22, ఫిబ్రవరి 2020, శనివారం

ప్రదోష వేళ శివ పూజా మహిమ శివ ప్రదోష స్తోత్రం శివ అష్టోత్తర శతనామావళి

wowitstelugu.blogspot.com

ప్రదోష వేళ శివ పూజా మహిమ  శివ ప్రదోష స్తోత్రం శివ అష్టోత్తర శతనామావళి 



ప్రదోష కాలం లో చేయు శివ పూజ శివుడికి ఇష్టమైనది ..ఇది త్వరితగతిన శివానుగ్రహము కలిగిస్తుంది. ప్రదోష వేళలో సకల దేవతలు తమ పరివారం తో కైలాసం చేరి నన్దికేశ చండికేశ ప్రమద గణాలతో చేసే ఆనంద తాండవంను తన్మయత్వంతో అనుభవిస్తారు


ప్రదోష కాలం అంటే ఎప్పుడు ?

  • సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.


  • మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము.


  • ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది.

త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు.


  • ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది.

  • పరమ శివుడు సదా ప్రదోషకాలంలో, హిమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు.ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటాడు అనేది విదితం. గజాసురుణ్ణి సంహారించేటప్పుడు,అంధకాసుర సంహారంలోను శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందంకోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్తరత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.

  • త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం అని,త్రయోదశి సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ, త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషమని, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషమని, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషమని, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషమని, త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి అనీ,శని ప్రదోషమని పిలుస్తారు. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి.

  • ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. 

  • ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది.

  • ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం.

  • శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం.


శివ ప్రదోష స్తోత్రము

కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం

గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే

నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ

దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః

తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా

విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా

సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య

విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ

యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః

ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః

హర హర మహాదేవ శంభో శంకర

శివ అష్టోత్తర శతనామావళి


ఓం శివాయ నమఃఓం మహేశ్వరాయ నమఃఓం శంభవే నమఃఓం పినాకినే నమఃఓం శశిశేఖరాయ నమఃఓం వామదేవాయ నమఃఓం విరూపాక్షాయ నమఃఓం కపర్దినే నమఃఓం నీలలోహితాయ నమఃఓం శంకరాయ నమః (10)ఓం శూలపాణయే నమఃఓం ఖట్వాంగినే నమఃఓం విష్ణువల్లభాయ నమఃఓం శిపివిష్టాయ నమఃఓం అంబికానాథాయ నమఃఓం శ్రీకంఠాయ నమఃఓం భక్తవత్సలాయ నమఃఓం భవాయ నమఃఓం శర్వాయ నమఃఓం త్రిలోకేశాయ నమః (20)ఓం శితికంఠాయ నమఃఓం శివాప్రియాయ నమఃఓం ఉగ్రాయ నమఃఓం కపాలినే నమఃఓం కౌమారయే నమఃఓం అంధకాసుర సూదనాయ నమఃఓం గంగాధరాయ నమఃఓం లలాటాక్షాయ నమఃఓం కాలకాలాయ నమఃఓం కృపానిధయే నమః (30)ఓం భీమాయ నమఃఓం పరశుహస్తాయ నమఃఓం మృగపాణయే నమఃఓం జటాధరాయ నమఃఓం క్తెలాసవాసినే నమఃఓం కవచినే నమఃఓం కఠోరాయ నమఃఓం త్రిపురాంతకాయ నమఃఓం వృషాంకాయ నమఃఓం వృషభారూఢాయ నమః (40)ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమఃఓం సామప్రియాయ నమఃఓం స్వరమయాయ నమఃఓం త్రయీమూర్తయే నమఃఓం అనీశ్వరాయ నమఃఓం సర్వజ్ఞాయ నమఃఓం పరమాత్మనే నమఃఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమఃఓం హవిషే నమఃఓం యజ్ఞమయాయ నమః (50)ఓం సోమాయ నమఃఓం పంచవక్త్రాయ నమఃఓం సదాశివాయ నమఃఓం విశ్వేశ్వరాయ నమఃఓం వీరభద్రాయ నమఃఓం గణనాథాయ నమఃఓం ప్రజాపతయే నమఃఓం హిరణ్యరేతసే నమఃఓం దుర్ధర్షాయ నమఃఓం గిరీశాయ నమః (60)ఓం గిరిశాయ నమఃఓం అనఘాయ నమఃఓం భుజంగ భూషణాయ నమఃఓం భర్గాయ నమఃఓం గిరిధన్వనే నమఃఓం గిరిప్రియాయ నమఃఓం కృత్తివాససే నమఃఓం పురారాతయే నమఃఓం భగవతే నమఃఓం ప్రమధాధిపాయ నమః (70)ఓం మృత్యుంజయాయ నమఃఓం సూక్ష్మతనవే నమఃఓం జగద్వ్యాపినే నమఃఓం జగద్గురవే నమఃఓం వ్యోమకేశాయ నమఃఓం మహాసేన జనకాయ నమఃఓం చారువిక్రమాయ నమఃఓం రుద్రాయ నమఃఓం భూతపతయే నమఃఓం స్థాణవే నమః (80)ఓం అహిర్భుథ్న్యాయ నమఃఓం దిగంబరాయ నమఃఓం అష్టమూర్తయే నమఃఓం అనేకాత్మనే నమఃఓం స్వాత్త్వికాయ నమఃఓం శుద్ధవిగ్రహాయ నమఃఓం శాశ్వతాయ నమఃఓం ఖండపరశవే నమఃఓం అజాయ నమఃఓం పాశవిమోచకాయ నమః (90)ఓం మృడాయ నమఃఓం పశుపతయే నమఃఓం దేవాయ నమఃఓం మహాదేవాయ నమఃఓం అవ్యయాయ నమఃఓం హరయే నమఃఓం పూషదంతభిదే నమఃఓం అవ్యగ్రాయ నమఃఓం దక్షాధ్వరహరాయ నమఃఓం హరాయ నమః (100)ఓం భగనేత్రభిదే నమఃఓం అవ్యక్తాయ నమఃఓం సహస్రాక్షాయ నమఃఓం సహస్రపాదే నమఃఓం అపపర్గప్రదాయ నమఃఓం అనంతాయ నమఃఓం తారకాయ నమఃఓం పరమేశ్వరాయ నమః (108)


