ఇంద్రజాల మహేంద్రజాలాలను వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు జానపదబ్రహ్మ బి.విఠలాచార్య
 |
బి విఠలాచార్య |
బి.విఠలాచార్య (జనవరి 20, 1920 - మే 28, 1999) 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ బాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఈయన 1920 జనవరి 28 న కర్ణాటకలో ఉడిపిలో జన్మించారు. కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలనా చూశారు. సినీ వెండి తెరపై ఇంద్రజాల మహేంద్ర జాలాలను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు బి.విఠలాచార్య తనదైన బాణీతో జానపద చిత్రాలకు ఓ ఊపు తీసుకు వచ్చిన మహా దర్శకుడాయన.
బాల్యం నుంచి నాటకాలు మరియు యక్షాగానలలో ఆయన ఆశక్తి చూపించే వారు. ఇతని తండ్రి గారు ఒక ప్రసిద్ధ ఆయుర్వేదిక్ డాక్టర్. ఇతను మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. తొమ్మిదేళ్ల వయస్సులో తన మంచి భవిష్యత్ కోసం ఇంటిని అతను వదిలిపెట్టాడు. తన కజిన్ నుండి ఉడిపి రెస్టారెంట్‌ను కొనుగోలు చేశాడు. కొంతకాలం అతను ఈ హోటల్ విజయవంతంగా నడిపించాడు. అతను కొంతమంది మిత్రులతో పాటు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. జైలు కెళ్ళాడు జైలు నుండి విడుదలైన తరువాత, అతను తన హోటల్ వ్యాపారాన్ని తన సోదరులకు అప్పగించారు.
అతను హస్సన్ జిల్లాలో స్నేహితుడు శంకర్ సింగ్ మరియు ఇతరులుతో కలిసి ఒక టూరింగ్ థియేటర్ స్థాపించాడు. ఆయన ప్రతిరోజూ టూరింగ్ సినిమాలు నడిపేవాడు అందులో ఇతను ఎగ్జిక్యూటివ్ భాగస్వామి గా ఉండేవారు. ఈ చిత్రాలు చూసి ఆచరణాత్మకంగా చిత్రనిర్మాణ సాంకేతికతను నేర్చుకున్నాడు.
బి.విఠలాచార్య బియోగ్రఫీ:
- జనవరి 20, 1920, ఉడుపి, కర్ణాటక, భారత దేశం లో జన్మించారు.
- ఇతర బిరుదులు జానపద బ్రహ్మ
- వృత్తి సినీ దర్శకుడు, విఠల్ ప్రొడాక్షన్స్
- క్రియాశీలక సంవత్సరాలు 1944 To 1993
- జీవిత భాగస్వామి జయలక్ష్మి
- ఈయనకు ఒక భార్య, నలుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు కలరు.
- ఈయన మే 28, 1999 (వయసు 79) మరణించారు.
ఇతరవివరాలు:
- తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు.
- ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు ఎన్. టి.రామారావు నటించినవే అందులో 5 చిత్రాలను విఠలాచార్యేస్వయంగా నిర్మించాడు
- ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు. అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది.
- తక్కువ సినిమా సెటింగ్స్ తో ప్రాంతీయ ఖర్చుతో ఆయన కనులకింపైన జానపద కళా ఖండాలను రూపొందించేవారు.
- 1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఈయన నిర్మాతగా డి.శంకర్ సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకముపై నిర్మించారు. వీటిలో సాంఘీక చిత్రాలే అధికము.
- తొలిసారిగా తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వము వహించాడు.
- యన్టీఆర్ తో విఠలాచార్య చిత్రాలతో విజయయాత్ర చేశారు. వారిద్దరి కాంబినేషన్ తో రూపొందిన చిత్రాల్లో తొంభైశాతం కమర్షియల్ సక్సెస్‌ను చూడడం విశేషం.
- జానపదాలు అనగానే తెలుగునాట యన్టీఆర్, బి.విఠలాచార్య కాంబినేషనే పలువురికి గుర్తుకు వచ్చేలా వారు సాగారు.
- యన్టీఆర్ తరువాత విఠలాచార్య కాంతారావుతో ఎక్కువ చిత్రాలు రూపొందించారు. ప్రేక్షకుల మదిలో కాంతారావుకు సైతం జానపదకథానాయకునిగా
సుస్థిరస్థానం కల్పించింది విఠలాచార్య గారి సినిమాలే.
