General News,Humanity,Mythology,Psychology,Health, Employment,Biographies

ప్రియమైన మిత్రులకు, మన wowitstelugu.com కు స్వాగతం-సుస్వాగతం సాధారణ వార్తలు,మానవత్వం, విశ్వాసాలు, మానసిక శాస్త్రం,ఆరోగ్యం,ఉద్యోగం,జీవిత చరిత్రలు, మున్నగునవి తెలుగులో తెలుగు భాష తెలిసిన వారందరికీ అర్దమైయే లా ఈ బ్లాగ్ లో పొందుపరచడం జరిగింది. బ్లాగ్ చదివి మీ విలువైన సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను . ఇట్లు .బ్లాగ్ అడ్మిన్ .

▼

5, అక్టోబర్ 2021, మంగళవారం

నవరాత్రి ఉత్సవాలులో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం ఒక్కో నైవేద్యం దాని ప్రత్యేకతలు

wowitstelugu.blogspot.com

నవరాత్రి ఉత్సవాలులో  అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం ఒక్కో నైవేద్యం  దాని ప్రత్యేకతలు


👉  దేవీ భాగవతంలో బ్రహ్మ ,విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అమ్మవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. శక్తిస్వరూపిణి నుంచే సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులు ఉద్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు పరమేశ్వరి తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు.   

👉 మహిషాసుర సంహారం కోసం జగన్మాత  ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఒక్కో రూపంలో యుద్ధం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు. శక్తిస్వరూపిణి అయిన జగన్మాత  దేవీ భాగవతంలో బ్రహ్మ ,విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అధిక ప్రాధాన్యత కల్పించారు. 

👉 విజయం చేకూరాలంటే శక్తిని అందుకోవడం తప్పనిసరి.జగన్మాత  పూజ తప్పని సరి అని హిందువు ల విశ్వాసం.

ప్రథమా శైలపుత్రి, ద్వితీయ బ్రహ్మచారిణి,తృతీయ చంద్ర ఘంటేతి ,కూష్మణ్ డేతి చతుర్థికి, పంచమ స్కంద మాతేతి, షష్టా కాత్యాయనేతి చ, సప్తమా కాళరాత్రీ చ, ఆస్తమాచాతి భైరవి, నవమా సర్వ సిద్దిశ్చేతి, నవదుర్గాహః  ప్రకీర్తితాః|| 

1. శ్రీ బాలత్రిపురసుందరిదేవి

అమ్మ బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అను గ్రహిస్తుంది.

మొదటి రోజు ప్రసాదం పొంగల్

పొంగల్ కి వలసిన పదార్దాలు
పెసరపప్పు 150 గ్రాం
కొత్త బియ్యం 100 గ
మిరియాలు 15
పచ్చిమిరప కాయలు 6
పచ్చి కొబ్బెర 1 కప్
కాచిన నెయ్యి 1/4 కప్
జీడిపప్పు 15
జీర 1/2 టేబల్ స్పూన్
ఆవాలు 1/4 టేబల్ స్పూన్
ఎండుమిర్చి 3
మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్
కోత్తమిర , కరేపాకు , తగినంత
ఉప్పు రుచిని బట్టి
ఇంగువ 2 చిటికెళ్ళు.

చేయవలసిన విధానము

దళసరి పాత్రలొ లో కాస్త నేయి వేడి చేసి
పెసరపప్పుని దోరగా ఏయించండి .బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా బాగా వేయించండితెలుపు రంగు పోకూడదు సుమా 5 నిమిషాలు
వేపితే చాలు పెసరపప్పుకూడ కలర్ మార కూడదు,
అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి
జీడిపప్పులను వేయించి పెట్టడి.సన్నగా తరిగిన పచ్చి మిర్చిపచ్చికొబ్బెర కోరి , జీలకర్ర మిరియాలు వేయించిన బియ్యం
పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో
కుక్కర్లో వుంచి 3 whistles / కూతలు వచ్చాక ష్టవ్ కట్టివేయడం చేయండి.
చల్లారాక అందులో ఆవాలు , మినపప్పు , శనగపప్పు , జిలకర్ర , ఎండుమిర్చి ,ఇంగువ, కరేపాక్ వేసి తాలింపు పెట్టిమిగిలిన నేయ్యి అంతా పొంగలిలో వేసివేడి వేడి ప్రసాదము ఆతల్లి త్రిపురసుందరీదేవికి నైవేద్యంపెట్టి భక్తిగా పూజించి ఈ దసరా 10 రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ అని ప్రార్ధించాలి .