ఈ శివరాత్రి పర్వదినం నాడు చదివి ఆ శివయ్య కరుణాకటాక్షాలు పొందండి.

ఈ క్రింది లింక్ ల లో  యు ట్యూబ్  వీడియోలు చూడండి 


https://www.youtube.com › watch










Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share
and subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.










21, ఫిబ్రవరి 2020, శుక్రవారం

వివిధ జీవన సమస్యలకు, గ్రహదోషాలకు దేవతలు, దేవి మంత్ర పరిష్కారాలు

wowitstelugu.blogspot.com

వివిధ జీవన సమస్యలకు, గ్రహదోషాలకు దేవతలు, దేవి మంత్ర పరిష్కారాలు
హిందూమతంలో, మనం నమ్మే దేవునికి లేదా దైవిక శక్తి పట్ల మనకున్న శ్రద్ధాభక్తులను, పూజ ద్వారా తెలియజేస్తాము. ప్రార్థనలు చేయడం, భజనలు పాడటం, మంత్రాలు జపించడం, పవిత్రమైన ఆచారాలను పాటించడం పూజ యొక్క విధి విధానాలలో ఒక భాగం గా భావిస్తాం

ప్రతి ఒక హిందువు, తన ఇష్టదైవంతో మార్గం ఏర్పరుచుకుంటాడు. హిందూ భక్తుల జీవితంలో, పూజలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంత వేగవంతమైన హడావిడి జీవితాలలో, ఖచ్చితంగా పూర్తి చేయవలసిన లక్ష్యాలు ఉన్నప్పటికీకూడా, రోజులో కొంత సమయాన్ని పూజలు చేసి, తద్వారా ప్రశాంతమైన, భాగ్యవంతమైన జీవితం గడపాలని ఆశిస్తాం.
  • పవిత్ర హిందూ మతగ్రంథాలు, ఈ క్రింది దేవతలకు పూజలు చేస్తే, దేవుళ్ళు మరియు దేవతల యొక్క ఆశీస్సులు మన వెంట ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తున్నాయి. స్వచ్ఛమైన మనస్సుతో, భక్తిశ్రద్ధలతో ఈ పూజలు చేసేవారి కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వసిస్తారు.

  • మంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్గం లభిస్తుందో ఇప్పుడు మనం సంక్షిప్తం గా తెలుసుకుందాం.


సాధారణంగా ఏ దేవుళ్ళని పూజించినా అన్నిరకాల సమస్యలు తీరిపోతాయి . కానీ మన హిందూ పురాణాలు , గ్రంధాలు ప్రత్యేకం గా ఏ దేవుళ్ల ను పూజిస్తే ఎటువంటి ఫలితాలుంటాయో తెలియజేసాయి.

