General News,Humanity,Mythology,Psychology,Health, Employment,Biographies

ప్రియమైన మిత్రులకు, మన wowitstelugu.com కు స్వాగతం-సుస్వాగతం సాధారణ వార్తలు,మానవత్వం, విశ్వాసాలు, మానసిక శాస్త్రం,ఆరోగ్యం,ఉద్యోగం,జీవిత చరిత్రలు, మున్నగునవి తెలుగులో తెలుగు భాష తెలిసిన వారందరికీ అర్దమైయే లా ఈ బ్లాగ్ లో పొందుపరచడం జరిగింది. బ్లాగ్ చదివి మీ విలువైన సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను . ఇట్లు .బ్లాగ్ అడ్మిన్ .

▼

25, మార్చి 2021, గురువారం

లక్ష్మి అంటే ఎవరు? ఏ లక్ష్మీ మంత్రం పఠిస్తే ఎటువంటి ఫలితం కలుగు తుంది అష్టలక్ష్మీలు గురించి తెలుసు కోండి

wowitstelugu.blogspot.com

లక్ష్మి అంటే ఎవరు? ఏ లక్ష్మీ మంత్రం పఠిస్తే ఎటువంటి ఫలితం కలుగు తుంది అష్ట లక్ష్మీలు  గురించి  తెలుసు కోండి

లక్ష్మి హిందూ మత ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి, సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది. భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు.  లక్ష్మిదేవి చీర కట్టుకొని, అభరణాలను ధరించి చాలా అందంగా, ఆకర్షణీయంగా వుంటుంది. లక్ష్మిదేవి నాలుగు చేతులతో వుంటుంది, రెండు చేతులతో పుష్పాలను పట్టుకొని, రెండు చేతులతో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ వుంటుంది. ఈమె తామర పువ్వు మీద కూర్చుని సాధారణంగా ఏనుగులతో  ఉంటుంది.

లక్షి దేవికి  అనేక అవతారాలు కూడా ఉన్నాయి  (అంటే మానవుని రూపంలో లేదా మరే ఇతర రూపంలోనైనా భూమిపైకి వచ్చే దేవత).విష్ణు దేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా, అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వరస్వామి భార్య పద్మావతిగా, అవతరాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది. 

లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు.ప్రతి సంవత్సరం శ్రావణమాసం రెండవ శుక్రవారం, వరమహాలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మిదేవి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. దీపావళి సందర్భంగా, నవరాత్రి సందర్భంగా కూడా లక్ష్మి పూజలు జరుపుకుంటారు. శ్రీ అనే పదం సిరి పదానికి సమానం. అనగా సంపద, ఐశ్వర్యం యొక్క దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం, అందుకే ఆ లక్ష్యాలు అష్టలక్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత, లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మి కటాక్ష్యం పొందినట్లేనని భావన.

శ్రీ మహాలక్ష్మీ దేవి ముల్లోకాలలోను పూజించబడుతుంది. ఈమె శ్రీమహావిష్ణువు కు పట్టపు మహిషి. మాతోనే స్థిరంగా ఉండిపోవాలని మానవులందరూ అందరూ ఆమెను కోరుకుంటున్నారు. సాధారణంగా శుక్రవారం నుంచి మంత్రోపాసన మొదలుపెడతారు. పౌర్ణమి రోజు నుంచి కూడా ప్రారంభించవచ్చు. దీపావళి కూడా లక్ష్మీ మంత్రాన్ని పఠించడానికి అత్యుత్తమైన రోజు. జపమాల కానీ, స్ఫటిక మాలతో మంత్రపఠనాన్ని ప్రారంభించవచ్చు.


ఆర్థిక ప్రయోజనాలు సిద్దించే మంత్రం :

1. ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ: 

అనే మంత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.


అన్నిరంగాల్లో రాణించే మంత్రం :

2. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ: 

అనే మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లోనూ సమృద్ధి సాధిస్తారు.

సంతోషం  గా ఉండడానికి లక్ష్మీ  మంత్రం :

3. ఓం శ్రీం శ్రీ అయే నమ: 

మంత్రాన్ని పలకడం వల్ల సంతోషం లభిస్తుంది.

ఆధ్యాత్మిక వృద్ధి పొందడానికి లక్ష్మీ  మంత్రం :

4. ఓం మహాదేవ్యేచ విద్మహే, విష్ణు పత్నేచ దీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ 

అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం. ఈ మంత్రం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు.