2. గాయత్రి దేవి అలంకారం

రెండవ రోజు ప్రసాదం పులిహోర

పులిహోర కి కావలసినవి పదార్దాలు

బియ్యం 150 గాం
చింతపండు 50 గ్రాం
పసుపు1/2 స్పూన్
ఎండుమిర్చి 5
ఆవాలు 1/2 స్పూన్
మినపప్పు 1 స్పూన్
శనగ పప్పు 2 స్పూన్
వేరు శనగ పప్పు 1/2 కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
ఇంగువ చిటికెడు
నూనె 1/4 కప్పు
ఉప్పు తగినంత
బెల్లం కొద్దిగా

ప్రసాదంచేయు విధానం:

అన్నం వండి చల్లార్చి పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి .చింతపండును అరకప్పు నీళ్ళు పోసి నాన పెట్టి ,చిక్కటి గొజ్జు తీసి పెట్టండి, మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గుజ్జు వేసి కాస్తబెల్లం వేసి బాగా వుడికించండి (కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చుగుజ్జులో) వుడికిన గుజ్జు అన్నంలో కలిపండి . బాణలి లో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండు మిర్చి , వేసి ఆ వాలు చిటపట అన్న తరువాతవేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కరేపాక్ వేసి , అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడీవ్వగానే శ్రీ జగదీశ్వరీ మాతైన ఆ గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము.

3. అన్నపూర్ణా దేవి

మూడవ రోజు కొబ్బెరన్నం ప్రసాదం

కొబ్బెరన్నం కు కావలసిన ప్రసాదాలు

బియ్యం 1/2 కిలో
తురిమిన పచ్చికొబ్బెర 1 కప్
పచ్చిమిర్చి 5
కరేపాక్ , కోత్తమిర , ఉప్పు .
పోపు సామాగ్రి ఎండుమిర్చి , ఇంగువ .
జీడి పప్పు 10
నూనె , 1/4 కప్
నెయ్యి 1 టెబల్ స్పూన్
ప్రసాదం చేయు విధానం :
అన్నం పోడి పోడి గా వండుకొనిపచ్చికొబ్బెర కాస్త నేతిలో వేయించి ఈ వేగిన కొబ్బెర అన్నంలో కలిపండి . అదే మూకుడులో నూనె వేసి పోపుసామాగ్ర వేసి ఎండుమిర్చి , ఇంగువ , వేసి ఆవాలు చిటపట చిటపట అనగానేపొడవుగా తరిగిన పచ్చిమిరప కాయలు , కరే పాక్ , కోత్తమిర, అందులో వేసి తీసేయండి ఈ వేగనిచ్చినదంతా అన్నంలో కలిపి ఉప్పు జీడిపప్పుకూడ వేసి పైన కాస్త కోత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బెరన్నం రెడి . శ్రీ అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి మనస్సు పూర్తిగా ప్రార్థించి అమ్మ కృప కు పాత్రులవుదాము.

4 . కాత్యాయనీ దేవి  అలంకారం 

నాల్గవ రోజు ప్రసాదం అల్లం గారెలు.

అల్లం గారెల కు కావలసిన పదార్దాలు

మినపప్పు2 కప్స్
అల్లం చిన్న ముక్క
పచ్చిమిరప కాయలు 6 సన్నగా తరిగినవి
జీరా 1/4 స్పూన్
ఉప్పు రుచికి తగినంత
కరేపాక్ , కోత్తమిర తగినంత
నూనె గారెలు వేయించేందుకు

ప్రసాదం చేయు విధానం:

