General News,Humanity,Mythology,Psychology,Health, Employment,Biographies

ప్రియమైన మిత్రులకు, మన wowitstelugu.com కు స్వాగతం-సుస్వాగతం సాధారణ వార్తలు,మానవత్వం, విశ్వాసాలు, మానసిక శాస్త్రం,ఆరోగ్యం,ఉద్యోగం,జీవిత చరిత్రలు, మున్నగునవి తెలుగులో తెలుగు భాష తెలిసిన వారందరికీ అర్దమైయే లా ఈ బ్లాగ్ లో పొందుపరచడం జరిగింది. బ్లాగ్ చదివి మీ విలువైన సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను . ఇట్లు .బ్లాగ్ అడ్మిన్ .

▼

16, నవంబర్ 2018, శుక్రవారం

Learn about the number of Hindu gods and their avatars in the Hindu mythology

హిందూ పురాణాలలో ఎన్ని భగవంతుడి అవతారాలు ఉన్నాయో అవి ఏమిటో వాటి గురించి తెలుసుకోండి 

పైన ఉదాహరించి చిత్రాలు దశావతారములు 

ఏకవింశతి అవతారములు

లోకపాలనకై విష్ణువు ధరించిన 21 అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు

ఏకవింశతి 21 అవతారాలు గురించి ఇప్పుడు తెలుసుకొందాం 

మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాధలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించబడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.
శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు - అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.



1.    బ్రహ్మ అవతారము: దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.



  2.     వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని  యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.


  3.     నారద అవతారము: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవతంత్రాన్ని తెలియజేశాడు.



4. నర నారాయణ అవతారము: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.

   5.   కపిల అవతారము: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.

6.     దత్తాత్రేయ అవతారము: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.

  7.  యజ్ఞుడు యజ్ఞ అవతారము: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.


   8.  ఋషభ అవతారము: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.

   9. పృధు అవతారము: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.


  10.  మత్స్య అవతారము: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.

 11.  కూర్మ అవతారము: దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.


12.  ధన్వంతరీ అవతారము: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.

  13.  మోహినీ అవతారము: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.



  14.  వరాహావతారం: వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము. భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.

   
 15నృసింహ అవతారము: లోకకంటకుడైన హిరణ్యకశిపుని  సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలు వెడలినాడు



16.  వామన అవతారము: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.


  17.  పరశురామ అవతారము: మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్కమారులు దండెత్తి వారిని దండించాడు.




18.  వ్యాస అవతారము: కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.



  
 19.  రామ అవతారము: పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు.



20.  బలరామ అవతారము, కృష్ణ అవతారము: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.


   
  21.  బుద్ధ అవతారము: కలియుగాది సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు.


22.కల్కి అవతారము: కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగలడు. 


భగవంతుని లీలావతారాలు

భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి.
1.     వరాహావతారం - భూసముద్ధరణం
2.     సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం
3.     కపిలావతారం - బ్రహ్మవిద్యా ప్రతిపాదనం
4.     దత్తాత్రేయావతారం - మహిమా నిరూపణం
5.    సనకాద్యవతారం(సనక,సనందన,సనత్సుజాత,సనత్కుమారులు)   - బ్రహ్మవిద్యా సముద్ధరణం
6.     నరనారాయణావతారం - కామజయం
7.     ధ్రువావతారం - ధ్రువపదారోహం
8.     పృథురాజావతారం - అన్నసమృద్ధికరణం
9.     ఋషభావతారం - పరమహంస మార్గోపదేశం
10.  హయగ్రీవావతారం - వేదజననం
11.  మత్స్యావతారం - వేద సంగ్రహం
12.  కూర్మావతారం - మందర ధారణం
13.  ఆదిమూలావతారం - గజేంద్ర రక్షణం
14.  వామనావతారం - బలిరాజ యశోరక్షణం
15.  హంసావతారం - భాగవత యోగోపదేశం
16.  మన్వవతారం - మనువంశ ప్రతిష్ఠాపనం
17.  పరశురామావతారం - దుష్టరాజ భంజనం
18.  రామావతారం - రాక్షస సంహారం
19.  కృష్ణావతారం - లోకకళ్యాణం
20.  వ్యాసావతారం - వేద విభజనం
21.  బుద్ధవతారం - పాషండ ధర్మ ప్రచారం
22.  కల్క్యవతారం - ధర్మ సంస్థాపనం

ఈ క్రింది  యు ట్యూబ్  యూ. ఆర్.యల్. చూసి చాల వివరాలు తెలుసుకోండి... 

దశావతారములు - వికీపీడియా


https://te.wikipedia.org/wiki/దశావతారములు

Translate this page
చాలాకాలము నుండి విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, జమదగ్న్య, రామ, కృష్ణ, కల్కి ...

‎భగవద్గీతలో ... · ‎విశేషాలు · ‎శ్రీ వేంకటేశ్వర ...

10 Avatars of Lord Vishnu - YouTube

https://www.youtube.com/watch?v=kD83c7ISh9A

Video for విష్ణు అవతారాలు▶ 5:04
Jul 31, 2016 - Uploaded by WHAT A SCENE
10 Ten Avatars of Lord Vishnu. Matsya (the fish) Avatar Koorma (the tortoise) Avatar Varaha (the boar) Avatar ...

శ్రీ మహావిష్ణు అవతారాలు | Ramavataram Story ... - YouTube

https://www.youtube.com/watch?v=5l0yYy8lpBI
 - Translate this page
Video for విష్ణు అవతారాలు▶ 11:44
Oct 1, 2018 - Uploaded by TFC Spiritual
శ్రీ మహావిష్ణు అవతారాలు | Sri Ramavataram Story of Lord Vishnu (Part-2) | Dasavatars of Vishnu || TFC Spiritual Sri Rama ...

శ్రీ మహావిష్ణు అవతారాలు | Vamana Avatar Story ... - YouTube

https://www.youtube.com/watch?v=5HGFWK493e0
 - Translate this page
Video for విష్ణు అవతారాలు▶ 8:11
Sep 10, 2018 - Uploaded by TFC Spiritual
శ్రీ మహావిష్ణు అవతారాలు | Vamana Avatar Story of Lord Vishnu | Dasavatars ofVishnu || TFC Spiritual Vamana అవతార్ is the ...

శ్రీ మహావిష్ణు అవతారాలు | Narasimha Avatar ... - YouTube

https://www.youtube.com/watch?v=mkq0BeZ2vBA
 - Translate this page
Video for విష్ణు అవతారాలు▶ 5:41
Aug 18, 2018 - Uploaded by TFC Spiritual
శ్రీ మహావిష్ణు అవతారాలు || Narasimha Avatar Story of Lord Vishnu || Dasavatars ofVishnu | TFC Spiritual https://www ...

శ్రీ మహావిష్ణు 21 అవతారాలు ఏవి/Reason ... - YouTube


https://www.youtube.com/watch?v=btQGy30ZUu8
 - Translate this page
Video for విష్ణు అవతారాలు▶ 5:09
Sep 20, 2018 - Uploaded by Telugu Info Media-Telugu Facts Mysteries
శ్రీ మహావిష్ణు 21 అవతారాలు ఏవి/Reason Behind Lord Vishnu's DASAVATARALU/Unknown Facts DASAVATARALU. Telugu Info Media ...

శ్రీ మహావిష్ణు అవతారాలు | Matsya Avatar Story ... - YouTube


https://www.youtube.com/watch?v=ueQ77St-zn8
 - Translate this page
Video for విష్ణు అవతారాలు▶ 6:50
Aug 6, 2018 - Uploaded by TFC Spiritual
శ్రీ మహావిష్ణు అవతారాలు | Matsya Avatar Story of Lord Vishnu | Dasavatars ofVishnu || TFC Spiritual ▻SUBSCRIBE TO TFC ...

LORD VISHNU 10 AVATAR | మహా విష్ణు అవతారాలు - YouTube


https://www.youtube.com/watch?v=ETyxelRPRcM
Translate this page
Video for విష్ణు అవతారాలు▶ 1:02
Dec 6, 2016 - Uploaded by Fashion 9
LORD VISHNU 10 AVATAR మహా విష్ణు అవతారాలు - దశావతారాలు Sri Maha Vishnu avataralu Dashavataralu  Please ...

శ్రీ మహావిష్ణు దశావతారాలు | Lord Vishnu 10 Avatars ...


https://www.youtube.com/watch?v=vzRH2SHXCcs
Translate this page
Video for విష్ణు అవతారాలు▶ 1:15
Mar 18, 2017 - Uploaded by Samskruthi
శ్రీ మహావిష్ణు దశావతారాలు | Lord Vishnu 10 Avatars. Samskruthi. Loading. ... Dashavatara refers to the 10 avatars of Hindu God ..



Note:
నా  బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి .
అలాగే ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి. నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి. మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .

వద్ద నవంబర్ 16, 2018
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

నా గురించి

నా ఫోటో
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.