- ఓ సినిమా యన్టీఆర్ తో తీస్తే, మరో సినిమా కాంతారావుతో తీస్తూ ముందుకు సాగారు విఠలాచార్య ఇద్దరితోనూ ‘చిక్కడు-దొరకడు’ రూపొందించి ఆ రోజుల్లో కాసుల వర్షం కురిపించారు దర్శక బ్రహ్మ విఠలాచార్య.
- కొంతకాలం పటు విఠలాచార్య మార్కు చిత్రాల హవా తగ్గింది
- ‘జగన్మోహిని’ చిత్రంతో మళ్ళీ తనదైన బాణీ పలికించారాయన.
- ఈ సినిమా దెయ్యాల చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలచింది.
- విఠలాచార్య లేకపోయినా, ఆయన ట్రెండ్ ఈ నాటికీ జనాన్నితెలుగు భారతీయ సినీ వినీలాకాశం లో అలరిస్తూనే ఉంది.
ఆయన దర్శకత్వము వహించిన చిత్రాలు :
సం.లు
|
చిత్రం
|
భాష
|
నటులు
|
దర్శక నిర్మాతలు
|
1953
|
రాజ్య లక్ష్మి
|
|
|
దర్శకుడు నిర్మాత
|
1954
|
కన్యాదానం
|
|
|
దర్శకుడు నిర్మాత
|
| | | | |
1956
|
వద్దంటే పెళ్లి
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1957
|
జయవిజయ
|
కన్నడ
|
|
దర్శకుడు నిర్మాత
|
1957
|
మనే తుంబిడ హేను
|
కన్నడ
|
|
నిర్మాత
|
1958
|
అన్న చెల్లెలు
|
తెలుగు
|
|
దర్శకుడు
|
1958
|
మనే తుంబిడ హేను
|
కన్నడ
|
|
దర్శకుడు
|
1958
|
పెళ్లి మీద పెళ్లి
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1959
|
పెన్ కులాటిన్ వేళ్ళకు
|
తమిళ్
|
|
దర్శకుడు
|
1960
|
అన్నా చెల్లెలు
|
తెలుగు
|
|
దర్శకుడు
|
1960
|
కనకదుర్గా పూజ మహిమ
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1961
|
వరలక్ష్మి వ్రతం
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1962
|
ఖైదీ కన్నయ్య
|
|
|
దర్శకుడు
|
1962
|
మదన కామరాజు కథ
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1963
|
బందిపోటు
|
తెలుగు
|
|
దర్శకుడు
|
1963
|
గురువును మించిన శిష్యుడు
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1963
|
నవగ్రహ పూజ మహిమ
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1963
|
వీర కేసరి
|
కన్నడ
|
|
దర్శకుడు
|
1964
|
అగ్గిపిడుగు
|
తెలుగు
|
యన్ .టి.ఆర్.
|
దర్శకుడు నిర్మాత
|
1965
|
జ్వాలా దీప రహస్యం
|
తెలుగు
|
కాంతారావు
|
దర్శకుడు
|
1965
|
మంగమ్మ శపధం
|
తెలుగు
|
యన్ .టి .ఆర్ .