దేవుళ్ళు పూజ ఫలితం :
వినాయకుడు
ఇతను అన్ని గణాలకు అథినాయకుడు, హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన దేవతలలో ఇతను ఒకరు. ఏ పూజ మనం చేస్తున్నప్పటికీ, ప్రథమ పూజను మాత్రం ఈయనకే చేయాలి. అయితే, వినాయకునికి మాత్రమే ప్రత్యేకంగా పూజ చేస్తే, భక్తుని జీవితంలో అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పూజా ద్వారా మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు మరియు విజయాన్ని సాధించవచ్చు. సంకట హర చతుర్థినాడు అష్టోత్తర పూజలు, అభిషేకాలు, హోమాలు గాని చేస్తే అన్ని రకాల విఘ్నాలు తొలగి పోతాయి. వినాయక చవితి నాడు ప్రతి హిందువు వైభవం గా వినాయక పూజలు చేస్తారు.

లక్ష్మీ దేవి

లక్ష్మీ దేవి ధనానికి , బంగారానికి ఆదిదేవతగా భావిస్తారు, శక్తి యొక్క ముఖ్య రూపాలలో ఒకటి మరియు ఆమె భక్తులు ఆమెను చాలా భక్తిప్రపత్తులతో కొలుస్తారు. దుర్గ మరియు సరస్వతితో పాటుగా, ఈమె హిందూ త్రిమూర్తి దేవతలలో ఒకరు. ఒక వ్యక్తి జీవితంలో లక్ష్మి పూజ చేయటం వలన అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు
.
శనైశ్చరుడు

శనిశింగనాపూర్ పవిత్ర మందిరంలో స్వయంభువుగా వెలసిన శనిదేవునికి తైల సమర్పణ చేయటం, శని దోష నివారణ కొరకు మనం చేయగలిగే అత్యంత శక్తివంతమైన పరిష్కారం. దేశ నలుమూలల నుండి భక్తులు, శింగనాపూర్లోని శనిదేవుని ఆలయంలో తైలాభిషేకం చేయడం కొరకు సందర్శిస్తారు. ఇలా చేస్తే, శనిదోష నివారణతో పాటుగా, చెడు కర్మ ప్రభావాలు తొలగి, వైవాహిక మరియు వ్యక్తిగత సమస్యలను పూర్తిగా పరిష్కరించబడతాయి.శనిదేవునికి నల్ల నువ్వుల నూని తో అభిషేకం చేయడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం. పేద బ్రాహ్మణులకు, అన్న ,వస్త్ర, పాద రక్షలు, గొడుగు , దానం చేయడం తో శని దోషాలు తొలగి పోతాయి. శనైశ్చరుడు సంతృప్తి చెందుతారు.

హనుమంతుడు

ధైర్యానికి ప్రతీక హనుమంతుడు. హనుమంతుని శివుడి అవతారంగా భావిస్తారు. అతను గొప్ప రామభక్తుడు కూడా. రాముడిని పూజిస్తే హనుమంతుడు ఎక్కువుగా సంతృప్తి చెందుతాడు. రామబంటు హనుమంతుడు సూర్యోదయానికి ముందు హనుమాన్ చాలిసా జపంతో హనుమంతుని పూజ మొదలవుతుంది. హనుమంతుని పూజ మరియు ఆరతి, మీకు మరియు మీ కుటుంబానికి చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఈ పూజ చేసిన భక్తుల మనస్సులలో ఉండే భయాలు తొలగిపోతాయి. జీవితంలో ఎటువంటి కష్టాలను అయినా ఎదుర్కోవటానికి ధైర్యం వస్తుంది. తమలపాకులతో, వడ మాల ల తో పూజలు చేస్తారు.
సత్యనారాయణ స్వామి
సత్యనారాయణ స్వామి వ్రతం మరియు హోమం: విష్ణు యొక్క అత్యంత ప్రసిద్ధ రూపాలలో, సత్యనారాయణ స్వామి ఒకరు. ప్రతిచోటా ఈయనను హిందువులు పూజిస్తారు. విష్ణువు యొక్కఈ రూపాన్ని, సత్యానికి ప్రతీకగా భావిస్తారు. విష్ణు భక్తులలో, ఈ రూపం చాలా ప్రసిద్ది చెందింది. పూర్ణిమ రోజులలో సత్యనారాయణ పూజను జరుపుకోవడాన్ని పవిత్రమైన కార్యంగా భావిస్తారు. జీవితంలో విజయవంతం కావడానికి మరియు శరీరాన్ని మరియు మనస్సును మెరుగు పరచు కోవడానికి,ఈ పూజ తోడ్పడుతుంది. నూతన గ్రహ ప్రవేశాల లోను, వివాహమైనప్పుడు కొత్త దంపతులు ఈ పూజను నిర్వహిస్తారు.

దోష నివారణకు వివిధ పూజలు :
పార్థివ శివలింగం పూజ:


శివునికి అంకితం చేయబడిన ఒక ప్రత్యేకమైన పూజ. పార్థివ శివలింగం అనగా మట్టి లేదా ఇసుకతో తయారు చేయబడిన శివలింగం. మీ తరపున, పవిత్ర గంగ నది ఒడ్డున స్థాపన చేయబడిన 108 పార్థి శివలింగాలకు, అభిషేకం నిర్వహిస్తారు. ఓంకారేశ్వర్ మరియు కాశీ జ్యోతిర్లింగ దేవాలయాలలో కూడా, ఈ పూజ చేయవచ్చు. ఈ పూజ చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గ్రహదోషాలు, వ్యాధులు, దురదృష్టం, ప్రమాదాలు మరియు ఒత్తిడి నివారణకు, ఈ పూజ మంచి పరిష్కారం.

కాల సర్ప దోష నివారణకు నవగ్రహ పూజ :


కాలసర్ప దోష నివారణ పూజ సప్త గ్రహాలు (సూర్యుడు, చంద్రుడు, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ), రాహువు మరియు కేతువు అనే గ్రహాల మధ్యగా వచ్చినప్పుడు, కాలసర్ప దోషం కలుగుతుంది. ఈ సమయంలో జన్మించిన వారి జీవితాల్లో దురదృష్టం, మరణం వంటి బాధాకరమైన అనుభవాలు ఎదురవుతాయి. కాలసర్ప దోష నివారణ పూజ చేయడం ద్వారా,ఇటువంటి ప్రతికూల ప్రభావాలను సమర్థవంతంగా తొలగడమే కాక, భక్తుల జీవితాలు మెరుగుపడతాయి.

సమస్యలు, దోష నివారణకు వివిధ మంత్రాలు :

శివ మహామృత్యుంజయ మంత్రం

అత్యంత శక్తివంతమైన శివ మంత్రాలలో ఒకటి. ఈ మంత్రాన్ని జపించడం, శివుని ఆశీస్సులను పొందడానికి ఎంతో ప్రభావవంతమైన మార్గం. ఇది ప్రతికూల ఆధ్యాత్మిక ప్రభావాలను నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇది కుటుంబం భద్రతకై రక్షణను కవచం ఏర్పాటు చేస్తుంది మరియు ఒక వ్యక్తి ప్రతిష్టాత్మకంగా మారడానికి సహాయపడుతుంది.

ధనప్రద శ్రీ లక్ష్మీ కుబేర మంత్రం

కుబేరో ధన దః శ్రీ దః రాజరాజో ధనేశ్వరః

ధనలక్ష్మీ ప్రయతమో ధనాడ్యో ధనిక ప్రియః

ఓం శ్రీం క్లీం శ్రీం కార్యసిద్థి కుబేరాయ నమః

ఓం శ్రీం క్లీం శ్రీం లక్ష్మీ కుబేరాయ నమః

ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం యుక్తేశ్వరాయ నమః

ఓం యక్షాయవిద్మహే వైశ్రవణాయ ధీమహే

తన్నో కుబేర ప్రచోదయాత్‌

వ్యాపార లాభాలకు మంత్రం

1. దుర్గే శివే భయనాశిని మాయే నారాయణి సనాతని

జయే మే పత్య దేహేదేహిన్‌ రక్షరక్ష కృపాకరీ

2. ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః

మంత్రం:

శివశక్తి కామక్షితి రధ రవి శ్శీతకిరణం స్మరో హంస శక్రస్త

ధనుజ పరామార హరయః

అమీ హృల్లేకాభిఃతి స్వభావ రసానేషు ఘటితా

భజన్తే వర్ణాస్తే తవ జననీ నామావయవతాం

విద్యా విజయానికి మంత్రాలు

1. ఆనంద తీర్థ వరదే దానవారణ్య పావకే

జ్ఞానదాయనే సర్వేశే శ్రీనివాసేస్తు మే మనః

2. శ్రీవేంకటేశా శ్రీనివాసా సర్వశత్రు వినాశకా

త్వమేవ శరణం స్వామిన్‌ సర్వత్ర విజయం దిశా

సంతాన గోపాల మంత్రం:

