శరీరం లో కొవ్వు తగ్గి నాజూకుగా అవడానికి అద్భుతమైన 11 రకాలైన ఆహార పదార్థాలు
నీరు:
పుదీనా
కొన్ని పుదీనా ఆకులను తీసుకుని వాటిని బాగా నలిపి రసం తీయాలి. ఆ రసాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఉదయాన్నే తాగాలి. దీంతో పొట్ట దగ్గర అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఇలా చేయడం వల్ల శరీర మెటబాలిజం కూడా పెరుగుతుంది. ఇది క్యాలరీలను కరిగించడంలో తోడ్పడుతుంది.
అలోవెరా జ్యూస్
ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు అలోవెరా జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో బాగా కలిపి తాగాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. శరీరంలో అదనంగా కొవ్వు చేరదు. అంతేకాదు మలబద్దకం ఉన్నా పోతుంది.
పుచ్చకాయ
భోజనానికి ముందు పుచ్చకాయ ముక్కలను తినాలి. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది మనం తినే ఆహారాన్ని తగ్గించి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
బీన్సూ
బీన్స్ నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటున్నా ఫలితం ఉంటుంది. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. చాలా సేపు ఉన్నా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో ఆహారం తినడం తక్కువై బరువు తగ్గుతారు.
కీరదోసకాయ
కీరదోసకాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో భోజనానికి అరగంట ముందు ఉదయం, సాయంత్రం వేళల్లో తాగితే కొవ్వు కరిగిపోతుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగించి ఎక్కువ ఆహారం తినకుండా చేస్తుంది.
టమాటాలు
రోజూ ఉదయాన్నే పరగడుపున బాగా పండిన 1 లేదా 2 టమాటాలను తినాలి. దీంతో పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరిగిపోతుంది. టమాటాల్లో ఉండే 9 ఆక్సో ఓడీఏ అనే పదార్థం రక్తంలో ఉన్న కొవ్వును తొలగిస్తుంది
అల్లం :
మన శరీరానికి మేలు చేసే అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు అల్లంలో ఉన్నాయి. ఇది కొవ్వును కరిగించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంత అల్లం రసం కలుపుకుని తాగుతున్నా ఫలితం ఉంటుంది.
వెల్లుల్లి :
శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే యాంటీ ఒబెసిటీ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. నిత్యం కొన్ని వెల్లుల్లి రేకులను ఉదయాన్నే తినగలిగితే చాలు. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.
బాదంపప్పు
బాదంపప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో తోడ్పడుతాయి. ప్రతి రోజూ కొన్ని బాదం పప్పులను తింటే ఫలితం ఉంటుంది.
యాపిల్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి