General News,Humanity,Mythology,Psychology,Health, Employment,Biographies

ప్రియమైన మిత్రులకు, మన wowitstelugu.com కు స్వాగతం-సుస్వాగతం సాధారణ వార్తలు,మానవత్వం, విశ్వాసాలు, మానసిక శాస్త్రం,ఆరోగ్యం,ఉద్యోగం,జీవిత చరిత్రలు, మున్నగునవి తెలుగులో తెలుగు భాష తెలిసిన వారందరికీ అర్దమైయే లా ఈ బ్లాగ్ లో పొందుపరచడం జరిగింది. బ్లాగ్ చదివి మీ విలువైన సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను . ఇట్లు .బ్లాగ్ అడ్మిన్ .

▼

25, నవంబర్ 2018, ఆదివారం

Banana fruit is a healthy fruit that everyone needs


అందరికి అవసరమైన ఆరోగ్యదాయకమైన  ఫలం అరటి పండు 

కొన్ని పండ్లు కొన్ని సీజన్స్ లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతి రోజు దొరుకుతాయి, అలా ప్రతి రోజు దొరికే పండ్లలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది అరటి పండు.  మన భారతీయ సంస్కృతిలో  ఏ శుభకార్యం నిర్వహించబడినా అరటిచెట్టు, అరటి ఆకు, అరటి పండు అనేవి 

లేకుండా ఉండవు.  అరటిని ‘కదళీ’, ‘రంభా’ అనే పేర్లతో కూడా పిలుస్తారు.  

రామాయణంలో అరటి ప్రాముఖ్యత వివరించబడితే, భాగవతంలో అరటి 

ఆవిర్భావమును గురించి వివరించబడింది.


అరటి జన్మ వృత్తాంతం.

సృష్టి ఆదిలో విరాట్ స్వరూపునితో పాటు లక్ష్మీ, దుర్గ, వాణి, సావిత్రి, అనే పంచ శక్తులు ఆవిర్భవించాయి. ఈ ఐదుగురిలో రాధ, సావిత్రులది సమాన సౌందర్యం. అయితే సావిత్రి తన సౌందర్యాన్ని చూసుకుని గర్వించడం ప్రారంభించడం విరాట్ మూర్తి ఆమెను “బీజం లేని చెట్టు” గా భూలోకంలో జన్మించమని శపించాడు. తన తప్పును తెలుసుకున్న సావిత్రి విధి లేక భూలోకంలో కదళీ (రంభ) పేరుతో అరటిచెట్టుగా జన్మించింది. తన శాపవిముక్తి కోసం ఐదువేల సంవత్సరాలు విరాట్ మూర్తికి ఘోర చేసింది. కదళీ తపస్సును మెచ్చిన విరాట్ మూర్తి ప్రత్యక్షమై, ఆమెకు పుణ్యలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు. అంతే కాకుండా అం అంశ రూపమైన కదళిని మానవ, మాధవసేవ నిమిత్తం భూలోకంలోనే ఉండమని ఆదేశించాడు. విరాట్ మూర్తి ఆదేశం పొందిన ఆ పర్వదినమే మాఘకృష్ణ చతుర్థశి. దీనినే అరటి చతుర్థశి అని కూడా అంటారు.

రామాయణం లో అరటి చెట్టు ప్రాముఖ్యత: 


  • రామాయణంలో అరటి ప్రాముఖ్యతను, పూజా విధానాన్ని గురించి భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్లు ఉండి. మాఘ చతుర్థశి ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి, పెరటిలోనున్న అరటినిగానీ, లేదా అరటి పిలకనుగానీ పూజ చేయవచ్చు. పసుపుకుంకుమలతో, పుష్పాలతో చక్కగా అరటికాండాన్ని అలంకరించి, దీపారాధన చేయాలి. దూపానంతరం పెసరపప్పు బెల్లం, 14 తులసీ దళాలు (నాలుగు ఆకులు ఉండాలి) నైవేద్యంగా సమర్పించాలి. మధ్యాహ్న సమయంలో ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టి, వారికఇ అరటిదవ్వ, ఐదు అరటి పండ్లను దానమివ్వాలి. ఈ పూజను చేసినవారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు. సాయంత్రం చంద్రదర్శనం అయిన పిమ్మట భోజనం చేయాలి. ఈ అరటి పూజ చేసిన వారికి చక్కని సంతానము కలుగుతుంది. ఆ సంతానానికి ఉన్నత కలుగుతుంది. రామాయణంలో అరటిపూజను సీతారాములు చేసినట్లు తెలియుచున్నది.
  • రావణాసురుని వధానంతరం శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరి అక్కడ విడిది చేశారు. తరువాత శ్రీరాముడు భరతునికి తన రాకను గురించి తెలియచేయమని మారుతుని పంపాడు. హనుమంతుడు ఆ వార్తను భరతునికి చెప్పి, తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రీరామునితో సహా అందరూ మధ్యాహ్న భోజనానికి అరటి ఆకులలో తినడానికి ఉపక్రమిస్తున్నారు. మారుతికి అరటిఆకు కరువైంది. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని గొప్పదనాన్ని అక్కడివారికి తెలియ జేయడానికి, తన కుడివైపున మారుతిని కూర్చోమని ఒక సైగ చేసాడు. భరద్వాజ మహర్షి చేసేదిలేక ఆ అరటి ఆకులోనే ఒక ప్రక్కన హనుమంతునికి వడ్డన చేసాడు. భోజన కార్యక్రమం ముగిసిన తరువాత అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ శ్రీరాముడు ఈవిధంగా వివరించి చెప్పాడు.