ఓం హ్రీం కృష్ణాయ హూం శ్రీం క్లీం గోవిందాయ ఫట్‌ స్వాహా

ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణా గోవిందా గోపీజన వల్లభా మమ పుత్ర దేహీ స్వాహా

దేవకీ సుత గోవిందా దేవదేవ జగత్పతే దేహిమే తనయే కృష్ణా తవమహం శరణం గతః

విద్యాప్రాప్తికి సరస్వతీ స్తోత్రం

సరస్వతీ మాం దృష్ట్యా వీణా పుస్తక ధారిణీం

హంస వాహన సమాయుక్తా విద్యాదాన కరే మమ

ప్రథమం భారతీనామా, ద్వితీయంచ సరస్వతీ

తృతీయ శారదాదేవీ, చతుర్థం హంస వాహిని

పంచమం జగతీ ఖ్యాతా, షష్ట్యం వాణీశ్వరీ తథా

కౌమారీ సప్తమం ప్రోక్తా, అష్టమం బ్రహ్మచారిణి

నవమం బుద్ధి ధాత్రీచా, దశమం వరదాయని

ఏకాదశం క్షుద్ర ఘంటా, ద్వాదశం భువనేశ్వరీ

ద్వాదశైతాని నామాని త్రిసంధ్య యః పఠేన్నరః

సర్వసిద్ధి ఖరీతస్య ప్రసన్న పరమేశ్వరీ

సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతీ

విజయానికీ సకల దోష నివారణకూ తగిన మంత్రాలు, స్తోత్రాలు.

*లక్ష్మీగణపతి:.*

సర్వవిజ్ఞ హరం దేవం సర్వవిజ్ఞ వివర్జితం

సర్వసిద్ధి ప్రదాతారం లక్ష్మీగణపతిం భజే

సత్వర వివాహానికి - దాంపత్య దోష నివారణకు

1. కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్‌ యతీశ్వరీ

నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః

2. అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః

కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర

3. విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే

4. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే

దోష నివారణకు క్షమాపణకు:

నారాసింహానంత గోవిందా భూతభావన కేశవా

దురుక్తం దుష్కృతం ధ్యాతం శమయాషు జనార్దనా

హనుమాన్‌ శత్రుంజయ మంత్రం

ఓం నమో భగవతే మహాబల పరాక్రమాయ మహా విపత్తి నివారణాయ

భక్తజన మనోభీష్ట కల్పనాకల్ప ధ్రుమాయ

దుష్టజన మనోరథ స్తంభనాయ

ప్రభంజన ప్రాణప్రియాయ శ్రీం

సర్వఫలప్రదభైరవ స్తోత్రం:

ఓం భైరవాయ అనిష్ట నివారణాయ స్వాహా

మమ సర్వేగ్రహ అనిష్ట నివారణాయ స్వాహా

జ్ఞనం దేహి ధనం దేహి మమ దారిద్య్రం నివారణాయ స్వాహా

సుతం దేహి యశం దేహి మమ గృహక్లేశం నివారణాయ స్వాహా

స్వాస్థ్యం దేహి బలం దేహి మమ శత్రు నివారణాయ స్వాహా

సిద్ధం దేహి జయం దేహి మమ సర్వ రుణాం నివారణాయ స్వాహా

దీర్ఘాయువుకూ, చిరంజీవత్వానికి:

అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ్ఛ విభీషణః

కృపః పరశురామాచ్ఛ సప్తైతే చిరంజీవి నమః

సప్తైతాన్‌ సంస్మరే నిత్యం మార్కండేయ మదాష్టకం

జీవేద్వర్ష శతంశోపి సర్వవ్యాధి వివర్జితః

విద్యావిజయంకరీ మంత్రం:

ఓం ఐం హ్రీం హ్రీం క్లీం క్లీం హౌం సః

నీల సరస్వతే నమః

(ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కనీసం 11సార్లు లేదా 108సార్లు జపిస్తే సత్వర 

విద్యాభివృద్ధి కలుగుతుంది)

మంగళచండికా స్తోత్రం

రక్షరక్ష జగన్మాతా దేవీ మంగళ చండికే

హారికే విపదం రక్షే హర్ష మంగళ కారికే

హర్ష మంగళ దక్షేచా హర్ష మంగళ దాయినే

శుభే మంగళ దక్షేచా శుభే మంగళ చండికే

మంగళే మంగళా ర్హేచా సర్వమంగళ మంగళే

సదా మంగళాదేవీ సర్వేశాం మంగళలయే

భార్యాభర్తల పరస్పర ఆకర్షణకు.

ద్రాం ద్రవిణే బాణాయ నమః

ద్రీం సంక్షోభణ బాణాయ నమః

క్లీం ఆకర్షణ బాణాయ నమః

బ్లూం వశీకరణ బాణాయ నమః

సం సమ్మోహన బాణాయ నమః

పురుషత్వం,సంతాన ప్రాప్తికి.

కథాకాళేమాతః కథయా కళితాలక కరశం

పిబేయం విద్యార్థీ తవచరణ నిర్లేజన జలం

ప్రకీర్తా మూకనామ పిచకలితాకారణ తయా

యథాదత్తే వాణీముఖ కమల తాంబూల రసతాం


ఈ క్రింది యూట్యూబ్ వీడియో లు చూడండి

గ్రహదోషాలు పోగొట్టగలిగే శ్లోకములు ... - YouTube



అరుదైన ఈ మంత్రాన్ని పఠిస్తే ఐశ్వర్యం ...


ధన్యులము అవ్వాలి అంటే , కామాక్షి ... - YouTube


Kalabhairav ఉదయం లేవగానే ఈఒక్క మాటని ... - YouTube


ఈ వ్రతం చేస్తే భార్య భర్తల మధ్య ఎప్పటికి ...


సకల విధములైన గృహ సమస్యలకు పరిష్కారం ...


మీరు కోరుకున్న ఉద్యోగం మీకు రావాలంటే ...

https://www.youtube.com › watch


Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share
and subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.







8, ఫిబ్రవరి 2020, శనివారం

గాయత్రీ మంత్రములు ఎన్ని ఉన్నాయో తెలుసుకొని పఠించి మంత్ర సిద్దులు పొందండి

గాయత్రీ మంత్రములు ఎన్ని ఉన్నాయో తెలుసు కొని   పఠించి   మంత్ర  సిద్దులు పొందండి 


ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిధియోయోనఃప్రచోదయాత్



  • తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు  గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. 

  • గాయత్రి అనే పదము 'గయ' మరియు 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉన్నది. 

  • "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. 
  • 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం.
  •  ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. 
  • వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమును చేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును  రచించినారు.

గాయత్రీ మంత్రం 

ఓం భూర్భువస్వః

తత్స వితుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి

ధియోయోనఃప్రచోదయాత్

గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం లో ఒక దేవత ఉంది 

  • ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.

  • భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).

  • భువః = చిత్ స్వరూపుడు(జ్ఞాన రూపుడు).

  • స్వః = ఆనంద స్వరూపుడు(దుఃఖరహితుడు).

  • తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేస్వరుడు.

  • సవితుః = ఈ సృష్టి కర్త.

  • వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.

  • భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).

  • దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.

  • ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)

  • యః = ఆ పరమేశ్వరుడు.

  • నః ద్యః = మా బుద్ధులను.

  • ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.

సకల  దేవతలతో  ముడిపడి  ఉన్న  గాయత్రీ మంత్రం 

అగ్ని గాయత్రి 

ఓమ్ మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్.

ఇంద్ర గాయత్రి 

ఓమ్ సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్.

కామ గాయత్రి 

ఓమ్ కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి, తన్నోऽనంగః ప్రచోదయాత్.

కృష్ణ గాయత్రి 

ఓమ్ దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణః ప్రచోదయాత్.

గణేశ గాయత్రి 

ఓమ్ ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.

గురు గాయత్రి 

ఓమ్ సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి, తన్నోగురుః ప్రచోదయాత్.

చంద్ర గాయత్రి 

ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.

తులసీ గాయత్రి 

ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందాః ప్రచోదయాత్.

దుర్గా గాయత్రి

 ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్.

నారాయణ గాయత్రి 

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోనారాయణః ప్రచోదయాత్.

నృసింహ గాయత్రి 

 ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్.

పృథ్వీ గాయత్రి 

ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్.

బ్రహ్మ గాయత్రి

 ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మః ప్రచోదయాత్.