మినపప్పు బాగా కడిగి 4 , 5 , గంటలు (hours) నానపెట్టి ( లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి ). నానిన మినపప్పును గ్రైండర్లో వేసి , ఉప్పు , కాస్త సోడ , వేసి బాగా గ్రైడ్ చేసుకోండి . ఆ పిండిలో అల్లం,పచ్చిమిరప కాయలు కరివేపాకు, కోత్తమిర , సన్నగా తరిగి వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌడుగా అదిమి నూనెలో విడచాలి . దోరగా వేగిన వడలను , సహస్రనామాలతో ఆ శ్రీ లలితాదేవి కి ఆరాధించి నైవేద్యం పెట్టి ఆశీర్వాదం పొందుదాము

5. లలితాదేవి. అలంకారం 

ఐదవ రోజు ప్రసాదం దద్ధోజనం ( పెరుగన్నం )

కావలసిన పదార్దాలు :

బియ్యం 1/4 కిలో
పాలు 1/2 లీ
చిక్కటి పెరుగు 1/2 లీ
నూనె 1/2 కప్పు
నెయ్యి 1 స్పూన్
కొత్తమిర , కరివేపాకు
చిన్న అల్లం ముక్క
పచ్చిమిర్చి
పోపు సామాగ్రి
జీడిపప్పు 20
ఉప్పు , ఇంగువ ఎండుమిర్చి

ప్రసాదం చేయు విధానం:

ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక కాచినపాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి, సన్నగా తరిగిన మిరపకాయలు, కొత్తమిర ,కోరిన అల్లం ,అన్నీరెడ్డిగ్గా వుంచుకొని ష్టవ్ పై మూకుడుంచి అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసిఎండుమిర్చి ఇంగువ తో పాటు తరిగి వుంచిన వన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపికాస్త నేతిలో జీడి పప్పులు వేయించి అవీవేయండి. రుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ. ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి.

6. శ్రీ మహాలక్ష్మిదేవి అలంకారం

ఆరవ రోజు ప్రసాదం రవ్వ కేసరి

రవ్వ కేసరి కి కావలసిన పదార్దాలు
రవ్వ 1 కప్
షుఘర్ 3/4 కప్
నెయ్యి 2 టెబల్ స్పూన్
కేసరి కలర్ / చిటికెడు.
యాలకులు 4
ఎండు ద్రాక్షా 6
జీడిపప్పు 10
మిల్క్ 1 కప్ ( మిల్క్ మేడ్ 1 )
వాటర్ 1/2 కప్
తయారు చేసే విధానం:
ముందు మూకుడులో కాస్త నెయ్యి వేసి రవ్వ దోరగా వేయించి తీసి ప్లేట్ లోవేసివుంచండి .
మూకుడులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు , ఎండుద్రాక్షవేయించితీసివుంచండి .నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా మరగనివ్వాలి. అందులో కేసరి కలర్ ,చెక్కర, రవ్వ వేసి నెయ్యి వేస్తూ బాగా కలిపి అందులో ఎండు ద్రాక్షా ,జీడిపప్పు ,మిగిలిన నెయ్యి అంతా వేసి బాగా కలిపి వేడి వేడి గా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి నైవేద్యం గా పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రార్దించి నైవేద్యం పెట్టండి.

7. మహా సరస్వతి దేవి అలంకారం 

కదంబం ప్రసాదం ఏడవ రోజు 

కదంబం ప్రసాదం తయారీ విధానం

కావలసిన పదార్దాలు
కందిపప్పు 1/2 కప్
బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )
1 వంకాయ
1/4 సొర్రకాయ
1 దోసకాయ
బీన్స్ తగినన్ని
1 పోటాటో
వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు
2 మొక్కజొన్నలు
1/2 క్యారెట్
2 టోమాటో
తగినంత కరివేపాకు
కోత్తమీర
కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప
4 పచ్చి మిర్చి
నూనె తగినంత
నెయ్యి చిన్న కప్పు
చింతపండు గొజ్జు తగినంత
కాస్త బెల్లం ( జాగిరి )
ఉప్పు , పసుపు తగినంత
3 చెంచాలు సాంబర్ పౌడర్
పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .

చేయవలసిన విధానము వివరాలు

ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి కుక్కర్లోకందిపప్పు ,బియ్యం ,పీనట్ ,టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి . మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాతపచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి బాగా వుడికిన తరువత ఆ గ్రేవి అంతావుడికినరైస్లోవేసి,కోత్తమీర ,కరేపాక్ ,నెయ్యి వేసిమరోసారి వుడికించండి అంతా బాగావుడికినతరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టికొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి

8. మహిషాసుర మర్ధిని అలంకారం

ఎనిమిదవ రోజు బెల్లం అన్నం

బెల్లం అన్నం కు కావలసిన పదార్దాలు

బియ్యం 100 గ్రాం
బెల్లం 150 గ్రాం
యాలకులు 5
నెయ్యి 50 గ్రాం
జీడిపప్పు 10

ప్రసాదం తయారు చేయు విధానం

ముందుగా బియ్యం కడిగి అరగంట నానని వ్వండి .తరువాత మెత్తగా వుడికించాలి .
అందులో తరిగిన బెల్లం వేసిమొత్తం కరిగెంత వరకు వుడికించాలి .జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తంఅన్నంలోకలిపిదించేయడమే .
తియ్యని కమ్మని నైవేద్యం సమర్పించి కొని అమ్మ కృప కు పాత్రులవుదాము.

9. రాజ రాజేశ్వరి దేవి అలంకారం
తొమ్మిదవ రోజు అమ్మవారి ప్రసాదం పరమాన్నం

పరమాన్నం కి కావలసిన పదార్దాలు:

చిక్కటి పాలు 6 కప్స్

( 1 టిన్ మిల్క్ మేడ్ )

బియ్యం 1 కప్,

Sugar 1,1/2 కప్స్,
ఎండు ద్రాక్ష ,
జీడిపప్పు 1/4 కప్
ఏలకలుపౌడర్ 1/2 స్పూన్
నెయ్యి 5 టేబల్ స్పూన్స్

పరమాన్నం చేయు విధానం

ముందు దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త నెయ్యి వేసిఅందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి తరువాత పాలు , ఏలక పౌడర్ , వేసి కుక్కర్`లో 2 విజిల్ వచ్చెంత వరకు వుంచండిఅది పక్కన పెట్టి చిన్న మూకుడు ష్టవ్ పై వుంచిఅందులో కాస్త నెయ్యి వేసి ఈ ఎండు ద్రాక్ష. ద్రాక్షా , జీడిపప్పు దోరగా వేయించి వుంచండి .చల్లారిన కుక్కర్ మూత ఓపన్ చేసి వుడికిన అన్నానికి చెక్కరవేసి ఒక్క 5 నిముషాలు మళ్ళీ వుడికించి ( అలా వుడికి నప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా కావాలి ) అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కస్త నెయ్యి వేసి వేడి వేడి గా ఆ రాజ రాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టండి.

10.వ రోజు ప్రధాన దేవత

ప్రధాన దేవత ను సర్వాభరణములతో అలంకారం.

పదవ రోజుఈ తొమ్మిది రోజులూ చేసిన అన్ని ప్రసాదములను నైవేద్యముగా ఏట్టాలి .

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో దేవీ నవరాత్రి అమ్మవారి అలంకారాలు నైవేద్యాలు చూడండి :


Devi Navarathrula Alankaralu & prasadalu || Poojalu - YouTube

దేవి నవరాత్రి అమ్మవారి అలంకారాలు నైవేద్యాలు - YouTube

Ammavari Alankaralu, Naivedyam for Dussehra Navatri

  

Nine Forms of Goddess Durga (అమ్మవారి విభిన్న అవతార


ఈ రోజు సూక్తి :
"If you chase anything in life chase the things that get you excited about living. Chase the things that give you hope, happiness, and a glimpse of a better life. Chase the things that make you want to be a better person. Chase the things that inspire you to think, create and live joyfully. Chase the things that reinforce in your soul that you can make a difference. Chase the things that make you want to transform your heart from selfish to selfless. When you chase that kind of storm you are chasing rainbows."
- Shannon L. Alder.


Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups: 

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com





వద్ద అక్టోబర్ 05, 2021
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

నా గురించి

నా ఫోటో
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.