) పరిగణిస్తారు. 3) రాముడిని ఆదర్శ మనిషిగా, పరిపూర్ణ మానవుడిగా భావిస్తారు; శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా. 4) చాలా మంది హిందువులు రామాయణాన్ని నమ్ముతారు, రాముడు 1.2 మిలియన్ సంవత్సరాల క్రితం, త్రేతా యుగంలో- క్రీస్తుపూర్వం 7 వ -4 వ శతాబ్దం నాటివాడని. చరిత్రలో ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయ్. 5) రాముడికి అత్యంత భక్తుడు హనుమంతుడు. భక్తి అంటే ఎలావుండాలో దానికి నిదర్శనం చిహ్నము గా హనుమంతుడుని చెప్పవచ్చును. 6) తన తండ్రిని గౌరవించటానికి, రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి 14 సంవత్సరాల ప్రవాసంలో ఉండడం. తండ్రికి ఇవ్వ వలసిన గౌరవానికి నిదర్శనం.

7) రామాయణం యొక్క మొత్తం కథ, లంక ప్రభువు అయిన దుష్ట రాజు రావణుడు ఎత్తుకు పోయిన తన భార్యను తిరిగి తీసుకు రావడానికి రాముడి ప్రయాణం. రాముడు (విష్ణు) మరియు సీత (లక్ష్మి అవతారం) తరతరాలకు అతి పురాతనమైన మరియు ప్రసిద్ధమైన ప్రేమకథలలో ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.

8) రామడి యొక్క విల్లు చాలా శక్తివంతమైనది, అది మొత్తం శత్రు సైన్యాన్ని తుడిచిపెట్టగలదు. రాజుకు ఉండవలసిన లక్షణాలలో ముఖ్యమైనది ఇది ఒకటి.

9) దుష్ట రావణుడిని ఓడించిన తరువాత, రాముడు పట్టాభిషిక్తుడై 11,000 సంవత్సరాల సంపూర్ణ శాంతి మరియు శ్రేయస్సు కోసం తన రాజ్యము అయోధ్యను పరిపాలించాడు.

10) రావణుడిపై రాముడి విజయం దసరా అని పిలువబడే 10 రోజుల పండుగలో జరుపుకుంటారు, మరియు అతను తన రాజ్యానికి మరియు పట్టాభిషేకానికి తిరిగి రావడం దీపావళి, దీపాల పండుగగా జరుపుకుంటారు.

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో శ్రీరామ నవమి గురించి తెలుసుకోండి




ఈ రోజు సూక్తి :

"Definiteness of purpose is the starting point of all achievement."
-W. Clement Stone.

"Challenges are what make life interesting and overcoming them is what makes life meaningful."
-Joshua Marine

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com