యమ గాయత్రి

ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి, తన్నోయమః ప్రచోదయాత్.

రాధా గాయత్రి

ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్.

రామ గాయత్రి

 ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నోరామః ప్రచోదయాత్.

లక్ష్మీ గాయత్రి

ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.

వరుణ గాయత్రి 

ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణః ప్రచోదయాత్.

విష్ణు గాయత్రి

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్.

శని గాయత్రి

ఓమ్ కాక ధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి, తన్నో మందః ప్రచోదయాత్.

శివ గాయత్రి

ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్

సరస్వతీ గాయత్రి 

ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్.

సీతా గాయత్రి

ఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి, తన్నోసీతాః ప్రచోదయాత్.

సూర్య గాయత్రి

ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్.

హనుమద్గాయత్రి

ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతిః ప్రచోదయాత్.

హయగ్రీవ గాయత్రి

ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి, తన్నోహయగ్రీవః ప్రచోదయాత్.

హంస గాయత్రి 

ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్.

శ్రీ అయ్యప్ప గాయత్రి

 ఓం భూకనాథాయ విద్మహే భావపుత్రాయ ధీమహి, తన్నోషష్టా ప్రచోదయాత్.

శ్రీ శ్రీనివాస (వేంకటేశ్వర) గాయత్రి

ఓం నిరంజనాయ విద్మహే నిరాధారాయ ధీమహి, తన్నోవేంకట ప్రచోదయాత్.

శ్రీ కార్తికేయ (షణ్ముఖ) గాయత్రి 

ఓం తత్ పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి, తన్నోషణ్ముఖ ప్రచోదయాత్.


గాయత్రీ మంత్రం ఋషుల ప్రశంసలు  

  • గాయత్రికి బ్రహ్మకు భేదం లేదు. —వ్యాస మహర్షి

  • ముక్తిపొందుటకు గాయత్రిమంత్రం మూలకారణం. —శృంగి మహర్షి

  • గాయత్రి మంత్రం జన్మమరణముల బంధం నుండి విముక్తి లభింప చేస్తుంది. —గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వా మిత్ర మహర్షి

  • గాయత్రి మంత్రం పాపములను నశింపజేయును. — యాజ్ఞ వల్క్యుడు

  • గాయత్రి మంత్రం బ్రహ్మను (పరమాత్మను) సాక్షాత్కరింప చేస్తుంది. —భరద్వాజుడు

  • గాయత్రి మంత్రఉపాసన దీర్గాయువు కలిగించును. — చరకుడు

  • గాయత్రి మంత్రజపం వలన దుర్మార్గుడు పవిత్రుడై (సన్మార్గుడు) పోవును. — వశిష్ట మహర్షి

  • గాయత్రి వేదములకు మాత.ఈ జగత్తుకూ గాయత్రి మాతయే. —మహాదేవుడు

  • గాయత్రి సర్వశ్రేష్టమైన మంత్రం. దీనినే గురుమంత్రమందురు. ప్రాచీనకాలం నుండి దీనిని ఆర్యులందరూ జపించుచూ వచ్చిరి. —దయానంద మహర్షి

గాయత్రీ మంత్రం మహానుభావుల అభిప్రాయాలు 

  • గాయత్రి జపం నాలుగు దిశల నుండి శక్తిని తీసుకుని వచ్చును. — రవీంద్రనాధ్ ఠాగూర్

  • గాయత్రి మంత్రం జీవాత్మకు ప్రకాశమిచ్చును. — బాలగంగాధర తిలక్

  • గాయత్రి ప్రార్థన సార్వబౌమిక(అందరూ చేయతగిన) ప్రార్థన. — డా.సర్వేపల్లి రాధాకృష్ణ

  • గాయత్రి మంత్రమునందలి శబ్ధములు సమ్మోహనకరమైనవి, అవి పవిత్రపరచు ఉత్తమ సాధనములు. — మహాత్మా హంసరాజ్

  • గాయత్రి జపం భౌతిక అభావములను కూడా దూరం చేయును. — మదన మోహన మాలవ్య

  • గాయత్రి జపం వలన గొప్ప శక్తి లభించును. — రామకృషణ పరమహంస

  • గాయత్రి మంత్రం సదుబుద్ధినిచ్చు గొప్ప మంత్రం. — వివేకానంద

  • గాయత్రి మంత్రం కామరుచి నుండి తప్పించి రామ రుచి వైపు (రామ రుచి వైపు) మళ్ళించును. — రామతీర్ధ

  • వర్తమాన చికిత్సా పద్ధతి సర్వవిధముల ధర్మ రహితమయ్యెను. విధి ప్రకారం ప్రతిరోజు గాయత్రి జపం చేయువాడు ఎన్నటికీ రోగ గ్రస్థుడు కాజాలడు - గాంధీ

గాయత్రీ మంత్రం వీడియో యు.ఆర్. యల్. లు చూడండి 

అగ్ని గాయత్రీ 

Agni Gayatri Mantra | Gayatri Mantra of Lord Agni | 108 Times ...