|
దర్శకుడు
|
1965
|
విజయ సింహ
|
కన్నడ
|
|
దర్శకుడు
|
1966
|
అగ్గిబరాటా
|
తెలుగు
|
యన్ .టి.ఆర్
|
దర్శకుడు నిర్మాత
|
1966
|
ఇద్దరు మొనగాళ్లు
|
తెలుగు
|
|
దర్శకుడు
|
1967
|
చిక్కాడు దొరకదు
|
తెలుగు
|
|
దర్శకుడు
|
1967
|
పిడుగు రాముడు
|
తెలుగు
|
|
దర్శకుడు
|
1967
|
అగ్గిదొర
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1968
|
భలే మొనగాడు
|
తెలుగు
|
|
దర్శకుడు
|
1968
|
కదలదు వదలదు
|
తెలుగు
|
|
దర్శకుడు
|
1969
|
గండి కోట రహస్యం
|
తెలుగు
|
యన్ .టి.ఆర్
|
దర్శకుడు
|
1969
|
అగ్గి వీరుడు
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1970
|
అలీబాబా 40 దొంగలు
|
తెలుగు
|
యన్ .టి .ఆర్
|
దర్శకుడు
|
1970
|
లక్ష్మి కటాక్షం
|
తెలుగు
|
యన్ .టి .ఆర్
|
దర్శకుడు
|
1971
|
రాజకోట రహస్యం
|
తెలుగు
|
యన్ .టి .ఆర్
|
దర్శకుడు
|
1971
|
సి.ఐ .డి
|
|
|
దర్శకుడు
|
1972
|
బీదల పాట్లు
|
తెలుగు
|
ఏ .యన్ .ఆర్
|
దర్శకుడు నిర్మాత
|
1973
|
పల్లెటూరి చిన్నోడు
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1974
|
ఆడదాని అదృష్టం
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1975
|
కోటాలో పాగా
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1978
|
జగన్మోహిని
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1979
|
గంధర్వ కన్య
|
తెలుగు
|
|
దర్శకుడు నిర్మాత
|
1980
|
మదన మంజరి
|
|
|
దర్శకుడు నిర్మాత
|
1983
|
నామమోహిని
|
|
|
దర్శకుడు నిర్మాత
|
1984
|
జై భేతాళ 3 డి
|
|
నరసింహరాజు
|
కథ ,స్క్రీన్‌ప్లే
|
1985`
|
మోహిని శపధం
|
|
|
దర్శకుడు నిర్మాత
|
1986
|
వీర ప్రతాప్
|
|
|
దర్శకుడు
|
1987
|
శ్రీ దేవి కామాక్షి కటాక్షం
|
తెలుగు
|
కే.ఆర్ విజయ రమ్యకృష్ణ
|
దర్శకుడు
|
1991
|
శ్రీ శైల భ్రమరాంబిక మహత్యం
|
తెలుగు
|
నరసింహరాజు కే. విజయ
|
దర్శకుడు
|
1992
|
కరుణించిన కనకదుర్గ
|
తెలుగు
|
కే.ఆర్. విజయ
|
దర్శకుడు
|
అప్పట్లో ఈయన చిత్రాలను యువకులు వృద్దులు విపరీతంగా చూసేవారు. ఇప్పటికి ఆనాటి ప్రజలు ఈ చిత్రాలను టి.వి లలో కంప్యూటర్ ఛానళ్లలో ఇష్టంగా చూస్తున్నారు.
ఇతర ముఖ్య విశేషాలు:
- ఎన్.టి.రామారావు, కాంతారావులిద్దరికీ ‘మాస్ ఫాలోయింగ్’ తెచ్చింది విఠలాచార్య చిత్రాలే. వీటిలో నటీనటులే కాకుండా, పక్షులూ, జంతువులూ కూడా పాత్రధారులు. ‘ట్రిక్‌వర్క్’కి ఆయన చిత్రాలు ప్రాధాన్యం కల్పించేవి. ‘లాజిక్’ అక్కర్లేదు, ‘అదెందుకు జరిగింది?’ అని అడగడానికి లేదు. ‘ఏమీ అక్కర్లేదు. ప్రేక్షకుల్ని
ఆహ్లాదపరచడమే ముఖ్యం. ఇది ‘కమర్షియల్ ఆర్ట్’ అనబడే సినిమా.
- మన ప్రేక్షకులు క్లాస్ సినిమాలు చూడరు. మాస్ చిత్రాలు అనబడేవాడినే ఎక్కువగా చూస్తారు. అందుకే అవే ఎక్కువగా తీశాను. ‘తక్కువ ఖర్చు పెట్టి, ఎక్కువ లాభం పొందాలి’ అన్న సూత్రం కూడా నమ్ముకున్నాను’ అని విఠాలాచార్య చెప్పేవారు
- సినిమా నిర్మాణంలో ‘పొదుపు’ ఎలా చెయ్యాలి? అన్న దారి చూపించిన వ్యక్తి కూడా ఆయనే. ఒకే పెద్ద మందిరం సెట్టు వేస్తే, దాన్నే రకరకాల సెట్లుగా మార్చేవారు ఆయన. అంత:పురం రాజుగారి రహస్యమందిరం, విలన్ ఇల్లూ, ఇంకొక రాజుగారి ఇల్లూ అన్నీ ఒకే ఒక సెట్లో ఇమిడిపోయేవి. సామాన్య జనానికీ, సినిమా చూట్టంలో లీనమైపోయే ప్రేక్షకులకీ ఈ తేడాలు అక్కర్లేదని విఠలాచార్య విశ్వసించేవారు.