ధనం, ఆనందం, విద్య, ఉద్యోగం, సంతానం, దైర్యం, విజయం, ఆరోగ్యాన్ని  పొందడానికి

5. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః

6. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ: అనే శుక్ర బీజ మంత్రాన్ని శుక్రవారం నాడు 108 సార్లు జపించాలి. 

పూజగదిని శుభ్రం చేసి, లక్ష్మీదేవి ముందు నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. శుక్ర బీజ మంత్రం. దీన్ని 108 సార్లు ప్రతి శుక్రవారం ఉచ్ఛరిస్తే పరిస్థితుల్లో మార్పులు తప్పకుండా వస్తాయట.

చెడును పారద్రోలి మంచిని పెంచి సుఖ సంతోషాలు పొందడానికి లక్ష్మీ  మంత్రం :

7. ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా। మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయా ఓం.

ఈ మహాలక్ష్మి మంత్రం చెడును అంతం చేసి సుఖసంతోషాలను కలగజేస్తుంది.

మంత్రం సిద్దులు ఫలించడానికి లక్ష్మీ  మంత్రం :

8. ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ శ్రింగ్ సిద్ధ లక్ష్మ్యై నమః 

ఏకాదశాక్షర సిద్ద మంత్రం వల్ల సిద్ధి పొందుతారు.

అష్ట లక్ష్మి లు ఎలా ఉంటారు పూజ ఫలితం

01 ఆదిలక్ష్మి :  

ఈమెను  "మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.

ఈమె వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉండే ఆదిమాత. అదే ఆదిలక్ష్మి. ఈ సృష్టికి మూలం నారాయణుడు అని కొందరు, కాదు అమ్మే అని మరి కొందరి విశ్వాసం నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరూ ఒక్కరే! లక్ష్మి దేవి చేతిలో కనిపించే కమలము పవిత్రతకు చిహ్నం, ఇందిరా దేవి అని కూడా ఈ రూపంలో ఈమెను పూజిస్తారు. 

ఆది లక్ష్మిని ఆరాధించుట వలన సంతోషం, పవిత్రత మనకు లభిస్తాయి.

02. ధాన్యలక్ష్మి :  

ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.

ధాన్యం అంటే పండించిన పంట అని అర్థం. అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించుట  వలన మన జీవితానికి కావల్సిన అన్ని రకాల విటమిన్స్, పండ్లు, ఆహారం మొదలైనవి అన్నీ సుఖంగా పొందుతాం.

పంటలు సరిగ్గా పండాలి అన్న అతి వృష్టి అనావృష్టిని కాపాడుకోవాలి అన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండవలసిందే!

03 .ధైర్యలక్ష్మి :   

"వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించింది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము  ధరించింది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.

ధైర్య లక్ష్మి పూజ ఫలితం కొంతమంది ఎన్నీ కష్టాలు ఉన్న ధైర్యంగా ఎదుర్కొంటారు, మరికొందరు పిరికిగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు మనకు కావలసిన అన్ని రకాల శక్తి  సామర్ధ్యాలు ఈ అమ్మ వలననే లభిస్తాయి

దీనికి ఒక కధ ప్రాచుర్యంలో ఉండేద ఒక మహారాజు గ్రహస్ధితి బాగుండక అష్ట లక్ష్ములు ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళి పోతుంటారు  చివరికి ధైర్యలక్ష్మి వంతు వస్తుంది కాని అప్పుడు ఆ రాజు ఈమెని తనని విడచి వెళ్ళవద్దు  వారందరూ వెళ్ళి పోయినా పర్వాలేదు ఒక్క నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు మళ్లీ వారందరినీ పొందగలనని విశ్వాసంగా వుంది. విడచి వెళ్ళవద్దు అని ప్రాధేయ పడతాడు.నిజమే ప్రతి మనిషికి ముఖ్యంగా కావాల్సింది మానసిక స్ధైర్యమే. అది ఉంటే ఎన్ని ఇబ్బందులు అయినా ధైర్యం గా ఎదుర్కోవచ్చు.  ఇది ధైర్య లక్ష్మి ప్రాధాన్యత.

04 .గజలక్ష్మి :  

రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని  వస్త్రములు ధరించింది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.