ఈ పేజీని అనువదించు

ఇంద్ర గాయత్రీ 

శోథన ఫలితాలు

Sri Indra Dev Gayatri Mantra - श्री इंद्र देव गायत्री ...

కామ గాయత్రీ 

Kama (Kamdev) Gayatri - Marriage & Love Mantra - YouTube

https://www.youtube.com › watch

కృష్ణ గాయత్రీ 

శోథన ఫలితాలు

Krishna Gayathri Mantra - Japa Mantra 108 - YouTube

Ganesh Gayatri Mantra - Powerful Mantras for Success ...

Guru Gayatri Mantra | Popular Sanskrit Mantra - YouTube


చంద్ర గాయత్రీ 

CHANDRA GAYATHRI | GAYATHRI MANTRAS ... - YouTube




తులసి గాయత్రీ 

04. Thulasi Gayathri Mantram - Krishna Gayathri By S. Janaki ...

 - ఈ పేజీని అనువదించు
దుర్గా గాయత్రీ

Durga Gayatri Mantram 108 Times | దుర్గ గాయత్రి ...

Narayan Gayatri Mantra 108 Times with Lyrics | नारायण ...

Nrusimha Gayathri - YouTube

పృథ్వీ గాయత్రి 

బ్రహ్మ గాయత్రి


Brahma Gayatri Mantra Full with Lyrics - Must Listen Everyday ...


https://www.youtube.com › watch
 - ఈ పేజీని అనువదించు

యమ గాయత్రి


Yam Gayatri Mantras for Divine Grace - YouTube


https://www.youtube.com › watch
 - ఈ పేజీని అనువదించు

రాధా గాయత్రి


Radha Gayathri Mantram - YouTube


https://www.youtube.com › watch
 - ఈ పేజీని అనువదించు

శ్రీ రామ గాయత్రీ 

Sri rama Gayathri Full Song || Telugu Devotional Songs || Sri ...



లక్ష్మీ గాయత్రి

Lakshmi Gayatri Mantra | लक्ष्मी गायत्री मंत्र ...


వరుణ గాయత్రి 

Varuna Gayatri Mantra | Gayatri Mantra of Lord Varuna | 108 ...


విష్ణు గాయత్రీ 

Vishnu Gayathri Mantra - YouTube

Shani Gayatri Mantra 108 times By Ravindra SatheI I Full ...

SHIV GAYATRI MANTRA | Keep Away the Negative Energy ...

ఈ పేజీని అనువదించు

సరస్వతి గాయత్రీ 

సరస్వతీ గాయత్రీ మంత్రం - ఈ పాట వింటే ధన ...

సీత గాయత్రీ 

శోథన ఫలితాలు

Sita Gayatri Mantra - Powerful Mantra for Blissful Marital Life ...

సూర్య గాయత్రి

శోథన ఫలితాలు

Surya Gayathri | New Malayalam Devotional Song ... - YouTube

Shri Hanuman Gayatri Mantra - 108 Times Powerful Chanting ...

 


శ్రీ హయగ్రీవ గాయత్రీ 

శోథన ఫలితాలు

Sri Hayagriva Gayatri Mantra – Powerful Mantra for ... - YouTube

HAMSA GAYATHRI | GAYATHRI MANTRAS ... - YouTube


అయ్యప్ప గాయత్రి 

Swami Ayyapaa Gayatri Mantra | Ayyapaa Gayatri ... - YouTube

 - ఈ పేజీని అనువదించు
శ్రీ శ్రీనివాస గాయత్రి 

శ్రీ శ్రీనివాస గాయత్రీ మంత్రం | ఈ పాట వింటే ...


షణ్ముఖ(కార్తికేయ )గాయత్రి 

Shanmukha Gayatri Mantra - 108 Times Chanting - Powerful ...

 - ఈ పేజీని అనువదించు


Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share
and subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.