- అలాగే కాస్ట్యూమ్స్,
ఆభరణాలూ, ప్రతి సినిమాకీ మార్చవలసిన అవసరం లేదు ముఖ్యపాత్రకి తప్ప. ‘నటీనటుల కాల్ షీట్లు గల్లంతైతే, వాళ్లని చిలకలుగానో, కోతులుగానో మార్చడం ఆయనకే చెల్లింది’ అని ఒక సందర్భంలో కాంతారావు చెప్పారు.
- విఠలాచార్య ఎంతో దక్షతా, బాధ్యతా గల నిర్మాత. నటీనటులకీ, టెక్లీషియన్లకీ తాను ఇస్తానన్న మొత్తాన్ని విభజించి ప్రతినెలా ఒకటో తేదీకల్లా - చిన్నా, పెద్దా అందరికీ చెక్కులు పంపించేసేవారు. ఏది వచ్చినా రాకపోయినా విఠలాచార్య గారి చెక్కు వచ్చేస్తుందన్న నమ్మకం అందరికీ వుండేది. ఈ విధానం అరుదు! అలాగే నటీనటులకి కాల్ షీట్స్ అడ్జస్ట్ చెయ్యడంలో కూడా ఆయన ‘నంబర్‌వన్’ అనిపించుకునేవారు.
- ముందుగా చెబుతే, ఒప్పుకున్న డేట్స్‌ని అటూ, ఇటూగా మార్చి చిన్న, పెద్ద నటీనులందిరికీ, సహాయపడేవారు. వేషాలకోసం ఆఫీసులకి వెళ్తే సాధారణంగా డైరెక్టర్లు, నిర్మాతలూ వాళ్లని చూసేవారు కాదు. మేనేజర్ అడ్రస్ తీసుకుని పంపేస్తాడు. విఠలాచార్య అలా కాదు. వచ్చిన ప్రతీవాళ్లనీ
తన గదిలోకి పిలిచి, కూచోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడి పంపించేవారు. ఈ విధానం కూడా అరుదే.
- స్క్రిప్టు ముందు రాయించుకుని, షెడ్యూల్సు వేసుకుని టైముకి ముందుగానే షూటింగ్ పూర్తిచేసి, అనుకున్న తేదీకి సినిమా విడుదల చెయ్యడం ఆయనకే చెల్లింది. సినిమా ఆరంభించకముందే - విడుదల తేదీ ఇవ్వడం ఎంతమందికి సాధ్యం? సినిమా పరిశ్రమలో ఇదికూడా అరుదే! ఇలాంటి అరుదైన వాటిని అమలుపరిచిన విఠలాచార్య జానపద చిత్రాలకి ఆదరణ తగ్గుతోందన్న ఆలోచనలో అక్కినేని నాగేశ్వరరావుతో ‘బీదల పాట్లు’ తీశారు.
- తన టెక్నీషియన్లందరినీ మార్చి, నటీనటుల్నీ మార్చి మంచి క్వాలిటీతో చిత్రం రావాలని - కృషి చేసి తీశారు. తన విధానానికి భిన్నంగా తీశారు. ‘చిత్రం ఉత్తమంగా వుంది’ అని అందరూ ప్రశంసించారు. కాని డబ్బు రాలేదు. ‘విఠలాచార్య సినిమా ఇలావుందేమిటి?’ అన్నారంతా. ‘నా పేరు కాకుండా ఇంకొకరి పేరు వేసివుంటే బాగా నడిచేదేమో!’ అని వ్యాఖ్యానించారు
విఠలాచార్య.
- ‘ఏది అలవాటు చేస్తే ఆ ధోరణిలో వెళ్లడమేశ్రేయస్కరం’ అన్నది ఆయన అనుభవం చెప్పిన నీతి.
ఇంకా ఇంగ్లీష్ లో తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి...
విఠలాచార్య బయోగ్రఫీ ఇతర వివరాలు వీడియో యు .ఆర్.యల్ లు చూడండి...
B. Vittalacharya - Topic - YouTube
https://www.youtube.com/channel/UC9CYCIkTY0o86ZS9ZrxbGkA