  • శ్రీరాముని పూజలోగాని, మారుతిపూజలోని గానీ ఎవరైతే మాకు అరటిఆకులో అరటిపండ్లను అర్పిస్తారో, వారికి మా ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి అంతేకాకుండా, జ్యేష్ఠమాసం శుక్ల తదియనాడు ఎవరైతే పైవిధంగా ఇద్దరికీ సేవ చేస్తారో, వారి తరతరాలకు సంతానలేమి ఉండదు. గృహస్థులు అతిథిసేవల్లో అరటి ఆకును వినియోగించితే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
  • పూజార్హమైన ఫలాలు ఎన్ని ఉన్నా అరటిపండును పూర్ణఫలం అనంటారు. ఎందుకు అనేది  తెలుసుకుందాము.  భగవంతునికి సమర్పించడానికి ఈ ప్రకృతిలో ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ కేవలం అరటిపండు, కొబ్బరి కాయకు మాత్రమే అగ్ర తాంబూలం లభిస్తుంది. కాబట్టి, భగవంతునితో శాశ్వతబంధాన్ని ఏర్పరచే సంపూర్ణ ఫలాలు అరటి పండు, కొబ్బరికాయ మాత్రమే. దీనికి కారణం, సృష్టిలోని అన్ని ఫలాలను ఆరగించి, వాటిలోని విత్తనాలను నమిలి పారవేస్తాం. అలా ఆరగించడంతో ఆ విత్తనాలు ఎంగిలిపడతాయి. ఆ విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఏర్పడి ఫలాలను ఇస్తాయి. అలా లభించిన ఫలాలు మరలా ఎంగిలిపడిపోతున్నాయి. అటువంటి ఎంగిలి పడ్డ ఫలాలను భగవంతునికి నివేదించడం అంత  శ్రేష్ఠం కాదు.  కాని, అరటిపండులో సావిత్రి విరాట్ మూర్తి శాపం వల్ల బీజంలేని చెట్టుగా ‘భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది. కాబట్టి అరటి చెట్టు విత్తనాల ద్వారా కాక, పిలకల ద్వారా మొలిచి, అన్ని కాలాలలోనూ అరటి పండ్లును ఇస్తాయి. అలా అరటిపండు పూర్ణఫలంగా విఖ్యాతిని పొందింది.

  • అరటిపళ్ళు  మన హిందూ సంప్రదాయం లో ఒక భాగంగా తరచు వాడుతుంటాం. దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడికి అర్పిస్తుంటాం. పండగలు, వ్రతాలూ వచ్చినప్పుడు కూడా వాడుతాం. ఆవులకి పెడతాం. చౌకగ మార్కెట్లో దొరికే ఈ పండు ప్రయోజనాలు చూస్తే ఆశ్చర్య పోతారు.

అరటిపళ్ళు తినడం వాళ్ళ ఒనగూరే  ఆరోగ్య ప్రయోజనాలు 

·        ఎదిగే పిల్లలు , చదువుకొనే పిల్లలు , తక్కువ బరువు ఉన్నవారిలో శరీర దారుద్యానికి , జ్ఞాపకశక్తికి అరటిపండు ఎంతగానో సహాయపడుతుంది.  అరటిపండులో  క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి , అధికమొత్తంలో యాంటి-ఆక్సిడెంట్లు , మినరల్స్ , విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా C విటమిన్ & B6 అధికమొత్తంలో ఉంటుంది. ఇంకా పొటాషియం అధికమొత్తంలో ఉంటుంది.
·        తక్కువ బరువుతో బాధపడేవారు , బరువు పెరగడానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ లో మరియు రాత్రి పడుకొనే ముందు ఒక అరటిపండు తిని ఒక గ్లాస్ పాలు త్రాగాలి.
·        అధికబరువు ఉన్నవారు మాత్రం బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవచ్చు. మద్యాహ్నం , రాత్రి తీసుకోవాలనుకుంటే బోజనానికి ముందు తీసుకోవచ్చు. ఎందుకంటే క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.
·        మొలలు(ఫైల్స్) వ్యాధిని తగ్గిస్తుంది , అల్సర్లు తో బాధపడేవారికి అరటిపండు ఉపసమనం కలిగిస్తుంది.
·        మతిమరుపు సమస్యను తగ్గించి , బ్రెయిన్ పవర్ పెంచుతుంది.
·        రక్త హీనత లేకుండా చేస్తుంది, బీపి , గుండెజబ్బులు రాకుండా చేస్తుంది.
·         మొత్తంగా శరీర జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.
·        సుఖవిరేచనం కావడానికి అరటిపండు ఎంతగానో దోహదపడుతుంది. శరీరానికి కావాల్సిన పీచు పదార్ధం అందుతుంది.
·       స్త్రీలలో వచ్చే రుతుక్రమ సమస్యలను తగ్గిస్తుంది.
·        స్పోర్ట్స్ టోర్నమెంట్ లో ఎక్కువగా ఆట ఆడేవాళ్ళు కు అరటిపండు సత్వరం శక్తిని ఇస్తుంది.
·        కంటి చూపు మెరుగుపడడానికి
·        వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి అరటిపండు మంచి ప్రయోజనకారి.
·         నల్ల మచ్చలు అరటిపండు తింటే కాన్సర్ రాకుండా కాపాడుతుంది .
·        ఎముకలు గుల్లబారిపోకుండా , దృడంగా ఉండేలా చేస్తుంది.
·        మోకాళ్ళు , కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు అరటిపండు తీసుకోవాలి.

కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్నా అరటిపండును నిత్య జీవితంలో తప్పని సరిగా తీసుకోవాలి.

అరటిపండు గురించి వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి ...

అరటి - వికీపీడియా


https://te.wikipedia.org/wiki/అరటి
Translate this page
పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది.
‎చరిత్ర · ‎ధర్మాలు · ‎పోషక విలువలూ ... · ‎అరటి తో వైద్యము

అరటిపండు గురించి వివరాలకు ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్  లింక్ 

లు  చూడండి ...

పరగడుపున అరటిపండు తింటే అద్బుతాలు జరుగుతాయి ...


https://www.youtube.com/watch?v=zvI8757W71w
 - Translate this page
Video for అరటిపండు▶ 3:07
Oct 26, 2017 - Uploaded by E Junction
Watch పరగడుపున అరటిపండు తింటే అద్బుతాలు జరుగుతాయి Surprising Benefits Of Eating Banana Early In Morning E Junction.


ఒక్క అరటిపండు మీ జీవితాన్నే మార్చేస్తుంది ...


https://www.youtube.com/watch?v=q0xz_qp1dDA
 - Translate this page
Video for అరటిపండు▶ 2:16
May 8, 2017 - Uploaded by Friday Cocktail
ఒక్క అరటిపండు మీ జీవితాన్నే మార్చేస్తుంది | Benefits Of Banana Are Unbelievable | Friday Cocktail Visit our Website: http://www.myfridayposter ...

అరటిపండు వలన ఆరోగ్యానికి కలిగే లాభాలు.! | Amazing ...


https://www.youtube.com/watch?v=PsalSPNlVtQ
 - Translate this page
Video for అరటిపండు▶ 2:37
Jul 31, 2017 - Uploaded by Guntur mirchi
 created this video with the YouTube Video Editor (http://www.youtube.com/editor)అరటిపండు వలన ఆరోగ్యానికి కలిగే ...

అరటిపండు వలన కలిగే ఎన్నో ప్రయోజనాలు గురించి ...


https://www.youtube.com/watch?v=IjF5jMoqhlg
 - Translate this page
Video for అరటిపండు▶ 1:30
Dec 3, 2017 - Uploaded by Movie Mantra
Watch అరటిపండు వలన కలిగే ఎన్నో ప్రయోజనాలు గురించి తెలుసుకోండి || health benefits of banana || health tips A Production House by Surya Bhagawan Creations. Thi...



అరటిపండు వలన కలిగే లాభాలు || Banana Benefits || Mee TV ...


https://www.youtube.com/watch?v=HfBSgRqVCS8
 - Translate this page
Video for అరటిపండు▶ 2:07
Mar 3, 2017 - Uploaded by Mee TV Health
అరటిపండు వలన కలిగే లాభాలు Banana Benefits Mee TV Health banana, banana uses, banana fruit, banana diet, banana health ...

అరటిపండు తినడం వలన కలిగే టాప్ 10 ఆరోగ్య ... - YouTube


https://www.youtube.com/watch?v=8ISlur24zSQ
 - Translate this page
Video for అరటిపండు▶ 2:27
Mar 7, 2018 - Uploaded by Latest Filmy Gossips
This Video about అరటిపండు తినడం వలన కలిగే టాప్ 10 ఆరోగ్య ప్రయోజనాలు | Health Benefits of Bananas | Filmy Gossips. All you need to do is hit the subscribe ...
అరటిపండు తో ఎన్ని లాభాలో తెలుసా || banana uses ...

https://www.youtube.com/watch?v=xIKuW8bbLWY
 - Translate this page
Video for అరటిపండు▶ 1:56
Nov 28, 2017 - Uploaded by Mana Health Channel
Watch banana uses Watch Mana Health Channel : ఆరోగ్యకరమైన జీవన సరళికి... అందాన్ని ఇనుమడింపచేసేందుకు... అందమైన చర్మ సొందర్యం కోసం ...


Note:
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి .
అలాగే నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి. నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి. మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .


వద్ద నవంబర్ 25, 2018
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

నా గురించి

నా ఫోటో
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.