ఈ అవతారం దేవ దానవులు సముద్ర మధనం సాగించే సమయంలో సముద్రుని కూతురు గా ఈ రూపమ్లో ఉద్భవించినట్లు భాగవతం చెబుతుంది. రెండు ఏనుగులు అమ్మ ప్రక్కన నిలబడి జలధారని వర్షింప చేస్తూంటాయి ఇక్కడ ఏనుగులు మనం గణపతి స్వరూపంగా కూడ భావించవచ్చు.గజలక్ష్మి పూజ ఫలితం లక్ష్మి గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించుట వలన ఇల్లు, వాహనాలు వంటి భౌతిక సుఖాలు మనకు ఒనగూడుతాయి.

05. సంతానలక్ష్మి :  

ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించింది. వడిలో బిడ్డ కలిగి యున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉంది.

ఏ భార్య భర్తలకైనా తమ కుటుంబానికి కావల్సిన మొదటి సంపద సంతానమే.. అది లేకుంటే జీవితాన్ని నిస్సారం గా గడపవలసి వస్తుంది.. అలాగే కర్మ పరిపక్వత కూడా ఉండదు.. అందుకే ఈ శక్తి ని పూజించి తప్పక ప్రసన్నం చేసుకోవాలి.. అప్పుడే సంతానం పొందడమే కాకుండా వారికి సద్బుద్ధి, ధీర్ఘాయుస్సు లభిస్తాయి.

06. విజయలక్ష్మి :  

ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించింది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించింది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.

విజయ లక్ష్మీ పేరులోనే ఉంది పెన్నిది.. బాహ్య - అంతర్గత మనసుపై విజయం పొందాలని అన్నా.. శారీరకంగా, ఆర్ధికంగా ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై విజయం పొందాలి అంటే విజయ లక్ష్మి కృప ఉండి తీరవలసిందే.

07. విద్యాలక్ష్మి :  

శారదా దేవి.చదువులతల్లి.చేతి యందు వీణ వుంటుంది.

పాఠశాలలో, కళాశాల, విశ్వవిద్యాలయల్లో లభించే విద్యే కాదు.. ఏ తరహా విజ్ఞానం కావలన్న ఈమెను ఆశ్రయించ వలసినదే.. ఆధ్యాత్మికం.. భౌతికం ఎందులో ఏ విద్య అయినా మనకు అందులో దక్షత ఏర్పడాలి అంటే ఈ లక్ష్మి దయ మనకు ఉండవలసిందే. నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్ట లక్ష్ముల ప్రతీకలే!

08. ధనలక్ష్మి :   

ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖ చక్రాలు, కలశము, ధను ర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలో నున్నచేతినుండిబంగారునాణేలు  వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.

భూమిపై సంపద లేదా ధనం అంటే రూపాయలు బంగారు ఆభరణాలు కాదు.. పకృతిలో ఉండు అన్ని రకాల నదులు, ఫలవంతం అయిన చెట్లు, సమృద్ధిగా కురియు వర్షాలు ఇవ్వన్నీ సంపద క్రిందే వస్తాయి.. కనుక అవన్నీ మనకు ధన రూపంగా మార్చి ఇచ్చేది ఈ దేవతే.

అష్టలక్ష్మిలందరి స్తోత్రం

అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి

విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని

శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం

విడి విడి గా అష్ట లక్ష్మీ ల స్తోత్రం 

ఆదిలక్ష్మి

సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే

మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |

పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే

జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||

ధాన్యలక్ష్మి

అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే

క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |

జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||

మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే

ధైర్యలక్ష్మి

జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే

సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |

భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే

జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||

గజలక్ష్మి

జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే

రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |

హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||

సంతానలక్ష్మి

అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే

గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |

సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||

విజయలక్ష్మి

జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే

అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |

కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే

జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||

విద్యాలక్ష్మి

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే

మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |

నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే

జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||

ధనలక్ష్మి

ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే

ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |

వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే|

జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 || 


ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. లు చూడండి

శుక్రవారం రోజు లక్ష్మీదేవి ...

లక్ష్మీ దేవి కటాక్ష మంత్రం ...


ఈ మంత్రం పఠిస్తే చాలు ... - YouTube


అష్ట సౌభాగ్య లక్ష్మీ స్తోత్రం ...


Ashtalakshmi Stotram with English Lyrics By Bellur Sisters I ...


ASHTA LAKSHMI STOTRAM WITH TELUGU LYRICS - YouTube


Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups: 

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


ఈ రోజు సూక్తి 


"Inaction breeds doubt and fear. Action breeds confidence and courage. If you want to conquer fear, do not sit home and think about it. Go out and get busy."

-Dale Carnegie

వద్ద మార్చి 25, 2021
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

నా గురించి

నా ఫోటో
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.